• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • CENTRAL GOVERNMENT RELEASES COVID 19 GUIDELINES FOR RURAL AREAS TO CHECK AND PREVENT ITS SPREAD HERE IS THE DETAILS NK

Covid 19 guidelines: కేంద్రం కొత్త మార్గదర్శకాలు జారీ... ఈసారి వాళ్లకి ప్రత్యేకం

Covid 19 guidelines: కేంద్రం కొత్త మార్గదర్శకాలు జారీ... ఈసారి వాళ్లకి ప్రత్యేకం

నరేంద్ర మోదీ (image credit - twitter)

Covid 19 guidelines: కేంద్ర ప్రభుత్వం కరోనాను కంట్రోల్ చెయ్యడానికి ఎప్పటికప్పుడు గైడ్‌లైన్స్ జారీ చేస్తోంది. తాజాగా మరోసారి మార్గదర్శకాలు ఇచ్చింది. అవేంటో, ఎవరికో, ఎలా ఉన్నాయో చూద్దాం.

  • Share this:
    Covid 19 guidelines: ఇండియాలో కరోనా వైరస్... ఇప్పటివరకూ గ్రామాల్లో అంతగా వ్యాపించలేదు. కానీ ఇప్పుడు వ్యాపించేలా కనిపిస్తోంది. దీనిపై డీప్‌గా చర్చించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ... కొత్త గైడ్‌లైన్స్ జారీ చెయ్యాలని ఆదేశించడంతో... కేంద్ర ఆరోగ్య శాఖ... పెరీ-అర్బన్, గ్రామ, గిరిజన ప్రాంతాల్లో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు కొత్త గైడ్‌లైన్స్ ఆదివారం రిలీజ్ చేసింది. ఐతే... ఇప్పటికే గ్రామాల్లో, గిరిజన ప్రాంతాల్లో కూడా కరోనా మెల్లగా పెరుగుతోందని చెప్పింది. గ్రామాల్లో హెల్త్ కమ్యూనిటీలు, ప్రైమరీ లెవెల్ హెల్త్ కేర్ వ్యవస్థను బలోపేతం చెయ్యాలి అని గైడ్‌లైన్స్ సందర్భంగా కేంద్ర ఆరోగ్య శాఖ చెప్పింది. గ్రామాల్లో అత్యవసర ఆరోగ్య సేవల్ని కంటిన్యూ చేస్తూ... కరోనా విషయంలో వెంటనే రెస్పాండ్ అయ్యేలా రాష్ట్రాలు రెడీ అవ్వాలని కోరింది.

    గైడ్‌లైన్స్ ప్రకారం రాష్ట్రాల ప్రభుత్వాలు... ప్రతి గ్రామంలో... యాక్టివ్ సర్వేలెన్స్ వ్యవస్థను ఏర్పాటు చెయ్యాలి. ఈ వ్యవస్థ... ఎవరికైనా కరోనా లక్షణాలు ఉన్నాయా... అనారోగ్యంతో ఉన్నారా అనేది పరిశీలించాలి. ఈ పనిని ఆశా వర్కర్లు... గ్రామ ఆరోగ్య పారిశుధ్య, పోషక కమిటీ (VHSNC) సహకారంతో చెయ్యాలి.


    గ్రామాల్లో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ (CHO)కి ప్రత్యేక ఆదేశం ఉంది. దాని ప్రకారం... ఈ ఆఫీసర్... పేషెంట్‌లో కరోనా వ్యాప్తి తీవ్రత ఎంత ఉంది అనేది గుర్తించాలి. టెలిఫోన్ ద్వారా డాక్టర్ల కన్సల్టేషన్ ఇప్పించాలి. అలాగే... దీర్ఘ కాలిక వ్యాధులతో బాధపడుతూ కరోనా సోకిన వారికి వైద్య సాయం అందిస్తూ... ఆక్సిజన్ సమస్య ఉన్నవారిని ఉత్తమమైన కేంద్రాలకు తరలించాలి. అంతే కాదు CHO స్వయంగా ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టు (RAT) చెయ్యగలగాలి. నాకు రాదు అంటే కుదరదు. అంతేకాదు... పబ్లిక్ హెల్త్ సౌకర్యాలు, కిట్‌లను ఈ ఆఫీసర్ ప్రజలకు అందుబాటులో ఉంచాలి.

    ఈ CHO... ఎవరికైనా టెస్టు చేస్తే... దాని ఫలితం వచ్చే వరకూ ఆ వ్యక్తులను ఐసోలేట్ చెయ్యాలి. కరోనా లక్షణాలు లేకపోయినా.. కరోనా సోకి ఉంటే... వారిని క్వారంటైన్‌లో ఉంచాలి. ICMR ప్రోటోకాల్ ప్రకారం టెస్టులు చెయ్యాలి అని కేంద్ర ఆరోగ్య శాఖ తన మార్గదర్శకాల్లో తెలిపింది. గ్రామాల్లో కాంటాక్ట్ ట్రేసింగ్‌ జరపాలని తెలిపింది. ప్రోటోకాల్ ప్రకారం... కరోనా సోకిన వారిని ఇంట్లోనే క్వారంటైన్ అయ్యేలా చెయ్యాలి.

    ఇది కూడా చదవండి: Covid vaccines: చేదువార్త... ఇండియన్ వేరియంట్‌పై ప్రభావం చూపలేకపోతున్న వ్యాక్సిన్లు

    VHSNCకి మరో పని కూడా అప్పగించింది. ఈ కమిటీ సభ్యులు... వెంటనే.... తమ గ్రామాల్లో కరోనా రోగులు, వారి ఆక్సిజన్ సదుపాయాలపై ఫోకస్ పెట్టాలి. వెంటనే ఆక్సిజన్ వనరులను స్థానిక PRIలో రెడీగా ఉంచాలి. ఎవరికైనా ఆక్సిజన్ అవసరమైతే... వెంటనే అందించాలి. అవే కాదు... థెర్మోమీటర్లు, పల్స్ ఆక్సీమీటర్లు వంటి వాటిని గ్రామాల్లో ఉన్న వారికి లోన్ రూపంలో ఇవ్వాలి. ఇక ఫ్రంట్‌లైన్ వర్కర్లు, వాలంటీర్లు, టీచర్లు వంటి వారు... కరోనా సోకకుండా ఏం చెయ్యాలో స్థానికులకు చెప్పాలి. వారితో అవన్నీ చేయించాలి.
    Published by:Krishna Kumar N
    First published: