బీజేపీకి ఝలక్.. దీపిక పదుకోన్‌కు కేంద్ర మంత్రి మద్దతు..

జేఎన్‌యూను సందర్శించినందుకు బాలీవుడ్ నటి దీపిక పదుకోన్‌‌పై పలువురు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఆమెకు ఓ కేంద్ర మంత్రి మద్దతుగా నిలిచారు.

news18-telugu
Updated: January 15, 2020, 5:41 PM IST
బీజేపీకి ఝలక్.. దీపిక పదుకోన్‌కు కేంద్ర మంత్రి మద్దతు..
దీపిక పదుకోన్
  • Share this:
జేఎన్‌యూను సందర్శించినందుకు బాలీవుడ్ నటి దీపిక పదుకోన్‌‌పై పలువురు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఆమెకు ఓ కేంద్ర మంత్రి మద్దతుగా నిలిచారు. ఆయనెవరో కాదు.. కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో. ఆమెను విమర్శిస్తున్న వాళ్లు ఇప్పటికైనా తమ పద్ధతి మార్చుకోవాలని, ఆమెపై ట్రోల్స్‌ను తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. ఈ దేశంలో ఎవరికైనా, ఎక్కడికైనా వెళ్లే హక్కు ఉందని, అది రాజ్యాంగం కల్పించిన హక్కు అని అన్నారు. దీపిక అంటే తనకు చాలా ఇష్టమని, ఆ ఇష్టంతోనే తన కూతురికి నైనా అనే పేరు పెట్టానని వెల్లడించారు. ఆమెను తాను ఆరాధిస్తానని చెప్పారు.

‘దీపిక అంటే నాకు చాలా ఇష్టం. ఆమె నటించిన యే జవాని హే దివానీ అనే సినిమాలో దీపిక పాత్ర పేరు నైనా అన్న పేరునే నా కూతురికి పెట్టాను.’ అని బాబుల్ సుప్రియో తెలిపారు. అయితే.. దీపికతో పాటు జేఎన్‌యూకు వచ్చిన కొందరిలో విధ్వంసకారులు ఉన్నారని ఆయన స్పష్టం చేశారు.

First published: January 15, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు