Home /News /national /

CENTRAL GOVT ANNOUNCES PADMA AWARDS CHESS PLAYER HARIKA SONGS WRITER SIRIVENNELA SITARAMA SASTRI GETS PADMA SRI AS

తెలుగువారికి 4 పద్మ శ్రీ అవార్డులు...లిస్టులో హారిక, సిరివెన్నెల

పద్మ పురస్కారాలు

పద్మ పురస్కారాలు

ప్రభుదేవా, శంకర్ మహదేవన్, గౌతం గంభీర్‌కు కూడా పద్మశ్రీ అవార్డు దక్కింది. ఇక మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్‌కు పద్మభూషణ్ అవార్డు దక్కింది.

    సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి, చెస్ క్రీడాకారిణి ద్రోణవల్లి హారిక, ఫుట్‌బాల్ కెప్టెన్ సునీల్ ఛెత్రి, వ్యవసాయవేత్త యెడ్లవల్లి వెంకటేశ్వరరావును పద్మశ్రీ అవార్డులు వరించాయి. వీరితో పాటు ప్రభుదేవా, శంకర్ మహదేవన్, గౌతం గంభీర్‌కు కూడా పద్మశ్రీ అవార్డు దక్కింది. ఇక మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్‌కు పద్మభూషణ్ అవార్డు దక్కింది. రిపబ్లిక్ డే వేడుకలకు ముందు పద్మఅవార్డులను ప్రకటించింది కేంద్రం. నలుగురికి పద్మ విభూషణ్, 14 మంది పద్మభూషణ్, 94 మందికి పద్మ శ్రీ అవార్డులను ప్రకటించారు.

    పద్మ విభూషణ్ (4):
    తీజన్ భాయ్ (జానపద కళాకారిణి)
    ఇస్మాయిల్ ఒమర్ గులే (జిబూటి అధ్యక్షుడు)
    అనిల్ కుమార్ మిణిబాయ్ నాయక్ (ఎల్ అండ్ టీ ఛైర్మన్)
    బల్వంత్ మోరేశ్వర్ పురందరే (రచయిత)

    పద్మ భూషణ్ (14):
    1. జాన్ చాంబర్స్ (అమెరికా)-ట్రేడ్ ఇండస్ట్రీ, టెక్నాలజీ
    2. సుఖ్‌దేవ్ సింగ్ ధిండ్సా (పంజాబ్)-పబ్లిక్ ఎఫైర్స్
    3. ప్రవీన్ గోర్దాన్ (సౌతాఫ్రికా)- పబ్లిక్ ఎఫైర్స్
    4. మహస్య ధర్మపాల్ గులాటీ (ఢిల్లీ)-ట్రేడ్, ఫుడ్ ప్రాసెసింగ్
    5. దర్శన్ లాల్ జైన్ (హర్యానా)-సామాజిక సేవ
    6. అశోక్ లక్ష్మణరావు కుకాడె (మహారాష్ట్ర)- హెల్త్ కేర్
    7. కరియా ముండా (జార్ఖండ్)- పబ్లిక్ ఎఫైర్స్
    8. బదాదిత్య ముఖర్జీ (వెస్ట్ బెంగాల్)-సంగీతం
    9. మోహన్‌లాల్ విశ్వనాథ్ నాయర్ (కేరళ)-సినిమా
    10. ఎస్. నంబి నారాయణ్ (కేరళ)- సైన్స్, స్పేస్ ఇంజినీరింగ్
    11. కుల్దీప్ నాయర్ (ఢిల్లీ)-సాహిత్యం, జర్నలిజం
    12. బచెంద్రిపాల్ (ఉత్తరాఖండ్)- స్పోర్ట్స్
    13. వీకే షుంగ్లు (ఢిల్లీ)- సివిల్ సర్వీసెస్
    14. హుకుందేవ్ నారాయణ్ యాదవ్ (బీహార్)-పబ్లిక్ ఎఫైర్స్

    పద్మశ్రీ (94)
    1. ద్రోణవల్లి హారిక (ఏపీ)-చెస్ క్రీడాకారిణి
    2. సునీల్ ఛెత్రి (తెలంగాణ)- ఫుట్‌బాల్ క్రీడాకారుడు
    3. సిరివెన్నెల సీతారామశాస్త్రి (తెలంగాణ)- సాహిత్యం
    4. యెడ్లవల్లి వెంకటేశ్వరరావు (ఏపీ)-వ్యవసాయం
    5. గౌతం గంభీర్ (ఢిల్లీ)- క్రికెట్ క్రీడాకారుడు
    6. శంకర్ మహదేవన్ (మహారాష్ట్ర)-గాయకుడు
    7. మనోజ్ బాజ్‌పేయి (మహారాష్ట్ర)-సినీ నటన
    8. ప్రభుదేవా (కర్నాటక)-నృత్యం

    వీరితో పాటు మరో 86 మందికి కూడా పద్మ శ్రీ అవార్డులు దక్కాయి. ఈ సారి తెలుగు రాష్ట్రాల నుంచి పద్మ భూషణ్, పద్మవిభూషణ్ అవార్డులకు ఎవరూ ఎంపిక కాలేదు.  నలుగురిని మాత్రం పద్మ శ్రీ అవార్డులు వరించాయి.

     
    First published:

    Tags: Padma Awards

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు