• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • CENTRAL GOVERNMENT WITHDRAWS INSURANCE COVER OF RUPEES 50 LAKH FOR HEALTHCARE WORKERS WHO SUCCUMBED IN THE LINE OF COVID DUTY HERE IS THE FULL DETAILS NK

India Corona: హెల్త్‌కేర్ వర్కర్లకు కేంద్రం షాక్... కరోనా సమయంలో కోలుకోలేని దెబ్బ

India Corona: హెల్త్‌కేర్ వర్కర్లకు కేంద్రం షాక్... కరోనా సమయంలో కోలుకోలేని దెబ్బ

హెల్త్‌కేర్ వర్కర్లకు కేంద్రం షాక్... కరోనా సమయంలో కోలుకోలేని దెబ్బ (image credit - twitter)

India Corona: కేంద్ర ప్రభుత్వం తమకు అండగా ఉంటుందని హెల్త్‌కేర్ వర్కర్లు భావించారు. తీరా చూస్తే సరైన టైమ్ చూసి దెబ్బేస్తోందని హెల్త్ కేర్ వర్కర్లు తీవ్ర ఆవేదన, ఆందోళన చెందుతున్నారు.

  • Share this:
    India Corona: గతేడాది కరోనా వైరస్ ఇండియాలోకి వచ్చినప్పుడు హెల్త్ కేర్ వర్కర్లలో ధైర్యం నింపేందుకు కేంద్ర ప్రభుత్వం ఇన్సూరెన్స్ స్కీమ్ తెచ్చింది. దాని ప్రకారం... కరోనా విధుల్లో పాల్గొంటూ... ఎవరైనా హెల్త్ కేర్ వర్కర్ చనిపోతే... వారి కుటుంబ సభ్యులకు కేంద్రం రూ.50 లక్షల ఇన్సూరెన్స్ పరిహారం ఇస్తామని తెలిపింది. దాంతో... హెల్త్ కేర్ వర్కర్లకు ధైర్యం వచ్చింది. ఆ స్కీమ్ ఉంది అనే ఉద్దేశంతోనే చాలా మంది హెల్త్ కేర్ వర్కర్లు ధైర్యంగా కరోనా పేషెంట్లకు సేవలు చేస్తున్నారు. అలాంటిది కేంద్రం తాజాగా... ఈ స్కీమును ఇక ఆపేయాలని నిర్ణయించుకుంది. నిజానికి అప్పటి కంటే ఇప్పుడే ఈ స్కీమ్ అత్యవసరం. ఎందుకంటే ఇప్పుడే ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయి. ఎక్కువ కేసులూ వస్తున్నాయి. కానీ... ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కేంద్రం ఈ స్కీమ్ లేపేయడం హెల్త్ కేర్ వర్కర్లకు షాకింగే అనుకోవాలి. బాధాకరమైన వార్తే.

    గత నెల్లో కేంద్ర ఆరోగ్య శాఖ సైలెంటుగా ఓ సర్క్యులర్‌ని రాష్ట్రాల ప్రభుత్వాలకు పంపింది. మార్చి 24తో ఈ ఇన్సూరెన్స్ స్కీమ్ ముగిసినట్లే అని అందులో ఉంది. అప్పటికి 287 మంది హెల్త్ కేర్ వర్కరు చనిపోగా... వారికి ఈ స్కీమ్ వర్తిస్తోంది. వారి కుటుంబ సభ్యులకు కేంద్రం రూ.50 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ స్కీమ్... కేంద్రం ప్రకటించిన రూ.1.7 లక్షల కోట్ల ప్యాకేజీలో భాగం అని కేంద్రం గతేడాది గొప్పగా చెప్పుకుంది. దేశంలోని సుమారు 22 లక్షల మంది హెల్త్ కేర్ వర్కర్లకు ఈ స్కీమ్ వర్తిస్తోందని అప్పట్లో తెలిపింది. ఇక్కడ హెల్త్ కేర్ వర్కర్లు అంటే... రోడ్లు ఊచ్చేవారు, పారిశుధ్య పనులు చేసేవారు, వార్డ్ బాయ్స్, నర్సులు, ఆశా (ASHA) వర్కర్లు, పారామెడికోలు, టెక్నీషియన్లు, డాక్టర్లు, స్పెషలిస్టులు, ఇతర హెల్త్ వర్కర్లు కూడా వస్తారు. వీళ్లందరికీ ఇన్సూరెన్స్ వర్తించినట్లే.

    ఇప్పుడు ఈ స్కీమ్ ఎత్తేసినందువల్ల వీరిలో ఎవరైనా చనిపోతే... ఇన్సూరెన్స్ పరిహారం రూ.50 లక్షలు వారి కుటుంబ సభ్యులకు రావు. ఇది చాలా షాకింగ్ విషయం. ఎందుకంటే... ఇప్పుడే ఎక్కువ మంది చనిపోయే ప్రమాదం కనిపిస్తోంది... దీన్ని కొనసాగించాలి అని హెల్త్ కేర్ వర్కర్లు కోరుతున్నారు.

    ఈ స్కీమ్ ప్రైవేట్ రంగంలోని వారికి కూడా వర్తించింది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రకారం ఇండియాలో అనధికారికంగా 739 మంది MBBS డాక్టర్లు సెకండ్ వేవ్ కరోనా వల్ల చనిపోయారు. కానీ వారికి ఈ స్కీమ్ ఇప్పుడు వర్తించేలా కనిపించట్లేదు. తాజా రిపోర్టుల ప్రకారం... మార్చి 24తో స్కీమ్ ముగిసినందువల్ల... దీని కింద ఇన్సూరెన్స్ పరిహారం కోసం అప్లై చేయాలనుకునే వారు... నెల రోజుల్లో డెత్ సర్టిఫికెట్ ఇతర పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. అంటే ఏప్రిల్ 24లోపు ఇవ్వాల్సి ఉంటుంది. అలా ఇచ్చిన వారి పత్రాలను పరిశీలించి... చనిపోయిన వారు మార్చి 24లోపు చనిపోయారో లేదో తెలుసుకొని... స్కీమ్ వర్తింపజేయాలా, వద్దా అనేది డిసైడ్ చేయనున్నారు అధికారులు.

    ఇది కూడా చదవండి: Horoscope today 19-4-2021: నేటి రాశి ఫలాలు... వీరికి ఇంటా బయటా శుభాలు

    మొదట్లో 90 రోజులకే స్కీమ్ తెచ్చిన కేంద్రం తర్వాత దాన్ని ఏడాది పొడిగించింది. ఇప్పుడు దీన్ని తొలగించడంపై డాక్టర్లు అభ్యంతరం చెబుతున్నారు. అప్పటి కంటే ఇప్పుడు ఈ స్కీమ్ ఇంకా ఎక్కువ అవసరం ఉందనీ... వెంటనే దీన్ని మళ్లీ అమలు చెయ్యాలని వేడుకుంటున్నారు. బట్... కేంద్రం ఈ అభ్యర్థనలను పట్టించుకునే ఆలోచనలో లేదని సమాచారం.
    Published by:Krishna Kumar N
    First published: