PM Cares Fund: వాళ్లకు అందిస్తున్న సాయంపై కేంద్రం పెద్ద మనసు.. నెలకు 2 వేల నుంచి 4 వేలకు పెంచాలని యోచన

ప్రధాని నరేంద్ర మోదీ (File Image)

భారత్‌లో కరోనా మహమ్మారి కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన చిన్నారులకు కేంద్రం అందిస్తున్న రెండు వేల రూపాయల నెలవారీ ఆర్థిక సాయాన్ని పెంచాలని మోదీ సర్కార్ భావిస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం అందిస్తున్న ఈ ఆర్థిక సాయాన్ని 2వేల నుంచి 4వేలకు పెంచే యోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది. కొద్ది వారాల్లోనే ఈ ప్రతిపాదన.. ఆమోదం నిమిత్తం కేంద్ర కేబినెట్ ముందుకు వెళ్లనున్నట్లు సమాచారం. కేంద్ర మహిళాశిశు సంక్షేమ శాఖ ఈ మంత్లీ స్టైఫండ్‌ను పెంచాలన్న ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చినట్లు కేంద్ర ప్రభుత్వ సీనియర్ అధికారి తెలిపారు.

  • Share this:
    న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా మహమ్మారి కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన చిన్నారులకు కేంద్రం అందిస్తున్న రెండు వేల రూపాయల నెలవారీ ఆర్థిక సాయాన్ని పెంచాలని మోదీ సర్కార్ భావిస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం అందిస్తున్న ఈ ఆర్థిక సాయాన్ని 2వేల నుంచి 4వేలకు పెంచే యోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది. కొద్ది వారాల్లోనే ఈ ప్రతిపాదన.. ఆమోదం నిమిత్తం కేంద్ర కేబినెట్ ముందుకు వెళ్లనున్నట్లు సమాచారం. కేంద్ర మహిళాశిశు సంక్షేమ శాఖ ఈ మంత్లీ స్టైఫండ్‌ను పెంచాలన్న ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చినట్లు కేంద్ర ప్రభుత్వ సీనియర్ అధికారి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ‘పీఎం కేర్స్ ఫర్ చిల్ట్రన్’ స్కీం కింద ప్రస్తుతం ఈ సాయాన్ని చిన్నారులకు అందిస్తోంది. ఈ స్కీం కింద ఇప్పటివరకూ 3,250 అప్లికేషన్స్ అందాయి. దేశవ్యాప్తంగా 467 జిల్లాల నుంచి అప్లికేషన్స్ అందినట్లు తెలిసింది. అంతేకాదు.. కరోనా కారణంగా ‘నా అనేవాళ్లు లేక’ అనాథలుగా మారిన వారికి ‘పీఎం కేర్స్ ఫర్ చిల్ట్రన్’ ఉచిత విద్యను కూడా అందిస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది.

    అలాంటి చిన్నారులు పెరిగి పెద్దయి 23 ఏళ్ల వయసు వారికి రాగానే ఆర్థికంగా ఊతమిచ్చే ఉద్దేశంతో రూ.10 లక్షలను వారి బ్యాంక్ అకౌంట్‌‌లో జమ చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే వెల్లడించింది. కరోనా కారణంగా అనాథలైన చిన్నారులకు.. వారికి 18 ఏళ్ల వయసు వచ్చేవరకూ ‘ఆయుష్మాన్ భారత్’ కింద రూ.5 లక్షల వరకూ ఉచిత హెల్త్ ఇన్సూరెన్స్ కూడా చేయిస్తామని కేంద్రం తెలిపింది. ఇదిలా ఉంటే.. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న చిన్నారులకు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కొంత ఆర్థిక సాయాన్ని అందిస్తున్నాయి. కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలు ఈ జాబితాలో ఉన్నాయి.

    ఇది కూడా చదవండి: Petrol Diesel Under GST: జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్, డీజిల్..? ఈ శుక్రవారం ఏం జరగబోతోంది..?

    అయితే.. ఒడిశా ప్రభుత్వం కరోనా కారణంగా అనాథలైన చిన్నారులకు ‘ఆశీర్వాద్’ పేరుతో అందిస్తున్న సాయాన్ని సెప్టెంబర్ 15 నుంచి (నేటి నుంచి) నిలుపుదల చేయాలని నిర్ణయించింది. కరోనా కేసులు తగ్గుముఖం పట్టడాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అయితే.. అలాంటి చిన్నారులంతా సెప్టెంబర్ 15 తర్వాత చైల్డ్ ప్రొటెక్షన్ స్కీం(CPS) పరిధిలోకి వస్తారని, ఈ స్కీం కింద అందే ప్రయోజలన్నింటినీ ఆ చిన్నారులు పొందవచ్చని ఒడిశా ప్రభుత్వం స్పష్టం చేసింది. ‘ఆశీర్వాద్’ స్కీంను ఒడిశా ప్రభుత్వం 2021, జూన్‌లో ప్రకటించింది.
    Published by:Sambasiva Reddy
    First published: