Updated: September 25, 2018, 2:01 AM IST
ప్రతీకాత్మక చిత్రం
కేంద్ర ప్రభుత్వం త్వరలోనే స్టీలు, విలువైన రాళ్లు, ఎలక్ట్రానిక్ వస్తువుల దిగుమతులపై టాక్స్ పెంచే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే వీటిలో బంగారానికి మినహాయింపు ఉంటుందని..బంగారం స్మగ్లింగ్ ను అరికట్టడానికి దాన్ని మినహాయించనున్నట్లు ఆర్థిక శాఖకు చెందిన అధికారి మీడియాకు వెల్లడించారు.
ప్రస్తుతం అమెరికా - చైనా మధ్య జరుగుతున్న వాణిజ్య యుద్ధం కారణంగా అక్కడి చాలా వస్తువులు భారత్ ను మించేతుత్తాయన ఆందోళనతో ఈ టాక్స్ పెంపు గురించి కేంద్రం ఆలోచిస్తోందని ఆ అధికారి తెలిపారు. ఇలా దిగుమతులపై సుంకాలు విధించడం వల్ల రూపాయి పతనాన్ని అడ్డుకోవచ్చని భావిస్తోందని, మన దిగుమతుల్లో 80 శాతం చమురు కొనుగోలుపైనే ఖర్చుపెడుతున్నామన్నారు. అంతర్జాతీయ మార్కెట్ లో రూపాయిని బలోపేతం చేయడానికి కేంద్రం ఇతర ప్రయత్నాలతో పాటు చమురు కొనుగోలుపై పెట్టే ఖర్చును కూడా తగ్గించే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.
Published by:
Vijay Bhaskar Harijana
First published:
September 25, 2018, 2:01 AM IST