హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

National Monetisation Pipeline: నేషనల్ మానిటైజేషన్ పైప్‌లైన్ స్కీమ్​ను ప్రారంభించిన కేంద్రం.. నాలుగేళ్లలో 6 లక్షల కోట్ల నిధుల సమీకరణే లక్ష్యం

National Monetisation Pipeline: నేషనల్ మానిటైజేషన్ పైప్‌లైన్ స్కీమ్​ను ప్రారంభించిన కేంద్రం.. నాలుగేళ్లలో 6 లక్షల కోట్ల నిధుల సమీకరణే లక్ష్యం

నేషనల్ మానిటైజేషన్ పైప్‌లైన్ స్కీమ్ ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వం

నేషనల్ మానిటైజేషన్ పైప్‌లైన్ స్కీమ్ ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వం

కరోనా మహమ్మారి సమయంలో భారత ఆర్థిక రంగం కుదేలయింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆస్తులు ద్వారా నిధులు సేకరించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్దపడింది.

కరోనా మహమ్మారి సమయంలో భారతఆర్థిక రంగంకుదేలయింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆస్తులు ద్వారా నిధులు సేకరించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది.జాతీయ మానిటైజేషన్‌ పైప్‌లైన్‌ అనేపథకం ద్వారా నాలుగేళ్లలోనే రూ.6 లక్షల కోట్లు సమీకరించాలని నిర్ణయించినట్లుకేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు. రైల్వే, విద్యుత్ వంటి రంగాలలోని ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తామని ప్రకటించిన ఆమె యాజమాన్య హక్కులను మాత్రం ప్రభుత్వమే కలిగి ఉంటుందని స్పష్టం చేశారు.

నేషనల్ మానిటైజేషన్ పైప్‌లైన్ అనేది ఆస్తుల ప్రైవేటీకరణ లేదా విక్రయాలకు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన "నిర్మాణాత్మక ఒప్పంద భాగస్వామ్య" పథకం. నీతి ఆయోగ్ మౌలిక సదుపాయాల మంత్రిత్వ శాఖలను సంప్రదించిన తర్వాతనే ఎన్‌ఎంపీ రెండు-వాల్యూమ్​ల వ్యూహాత్మక ప్రణాళికలను రూపొందించింది. ఎన్‌ఎమ్​పీ పథకాన్ని కేంద్ర బడ్జెట్ 2021-22లోని 'అసెట్ మోనటైజేషన్' ఆదేశం కింద రూపొందించారు. నిధుల సమీకరణకు కీలకమైన మార్గంగా గుర్తించే ఈ పథకం ద్వారా బ్రౌన్‌ఫీల్డ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అసెట్​మానిటైజేషన్ పైప్‌లైన్‌ను రెడీ చేస్తుంది. ఇప్పటికే నిర్మించిన.. లీజుకు తీసుకున్న.... లేదా సంస్థ ద్వారా కొనుగోలు చేయబడిన మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి లక్ష్యంగా పెట్టుకున్న ప్రాజెక్టులనే బ్రౌన్‌ఫీల్డ్ ప్రాజెక్టులు అంటారు.

మానిటైజేషన్ కోసం స్పష్టమైన ఫ్రేమ్‌వర్క్‌ను అందించడానికి.. పెట్టుబడి వడ్డీని రూపొందించడానికి.. పెట్టుబడిదారులకు ఆస్తుల జాబితాను అందించడానికి ఎన్‌ఎమ్​పీ పథకాన్ని ప్రవేశపెట్టారు. అలాగే అసెట్ మానిటైజేషన్ కార్యక్రమాన్ని అమలు చేయడానికి.. పర్యవేక్షించడానికి ఒక సాధికారిక కమిటీ ఏర్పాటు చేశారు. అసెట్ మానిటైజేషన్ (CGAM)పై కోర్ గ్రూప్ ఆఫ్ సెక్రటరీస్ కేబినెట్ సెక్రటరీ నేతృత్వం వహిస్తుంది.ఈ పథకం ద్వారా రోడ్లు, విమానాశ్రయాలు, రైల్వేలు, విద్యుత్ ఉత్పత్తి, టెలికాం, గ్యాస్ & ప్రొడక్ట్ పైప్‌లైన్, మైనింగ్, హౌసింగ్ వంటి రంగాలలోని ఆస్తుల్లో ప్రైవేటు వ్యక్తులు పెట్టుబడులు పెట్టవచ్చు. ప్రస్తుతానికి కేంద్ర ప్రభుత్వయాజమాన్యంలోని వివిధ రంగాల ద్వారా మాత్రమే నిధులు సేకరిస్తున్నారు. త్వరలోనే రాష్ట్రాల ఆధీనంలో ఉన్న ఆస్తుల ద్వారా కూడా నిధులు సమీకరించే ప్రక్రియ ప్రారంభంకానుంది.

ఈ పథకం ముఖ్య లక్ష్యం ఏమిటి?

కొత్త మౌలిక సదుపాయాల కల్పన కోసం.. ప్రైవేట్ రంగ పెట్టుబడులను సమీకరించేందుకు మోనటైజేషన్ లక్ష్యంగా పెట్టుకుందని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ఉపాధి అవకాశాలను సృష్టించి అధిక ఆర్థిక వృద్ధిని సాధించడానికి.. గ్రామీణ సెమీ అర్బన్ ప్రాంతాలను సమగ్రపరచడానికి ఎన్‌ఎంపీ పథకం అవసరమని వివరించారు. అసెట్​ మానిటైజేషన్ కార్యక్రమాన్ని పారదర్శకంగా రూపొందించడమే ఎన్‌ఎంపీ పథకం లక్ష్యం. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్‌లు.. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్‌లు వంటి మోడళ్ల ద్వారా ప్రైవేట్ వ్యక్తులు పెట్టుబడులు పెట్టవచ్చు. వారి మొత్తం లావాదేవీలు రెవెన్యూ హక్కుల వరకే పరిమితం అవుతాయి. ఎందుకంటే ఆస్తుల యాజమాన్య హక్కులను ప్రభుత్వమే కలిగి ఉంటుంది. ఒక నిర్ణీత వ్యవధి ముగిసిన తర్వాత ఆస్తులను తిరిగి ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉంటుంది.

First published:

Tags: Central governmennt, NDA, Nirmala sitharaman

ఉత్తమ కథలు