ఉద్యోగులకు కేంద్రం కీలక మార్గదర్శకాలు

విధులకు ఉద్యోగులు హాజరయ్యే విషయంలో కేంద్రం సరికొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.

news18-telugu
Updated: June 9, 2020, 12:25 PM IST
ఉద్యోగులకు కేంద్రం కీలక మార్గదర్శకాలు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
లాక్‌డౌన్ మినహాయింపుల తరువాత కరోనా మరింతగా విజృంభిస్తోంది. దీంతో పూర్తి ఆరోగ్యంగా ఉన్నవారు మాత్రమే ఆఫీసులకు రావాలని స్పష్టం చేసింది. మిగతావారు ఇంటి నుంచే పనిచేయాలని ఆదేశాలు జారీ చేసింది. కంటైన్‌మెంట్ జోన్ పరిధిలో ఉన్న ఉద్యోగులు ఇంట్లో నుంచే పనిచేయాలని కేంద్రం క్లారిటీ ఇచ్చింది. జ్వరం, దగ్గు లక్షణాలు ఉంటే ఆఫీసులకు రావద్దని కేంద్రం మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. ఒక్కో విభాగంలో రోస్టర్ పద్ధతిన 20 మంది సిబ్బంది లేదా అధికారులకు మాత్రమే అనుమతి ఉంటుందని కేంద్రం తెలిపింది.

ఆఫీసుల్లో విధులు నిర్వహించే ఉద్యోగులు మాస్కు, ఫేస్ షీల్డ్ తప్పనిసరిగా వాడాలని, మాస్కు పెట్టుకోకుంటే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించింది. అలాగే సెక్రటరీ స్థాయి అధికారులు రోజు విడిచి రోజు హాజరుకావాలని వెల్లడించింది. అలాగే ఎదురెదురుగా కూర్చోవద్దని, ఇంటర్ కామ్‌లోనే మాట్లాడుకోవాలని తెలిపింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే సమావేశాలు నిర్వహించాలని తెలిపింది. కామన్ ఏరియాలో ప్రతి గంటకోసారి శుభ్రం చేయాలని, కంప్యూటర్ కీబోర్డులు ఎవరివి వారే శానిటైజర్ తో శుభ్రం చేసుకోవాలని తెలిపింది.
Published by: Kishore Akkaladevi
First published: June 9, 2020, 12:20 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading