Home /News /national /

CENTRAL GOVT GETTING GOOD REVENUE FORM GST AND HIGH PROFITS TO PETROL PRICES EVK

GST-Petrol Price: ఇటు పెట్రోల్.. అటు జీఎస్‌టీ వ‌సూళ్లు.. కేంద్రానికి భారీగా ఆదాయం

ప్ర‌తీకాత్మ‌క చిత్రం

ప్ర‌తీకాత్మ‌క చిత్రం

Central govt : క‌రోనా (Corona)తో దాదాపు అన్ని దేశాల ఆర్థిక స్థితి అత‌లాకుత‌లం అయ్యింది. కొన్ని దేశాలు ఫైనాన్సియ‌ల్ క్రైసిస్‌లోకి కూడా వెళ్లాయి.ఈ నేప‌థ్యంలో కేంద్రా ఆదాయం పెంచుకొనేందుకు ప‌లు వ‌స్తువుల‌పై టాక్సులు పెంచింది. ఈ నేప‌థ్యంలో గ‌తంలో కంటే ఎక్కువ‌గా జీఎస్‌టీ వ‌సూళ్లు.. పెట్రోల్ అమ్మ‌కాల‌తో కేంద్రానికి భారీగా ఆదాయం వ‌స్తోంది.

ఇంకా చదవండి ...
    క‌రోనా (Corona)తో దాదాపు అన్ని దేశాల ఆర్థిక స్థితి అత‌లాకుత‌లం అయ్యింది. కొన్ని దేశాలు ఫైనాన్సియ‌ల్ క్రైసిల్‌లోకి కూడా వెళ్లాయి. అమెరికా (America) , బ్రిట‌న్ (Britain) దేశాలు కోవిడ్ క‌ట్ట‌డికి లెక్క‌లేనంత ధ‌నం ఖ‌ర్చు పెట్టాయి. భార‌త దేశం కూడా కోవిడ్ కార‌ణంగా ఆర్థికంగా దెబ్బ‌తింది. అయితే కోవిడ్ 19 (Covid 19) నుంచి కోలుకొనే క్ర‌మంలో కేంద్రం ప్ర‌ణాళిక ప్ర‌కారం దేశం ఆదాయం పెచ్చుకొంటోంది. ముఖ్యంగా జీఎస్‌టీ వ‌సూళ్లు, పెట్రోల్ ధ‌ర‌ల (Petrol Rates) కార‌ణంగా కేంద్ర ఖ‌జానా గ‌ల‌గ‌ల‌లాడుతోంది. ముఖ్యంగా కరోనా మహమ్మారి సంక్షోభం నుంచి వ్యాపార, సేవ రంగాలు కోలుకోవడంతో గత కొద్ది నెలలుగా జీఎస్‌టీ వసూళ్లు (GST Collections) భారీగా పెరుగుతున్నాయి. గత నెల అక్టోబర్ జీఎస్‌టీ వసూళ్లు రూ.1,30,127 కోట్లుగా ఉంది. 2017 జులైలో జీఎస్‌టీ అమల్లోకి వచ్చిన తర్వాత ఇదే రెండవ అత్యధిక ఆదాయం కావడం విశేషం.

    ఇంధ‌న‌ ధ‌ర‌ల‌తో లాభాలు..
    కరోనా వచ్చిన తర్వాత అంతర్జాతీయం మార్కెట్‌ (Market) లో పెట్రోలియం ధరలు గణనీయంగా పడిపోయాయియ‌. అయినా కేంద్రం ఆర్థిక లోటు సర్దుబాటు కోసం పెట్రోలియం ఉత్పత్తులపై ఎక్సైజ్‌ సుంకాల (Excise tax)ను భారీగా పెంచేసింది. ఆ తర్వాత పెట్రోలియం ధరలు అంతర్జాతీయ మార్కెట్లో గరిష్టాలకు చేరినప్పటికీ.. పూర్వపు సుంకాలనే కొనసాగిస్తుండడం గణనీయమైన ఆదాయానికి తోడ్పడుతోంది.

