Home /News /national /

CENTRAL GOVERNMENT TAKE KEY DECISION AFTER NOVEMBER 30TH NO EXTEND TO FREE RICE NGS

Free Rice: పేదలకు షాక్.. నవంబర్ 30 తరువాత ఆ పథకం క్లోజ్.. ఇక ఉచిత రేషన్ ఇవ్వరా..?

నిలిచిపోనున్న ఉచిత బియ్యం

నిలిచిపోనున్న ఉచిత బియ్యం

Free Rice: కరోనా నేపథ్యంలో పేదలు నానా అవస్థలు పడ్డారు. పడుతూనే ఉన్నారు. కరోనా కారణంగ పనులు నిలిచిపోవడంతో మూడు పూట్ల తినే పరిస్తితి లేకుండా పోయింది. ప్రభుత్వాలు ఇస్తున్న ఉచిత బియ్యమే వారి ఆకలి తీరుస్తున్నాయి. కానీ ఆ పథకం ఈ నెల 30 తరువాత నిలిచిపోనుంది.. పేదలకు అన్నం పెట్టే పథకాన్ని ఎందుకు ఆపేస్తున్నారు..?

ఇంకా చదవండి ...
    Free Ration stopped: యావత్ భారత దేశాన్ని కరోనా వైరస్ (Corona Virus) అతలాకుతలం చేసేసింది.. ముఖ్యంగా కరోనా సెకెండ్ (Corona Second Wave) వేవ్ పూర్తిగా జన జీవనం స్థంభించింది. పేద, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చాలామందికి ఉద్యోగాలు పోయాయి. కార్మికులకు పనులు లేకుండా పోయాయి. చాలామంది పేదలకు పస్తులు ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. లాక్ డౌన్ (Lockdown) కారణంగా తినడానికి తిండి దొరకడమే కష్టమైంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం (Central Government) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాన్ మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన (Prime Minster gareeb kalyan yojana)కింద పేదలు అందరికీ.. ఎవరికైతే రేషన్ కార్డు (Ration Card)ఉంటుందో వారందరికి ఉచితంగా బియ్యం (Free Rice)అందించాలని నిర్ణయం తీసుకుంది. దాదాపు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఉచిత బియ్యం అందిస్తున్నాయి వివిధ పథకాల రూపంలో.. దానికి అదనంగా కేంద్రం కూడా ఉచిత బియ్యాన్ని అందిస్తోంది. దీంతో ఇంతకాలం పేద ప్రజలు ఆ బియ్యం తీసుకుని హ్యాపీగా ఉంటున్నారు.. కానీ ఇప్పుడు వారందరికీ షాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది కేంద్ర ప్రభుత్వం.. ఉచిత బియ్యం సరఫరా త్వరలో నిలిచిపోనుంది..

    తాజాగా కేంద్ర ప్రభుత్వం ఉచిత బియ్యం అంశంపై కీలక ప్రకటన చేసింది. మోదీ సర్కార్ కరోనా వైరస్ నేపథ్యంలో రేషన్ కార్డు కలిగిన వారికి ఉచితంగానే బియ్యం అందిస్తోంది. ఈ ఫ్రీ రేషన్ స్కీమ్‌పై కేంద్ర ప్రభుత్వం తాజాగా స్పందించింది. ఉచిత బియ్యం పథకాన్ని పొడిగించే ఆలోచన లేదని కేంద్రం ప్రభుత్వం స్పష్టం చేసింది.

    ఇదీ చదవండి: మెగా కోడలితో సమంత.. చైతూతో విడుకుల తరువాత దిపావళి వేడుకల్లో సమంత సందడి

    నవంబర్ 30 తర్వాత ఉచిత బియ్యం ఉవ్వబోమని పేర్కొంది. కేంద్ర ఫుడ్ సెక్రటరీ సుధాన్షు పాండే తెలిపారు. కోవిడ్ 19 ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో ఉచిత బియ్యం అందించామని, ఈ స్కీమ్‌ను పొడిగించబోమని స్పష్టం చేశారు.

    ఇదీ చదవండి: ప్రపంచాన్ని మళ్లీ భయపెడుతున్న ఆల్ఫా వేరియంట్.. మూగ జీవాలనూ వదలను వైరస్

    కేంద్ర ప్రభుత్వం తాజా నిర్ణయంతో ఈ ఉచిత బియ్యం పథకం త్వరలో క్లోజ్ అయిపోతోంది. ప్రధాన్ మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన కింద అందిస్తున్న ఉచిత బియ్యం స్కీమ్ నవంబర్ 30 వరకే అందుబాటులోఉంటుందని ఆయన తెలిపారు. కాగా కేంద్ర ప్రభుత్వం ఉచిత బియ్యాన్ని మే, జూన్ నెలలకు ఇవ్వాలని నిర్ణయించింది. తర్వాత జూలై నుంచి నవంబర్ వరకు కూడా ఈ స్కీమ్‌ను పొడిగించింది. కానీ ఈ నెలతో ఆ పథకం ఆగిపోతోంది.

    ఇదీ చదవండి: ఒక్క రూపాయకే నచ్చిన దుస్తులు.. పేదల కోసం అతి పెద్ద షాపింగ్ మాల్.. ఎక్కడో తెలుసా..?
    Published by:Nagesh Paina
    First published:

    Tags: Central governmennt, Free Ration, Pm modi

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు