కేంద్ర సాయుధ బలగాల కోసం ఆయుష్మాన్ భారత్-సీఏపీఎప్ (Central Armed Police Forces) పథకాన్ని కేంద్రం ప్రారంభించింది. ఈ పథకాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Union home minister Amit shah) మంగళవారం అస్సాంలో పైలెట్ ప్రాజెక్ట్ గా ప్రారంభించారు
కేంద్ర సాయుధ బలగాల కోసం ఆయుష్మాన్ భారత్-సీఏపీఎప్ (Central Armed Police Forces) పథకాన్ని కేంద్రం ప్రారంభించింది. ఈ పథకాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Union home minister Amit shah) మంగళవారం ప్రారంభించారు. ఈ పథకాన్ని అస్సాంలో పైలెట్ ప్రాజెక్ట్ గా ప్రారంభించారు. దేశ వ్యాప్తంగా దశలవారీగా ఈ పథకం అమల్లోకి రానుంది. డిసెంబర్ 2021 నాటికి పూర్తిస్థాయిలో అమలు చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది. దేశ వ్యాప్తంగా మొత్తం 35 లక్షల మంది కేంద్ర సాయుధ బలగాలకు ఆరోగ్యపర సేవలు అందించేందుకు ఈ పథకాన్ని (Ayushman Bharath CAPS) ప్రవేశపెట్టారు. అన్ని సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (CAPF) అధికారులు, సిబ్బంది, అస్సాం రైఫిల్స్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF), సశత్రా సీమా బల్ (SSB), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ ( CISF), నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (NSG), ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP), సిబ్బంది, వారి కుటుంబాలకు ఈ పథకం వర్తిస్తుంది. దేశ వ్యాప్తంగా ఉన్న వైద్యులు ఈ డేటాను యాక్సెస్ చేయవచ్చు. వైద్యం అందించేందుకు CAPF వివరాలను తనిఖీ చేయవచ్చు. ఈ పథకం కింద ప్రతీ ఒక్క ఉద్యోగికి గుర్తింపు కార్డు ఇవ్వనున్నారు.
ఇటీవలె ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్..
ఇటీవలె భారత ప్రధాని నరేంద్ర మోదీ (Prime minister Narendra modi) వారణాసి (Varanasi)లో ‘ పీఎం ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ (PM Ayushman Bharat Infrastructure Mission)’ను ప్రారంభించారు. 9 కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణంతో దాదాపు రెండున్నర వేల కొత్త బెడ్లు ఏర్పాటు చేశారు. ఇదే కోవలో ఆయుష్మాన్ భారత్‌ను వివిధ విభాగాలకు విస్తరిస్తున్నారు. దీంట్లో భాగంగానే ఆయుష్మాన్ భారత్-సీఏపీఎప్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది.
ఈ పథకం (Ayushman Bharath CAPS) కింద సాధారణ ప్రజలకు రూ. 5 లక్షల వరకూ ఆరోగ్య సేవలు పొందవచ్చు. కానీ సీఏపీఎఫ్ లకు నగదు లిమిట్ లేదు. ఆయుష్మాన్ భారత్ సీఏపీఎఫ్ అనేది ఆయుష్మాన్ భారత్ PM-JAY IT ప్లాట్‌ఫారమ్‌లో అమలు చేస్తున్న పథకం. మొత్తం ఏడు సీఏపీఎఫ్ లు, వారి కుటుంబ సభ్యులకు నగదు రహిత లేదా రీయింబర్స్మెంట్ ఆధారిత ఆరోగ్య సంరక్షణ సేవలను అందించడానికి ప్రారంభించారు.
साथ ही NSG के जवानों को Ayushman CAPF योजना के अंतर्गत स्वास्थ्य कार्ड वितरित किए।
मोदी सरकार की इस योजना से दिसंबर 2021 तक देशभर में 35 लाख से अधिक CAPF कर्मियों व उनके परिजनों को मुफ्त इलाज का लाभ मिल सकेगा। pic.twitter.com/LwmBKuZCpi
ఈ పథకం (Ayushman Bharath CAPS) కింద కేంద్ర సాయుధ బలగాల ఓపీడీ బిల్లులను కేంద్రం భరించనుంది. అయితే సాధారణ ప్రజలకు ఈ విధానం అందుబాటులో ఉండదు. ఈ పథకాన్ని అస్సాంలో పైలెట్ ప్రాజెక్ట్ గా ప్రారంభించారు. కేంద్ర సాయుధ బలగాల ఆసుపత్రి బిల్లులను భారత ప్రభుత్వం చెల్లిస్తుంది.
Published by:Prabhakar Vaddi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.