    Goa : గోవాలో ప‌క్కా వ్యూహ‌తో తృణ‌మూల్‌.. కాంగ్రెస్‌కు దెబ్బేనా..?


    2020–21 పూర్తి ఆర్థిక సంవత్సరంలో ఎక్సైజ్‌ వసూళ్లు రూ.3.89 లక్షల కోట్లు కాగా, 2019–20లో ఈ మొత్తం రూ.2.39 లక్షల కోట్లుగా ఉంది. జీఎస్‌టీ అమల్లోకి వచ్చిన తర్వాత ఎక్సైజ్‌ డ్యూటీని పెట్రోల్, డీజిల్ (Diesel), ఏటీఎఫ్, సహజ వాయువులపైనే విధిస్తున్నారు.

    జోరుగా జీఎస్‌టీ వ‌సూళ్లు..
    ఈ ఏడాది జీఎస్‌టీ వ‌సూళ్ల‌లో సెస్ రూపంలో వ‌చ్చిన ఆదాయం రూ.8,484 కోట్లు. అంతే కాకుండా జీఎస్‌టీ వాటా నుంచి సీజీఎస్ఆర్ (CGSR) కు రూ.27,310 కోట్లు, రాష్ట్రాలతో రూ.22,394 కోట్లు పంచుకొనున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇక మొత్తం వాటా పంచిన త‌రువాత కేంద్రం వాటా (Central govt Share) రూ.51,171 కోట్లు ఉంది. ఇక కేంద్రానికి దిగుమతుల నుంచి వచ్చిన ఆదాయం గత ఏడాది కంటే 39 శాతం అధికంగా రావ‌డం విశేషం. అంత‌ర్జాతీయ ప‌రిణామాల‌తో చిప్ కొరత (Chip Crisis) వల్ల కార్లు.. ఇతర ఉత్పత్తుల అమ్మకాలు ఎక్కువ‌గా జ‌ర‌గ‌డం లేదు. చిప్ కొర‌త తీరితే మ‌రింత ఆదాయం వ‌స్తుంద‌ని కేంద్రం భావిస్తోంది.

    Top 5 CNG cars: ధరల మోతతో పెట్రోల్, డీజిల్ కార్లు కొనలేమా? ఈ సీఎన్జీ కార్లు బెస్ట్ ఛాయిస్


    ఆదాయ‌మే.. ఆదాయం..
    పెట్రోలియం ఉత్పత్తులపై కేంద్రం పెంచిన ఎక్సైజ్‌ సుంకాలతో ప్రభుత్వానికి ఆదాయం భారీగా సమకూరుతోంది. కరోనా ముందు నాటితో పోలిస్తే పెట్రోలియం ఉత్పత్తుల (Petroleum Products)పై ఆదాయం 79 శాతం పెరిగినట్టు అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అంతే కాకుండా కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలోని కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ అకౌంట్స్‌ వద్ద అందుబాటులోని సమాచారాన్ని పరిశీలిస్తే.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌–సెప్టెంబర్‌ మధ్య ఎక్సైజ్‌ సుంకాల రూపంలో ఆదాయం రూ.1.71 లక్షల కోట్లుగా ఉంది. క‌రోనా రాకముందు ఆదాయంతో పోలిస్తే ఇది ఎంతో ఎక్కువ‌. ఏదైమైనా అధిక ధ‌ర‌ల‌తో సామాన్యుల ఇబ్బందులు ప‌డుతూనే ఉన్నారు. ఇటు కేంద్రం మాత్రం ఎక్కువ ఆదాయం పొందేందుకు ట్యాక్సులు పెంచుతూనే ఉంది.
    Published by:Sharath Chandra
    First published:

    Tags: Central Government, GST, Petrol prices

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు