PF Amount: అన్ని రంగాల ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పేందుకు సిద్ధమైంది. త్వరలో పీఎఫ్ అమౌంట్ పెంచే యోచనలో కేంద్రం ఉంది. ఎలా అంటే ప్రభుత్తం కొత్తగా నాలుగు లేబర్ కోడ్లని ప్రవేశపెడుతుంది. ఆ కోడ్ ల కారణంగా.. ఉద్యోగుల జీతాల్లో భారీగానే మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఇక్కడ మరో సమస్య ఎదురయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే పీఎఫ్ అమౌంట్ పెరిగినా.. టేక్ హోం శాలరీ తగ్గేందుకు ఆస్కారం ఉంది. అయితే మార్కెట్ నిపుణులు మాత్రం ఇది మంచి నిర్ణయమే అంటున్నారు. భవిష్యత్‌లో పీఎఫ్ ద్వారా మీరు పెద్ద మొత్తంలో డబ్బు పొందడానికి అవకాశం వస్తుంది. అలాగే వడ్డా రేట్లు పెరిగి భారీగా ఆదాయం చేతికి చేరేందుకు ఉపయో పడుతుంతుందని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఇదంతా కొత్త లేబర్ కోడ్ అమలైతేనే జరుగుతుంది. మరోవైపు ముఖ్యంగా వేతనాలు, సామాజిక భద్రత, పారిశ్రామిక సంబంధాలు, వృత్తి భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితులపై కొత్త లేబర్ కోడ్లను అమలు చేసే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
కొత్తగా ప్రవేశ పెడుతున్న ఈ లేబర్ కోడ్ల అమలు 2022 ఆర్థిక సంవత్సరం నాటికి పూర్తి అవుతుందని సీనియర్ ప్రభుత్వ అధికారి పేర్కొన్నారు. కొత్త నిబంధనల ప్రకారం భారతదేశం అంతటా ఉద్యోగులకు వారంలో మూడు రోజుల సెలవులు, నాలుగు రోజులు పని చేసే అవకాశం ఉంటుంది. కేంద్రం ఇప్పటికే ఈ కోడ్ల కింద నిబంధనలను ఖరారు చేసింది ఇప్పుడు రాష్ట్రాలు తమ వంతుగా నిబంధనలను రూపొందించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. అయితే దీనిలో ఉన్న ఒకే ఒక్క సమస్య కొత్త లేబర్ కోడ్లను అంచనా వేసిన నిపుణులు.. ఉద్యోగుల టేక్ హోమ్ జీతం తగ్గుతుందని అంచనా వేస్తున్నారు.
ఇదీ చదవండి : తీన్మార్ మల్లన్నపై దాడి.. జేపీ నడ్డాకు మంత్రి కేటీఆర్ ఫిర్యాదు.. అసలు వివాదం ఇదే..
ఈ కొత్త లేబర్ కోడ్ లలో భారీ మొత్తం జీతంలో 50 శాతం కంటే ఎక్కువ అలవెన్సులు ఉండకూడదని ఈ లేబర్ కోడ్లు నిర్దేశిస్తున్నాయి. అంటే ప్రాథమిక వేతనం లేదా మూల వేతనం 50 శాతం లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి. సాధారణంగా, యజమానులు జీతంలో నాన్-అలవెన్స్ గాని 50 శాతం కంటే తక్కువగా ఉంచుతారు ఫలితంగా ఉద్యోగులకు అధిక వేతనం లభిస్తుంది. అయితే మార్పులు తీసుకువచ్చిన తర్వా యజమానులు ఉద్యోగుల మూల వేతనాన్ని పెంచవలసి ఉంటుంది. గ్రాట్యుటీ చెల్లింపులు పెరగడం, ప్రావిడెంట్ ఫండ్‌కు ఉద్యోగుల సహకారం కారణంగా టేక్-హోమ్ జీతాలు తగ్గుతాయి.
ఇటీవల ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్-EPF అకౌంట్ ఉన్నవారికి తమ బ్యాలెన్స్ ఎంతో తెలుసుకోవాలన్న ఆసక్తి ఉంటుంది. అయితే ఆ బ్యాలెన్స్ ఎలా తెలుసుకోవాలి అన్నది చాలామందికి కష్టంగానే ఉంటుంది. అయితే అలా తెలుసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. సబ్స్క్రైబర్లు తమ బ్యాలెన్స్‌ను సులువుగా తెలుసుకోవడానికి టెక్నాలజీని ఉపయోగిస్తోంది ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్-EPFO. ఈపీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవడానికి అనేక పద్ధతులు ఉన్నాయి. అందులో 'షార్ట్ కోడ్ ఎస్ఎంఎస్ సర్వీస్' ఒకటి. ఈ సర్వీస్ ద్వారా ఈపీఎఫ్ సబ్స్క్రైబర్లు తమ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు. ఇందుకోసం తమ యూనివర్సల్ అకౌంట్ నెంబర్ లేదా యూఏఎన్‌కు మొబైల్ నెంబర్ రిజిస్టర్ చేస్తే చాలు. 7738299899 నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపితే పీఎఫ్ అకౌంట్లో బ్యాలెన్స్ ఎంత ఉందో తెలుస్తుంది. రిజిస్టర్డ్ మొబైల్ నుంచి మెసేజ్ చేస్తేనే బ్యాలెన్స్ వివరాలు తెలుస్తాయన్న విషయం గుర్తుంచుకోవాలి.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: EPFO, India news, National News