సొంత కారుంటే వంట గ్యాస్ సబ్సిడీ కట్ ?

పెట్రోలియం ఉత్పత్తులపై ఇచ్చే సబ్సిడీ 2 018-19 ఆర్థిక సంవత్సరంలో నాలుగేళ్ల గరిష్టానికి తాకడంతో ఈ నిర్ణయంపై కేంద్రం ఆయా శాఖలతో చర్చలు జరుపుతోంది.

news18-telugu
Updated: March 23, 2019, 7:20 AM IST
సొంత కారుంటే వంట గ్యాస్ సబ్సిడీ కట్ ?
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
వంట గ్యాస్‌పై మరోసారి కేంద్ర ప్రభుత్వం సంచలనాత్మక నిర్ణయం తీసుకొనేందుకు సిద్ధహవుతుంది. లోక్‌సభ ఎన్నికల తర్వాత వంటగ్యాస్ సబ్సిడీ స్కీంను రేషనలైజ్‌చేసి అర్హులైన పేదలకు మాత్రమే రాయితీ కల్పించాలని ఆలోచిస్తోంది. పెట్రోలియం ఉత్పత్తులపై ఇచ్చే సబ్సిడీ 2 018-19 ఆర్థిక సంవత్సరంలో నాలుగేళ్ల గరిష్టానికి తాకడంతో ఈ నిర్ణయంపై కేంద్రం ఆయా శాఖలతో చర్చలు జరుపుతోంది. పెట్రోలియం ఉత్పత్తుల్లో ప్రభుత్వం ఇచ్చే రాయితీల్లో అత్యధికంగా వంటగ్యాస్ సిలిండర్లపైనే ఇస్తుండటంతో పేదల్ని గుర్తించేందుకు వార్షికాదాయ పరిమితిని కూడా తగ్గించబోతోంది. వంటగ్యాస్ సిలిండర్లపై ఇచ్చే రాయితీని 2016 నుంచి అమలు చేస్తున్నారు. ప్రస్తుతం ఏడాదికి పదిలక్షల్లోపు వార్షికాదాయం గలవారికే సబ్సిడీ ఇస్తున్నారు.

అంతేకాకుండా ఇందులో భాగంగానే సొంతకారు ఉన్నవారికి వంట గ్యాస్ సబ్సిడీ ఎత్తేసే ఆలోచన చేస్తోంది. ఇప్పటికే దేశంలోని ఆర్టీఏ కార్యాలయాల నుంచి సమాచారం కూడా సేకరించింది. సొంతకారు కలిగిన వారి ఆస్తులు, ఆదాయంపై కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. లోక్‌సభ ఎన్నికల తర్వాత ఏర్పాటయ్యే నూతన ప్రభుత్వం గయాస్ సబ్సిడీ రాయితీపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
First published: March 23, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading