స్వలింగ సంపర్కులు పెళ్లి చేసుకోవడం అనేది చాలా దేశాల్లో అమలవుతోంది. అందువల్ల ఇండియాలో కూడా అమలవ్వాలనే డిమాండ్లు చాలా ఏళ్లుగా వినిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం మాత్రం ఇలాంటి వాటిని ఆమోదించే ప్రసక్తే లేదని క్లియర్‌గా చెప్పేసింది. అంతేకాదు.. IPC లోని సెక్షన్ 377ను నేరంగా పరిగణించట్లేదనే సవరణ చెయ్యాలనడం, తద్వారా స్వలింగ సంపర్కుల (Same Sex Marriage) పెళ్లికి గుర్తింపు ఇవ్వాలనడం కరెక్టు కాదని సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్ వేసింది.
చరిత్రలో ఎక్కడా ఇలాంటి వాటికి గుర్తింపు లేదన్న కేంద్రం ఇది కుటుంబ వ్యవస్థకు విఘాతం అని తెలిపింది. స్వలింగ సంపర్కులు కలిసి జీవించడం నేరం కాదన్న కేంద్రం... కానీ వారిని భార్యభర్తలలా చూడాలనడం... భారతీయ కుటుంబ వ్యవస్థకు విరుద్ధమని కేంద్రం చెప్పింది. భారత్‌లో పురుషుడు భర్త అవుతాడనీ, స్త్రీ... భార్య అవుతుందనీ... వారికి పిల్లలు పుట్టాక.. తల్లిదండ్రులు అవుతారని తెలిపిన కేంద్రం... ఈ వివావ వ్యవస్థలో ఎన్నో బాధ్యతాయుత అంశాలు ముడిపడివున్నాయని తెలిపింది.
స్వలింగ వివాహాలకు గుర్తింపు ఇవ్వకపోవడం అనేది చట్టవ్యతిరేకం కాదన్న కేంద్రం... సమాజ నిర్మాణానికి స్త్రీ, పురుషుల మధ్య వివాహం అనేది కీలకం అని తెలిపింది. భారతీయ సమాజం దీనిపైనే ఆధారపడి ఉందని తెలిపింది.
స్వల్పింగ సంపర్కుల పెళ్లిని.. ప్రత్యేక వివాహచట్టం కింద గుర్తించాలంటూ ఇదివరకు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. హైదరాబాద్‌కి చెందిన అభయ్ డాంగ్, సుప్రియో చక్రవర్తి పిటిషన్ వేశారు. మరో స్వలింగ సంపర్కుల జంట కూడా సుప్రీంకోర్టు మెట్లెక్కింది. స్వలింగం కారణంగా తమ పెళ్లికి గుర్తింపు ఇవ్వకపోవడం అనేది రాజ్యాంగంలోని 14, 21 అధికరణల కింద... సమానత్వ హక్కును ఉల్లంఘించడమేనని ఆ జంట పిటిషన్‌లో తెలిపారు. దాంతో దీనిపై కేంద్రం అభిప్రాయమేంటో చెప్పాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
ఇవాళ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీ వై చంద్రచూడ్ నేతృత్వంలోని బెంచ్... విచారణ చేపట్టనుంది. దీనిపై సర్వత్రా ఆసక్తి ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Supreme Court