Drone : డ్రోన్‌ల క‌ద‌లిక‌పై డేగ క‌న్ను.. ట్రాఫిక్ నియంత్ర‌ణ‌పై కేంద్రం ప్ర‌ణాళిక‌

(ప్రతీకాత్మక చిత్రం)

దేశంలో డ్రోన్‌ల (Drones) వినియోగం రోజు రోజుకు పెరుగుతోంది. అంతే కాకుండా కేంద్రం డ్రోన్ వినియోగంపై ఇప్ప‌టికే చ‌ట్టం కూడా చేసింది. ఈ నేప‌థ్యంలో డ్రోన్‌ల వినియోగంపై వాటి ట్రాఫిక్ క్ర‌మ‌ద్దీక‌ర‌ణ‌కు కేంద్ర పౌర విమాన‌శాఖ ప్ర‌త్యేక ప్ర‌ణాళిక రూపొందించింది.

  • Share this:
    దేశంలో డ్రోన్‌ల (Drones) వినియోగం రోజు రోజుకు పెరుగుతోంది. అంతే కాకుండా కేంద్రం డ్రోన్ వినియోగంపై ఇప్ప‌టికే చ‌ట్టం కూడా చేసింది. ఈ నేప‌థ్యంలో డ్రోన్‌ల వినియోగంపై వాటి ట్రాఫిక్ క్ర‌మ‌ద్దీక‌ర‌ణ‌కు కేంద్ర పౌర విమాన‌శాఖ ప్ర‌త్యేక ప్ర‌ణాళిక రూపొందించింది. ఈ ట్రాఫిక్ నిబంధ‌న‌ల‌ (Traffic Rules)కు సంబంధించిన గైడ్‌లైన్‌ల‌ను కూడా విడుద‌ల చేసింది.ప‌లు సంస్థ‌లు డ్రోన్‌ల‌ను వినియోగించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాయి. ప్రైవేటు, తార్డ్ పార్టీ సేవ‌లకు వినియోగించే డ్రోన్లన్నీ 1,000 అడుగుల ఎత్తుకు మించకుండా ఎగరాల్సి ఉన్నందున ఆ మేరకు కేంద్రం నిబంధనలు రూపొందించింది. ఇప్ప‌టికే కేంద్ర ప్రభుత్వం (Central Government) డ్రోన్‌ల (Drones) వినియోగానికి (Usage) భారత భూభాగాన్ని అనుకూలంగా మార్చే లక్ష్యంతో నూతన డ్రోన్​ పాలసీని (New Drone Policy) ప్రవేశపెట్టింది. పాత నిబంధనల్లో అనేక మార్పులు చేసింది.

    నిబంధ‌న‌లు ఇవే..
    - ప్రభుత్వం ఏర్పాటు చేసే డిజిటల్‌ స్కై వ్యవస్థ ద్వారా డ్రోన్‌ నిర్వా హకులు అనుమతులు పొందాలి.
    - డ్రోన్‌ల వినియోగం విష‌యంలో నిర్వ‌హ‌కుడు కేంద్రానికి స‌మాచారం అందించాలి. ఎక్క‌డ వినియోగిస్తున్నారు. ఎందుకు వినియోగిస్తున్నారో స‌మాచారం ఇవ్వాలి.
    - ఈ సేవలు అందించే సంస్థకు తొలుత తక్కు వ పరిధిలో ఉండే భౌగోళిక ప్రాంతాన్ని కేటాయిస్తారు. అనంతరం ప‌నుల అవ‌స‌రాలు ప్ర‌భుత్వ నిర్ణ‌యాల ద్వారా డ్రోన్ నిర్వ‌హ‌ణ పరిధిని విస్తరిస్తారు.

    Agni-V Ballistic Missile : అమ్ముల పొదిలోని "అగ్ని".. అణ్వాయుధ సామర్థ్యం గల అగ్ని-5 బాలిస్టిక్ క్షిపణిని ప‌రీక్షించిన భార‌త్‌



    - ఈ సేవలు అందించినందుకు ఆయా సంస్థలు ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాకు రుసుం చెల్లించాలి.
    -ఈ సేవలు అందించే సంస్థలు ఆటోమేటెడ్‌గా పనిచేసే ఆల్గారిథం ఆధారిత సాఫ్ట్‌వేర్‌ను ప్రవేశపెట్టాల్సి ఉంటుంది.

    కొత్త నిబంధ‌న‌లతో అనుమ‌తులు సుల‌భం..
    కేంద్రం డ్రోన్ పాలసీ 2021 పేరుతో విడుదలైన ఈ నిబంధనలు డ్రోన్ల వినియోగానికి మార్గం సుగమనం చేసేలా ఉన్నాయి. ఒక డ్రోన్ సొంతం చేసుకోవాలంటే గతంలో ఫారమ్స్ అధికారులకు సమర్పించడంతో పాటు పలు అనుమతులు తీసుకోవాల్సి వచ్చేది. ప్రభుత్వం చెప్పిన 25 నిబంధనలను పాటించిన వారికేడ్రోన్‌లను సొంతం చేసుకోవడానికి వీలు పడేది. కానీ డ్రోన్ పాలసీ 2021 ప్రకారం కేవలం ఫారమ్స్, అనుమతులు మొత్తం కలిపి ఐదు రూల్స్ పాటిస్తే సరిపోతుంది. అలాగే కేంద్రం డ్రోన్ల అనుమతుల కోసం చెల్లించే ఫీజును నామమాత్రం చేసింది. డ్రోన్‌లను సొంతం చేసుకోవడానికి.. ఆపరేట్ చేయడానికి పాటించాల్సిన విధానంలో అనేక సడలింపులు ప్రకటించింది.

    ప్రైవేట్ డ్రోన్ యూజర్లను ప్రోత్సహించ‌డానికే..
    కేంద్రం ఎక్కువమంది వ్యక్తులను డ్రోన్‌లు ఉపయోగించమని ప్రోత్సహిస్తోంది. ఇందుకుగాను కొత్త డ్రోన్ రూల్స్ 2021 ఏవైనా ఉల్లంఘించినందుకు గరిష్ట జరిమానా రూ.1 లక్షకు తగ్గించింది. భారతదేశంలో డ్రోన్‌లను బదిలీ చేయడం, రిజిస్ట్రేషన్ రద్దు చేసే విధానాలు కూడా సడలింపులు ప్రకటించింది. వినోద లేదా సాధారణ వినియోగదారులకు నానో/మైక్రో డ్రోన్‌లను కొనుగోలు చేయడానికి.. వినియోగించడానికి పైలట్ లైసెన్స్‌లు అవసరం లేదని కేంద్రం స్పష్టం చేసింది.
    Published by:Sharath Chandra
    First published: