Mamata vs CBI : బెంగాల్ సర్కార్‌పై సీరియస్... గవర్నర్ నివేదిక కోరిన కేంద్ర హోంశాఖ

Mamata vs CBI : బెంగాల్‌లో మమతా బెనర్జీ దీక్ష కొనసాగుతోంది. అక్కడి తాజా పరిస్థితులపై నివేదిక ఇవ్వాల్సిందిగా కేంద్ర హోంశాఖ ఆ రాష్ట్ర గవర్నర్‌ను ఆదేశించింది. నెక్ట్స్ ఏం జరగబోతోంది. కేంద్రం రాష్ట్రపతి పాలన తేవాలనుకుంటోందా?

Krishna Kumar N | news18-telugu
Updated: February 4, 2019, 12:44 PM IST
Mamata vs CBI : బెంగాల్ సర్కార్‌పై సీరియస్... గవర్నర్ నివేదిక కోరిన కేంద్ర హోంశాఖ
మమతా బెనర్జీ (Image : ANI / Twitter)
  • Share this:
కేంద్రం తీరును నిరసిస్తూ... ఆదివారం రాత్రి నుంచీ ఆహారం తీసుకోకుండా సత్యాగ్రహ దీక్షకు దిగిన తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ... సోమవారం దీక్షను కొనసాగిస్తున్నారు. అరెస్టు వారెంట్ లేకుండా... కోల్‌కతా పోలీస్ కమిషనర్‌ను ప్రశ్నించేందుకు సీబీఐ అధికారులు ఆయన ఇంటికి రావడాన్ని నిరసిస్తూ... మమతా బెనర్జీ... ఆయన ఇంటి దగ్గరే ఈ నిరసన దీక్ష చేపట్టారు. ఆమెకు మద్దతుగా బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనలు చేస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై సమీక్ష జరిపిన కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్... పరిణామాల్ని నిశితంగా పరిశీలిస్తోంది. ఏం జరిగిందో పూర్తి వివరాలతో వెంటనే నివేదిక ఇవ్వాలని బెంగాల్ గవర్నర్‌ని ఆదేశించారు రాజ్‌ నాథ్ సింగ్. దాంతో గవర్నర్... ఆ రాష్ట్ర సీఎస్, డీజీపీలను తక్షణమే నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.

mamata banerjee, mamata banerjee news, mamata banerjee dharna, chief minister mamata banerjee, mamata banerjee live, mamata banerjee speech, mamta banerjee latest, mamta banerjee cbi, mamta banerjee dharna against cbi raid, mamata banerjee sit on strike against cbi raid, మమతా బెనర్జీ, సీబీఐ
మమతా బెనర్జీ (Image : ANI / Twitter)


శారదా చిట్‌ఫండ్‌, రోజ్‌వ్యాలీ స్కాం కేసుల దర్యాప్తులో భాగంగా కోల్‌కతా సీపీని ప్రశ్నించడానికి వెళ్లిన సీబీఐ అధికారులను పోలీసులు అదుపులోకి తీసుకొని విడుదల చేశారు. కేంద్రమే సీబీఐని కక్ష పూరితంగా పంపిందంటూ... మమతా బెనర్జీ మెట్రో ఛానల్‌ ఎదుట దీక్షకు దిగారు.

మమతా బెనర్జీ 13 ఏళ్ల కిందట అప్పటి లెఫ్ట్ ప్రభుత్వ విధానాల్ని వ్యతిరేకిస్తూ 26 రోజులపాటు నిరాహార దీక్ష చేశారు. మళ్లీ ఇప్పుడు దీక్ష చేస్తుండటంతో... దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలూ బెంగాల్ వైపు ఆసక్తిగా చూస్తున్నాయి. కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, దేవెగౌడ, స్టాలిన్, తేజస్వీయాదవ్, ఒమర్ అబ్దుల్లా, కేజ్రీవాల్, అఖిలేష్ యాదవ్ తదితరులు మమతకు మద్దతు తెలిపారు.

 

Video : దీక్షా శిబిరంలోనే వాకింగ్ చేసిన మమతా బెనర్జీ
First published: February 4, 2019, 12:39 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading