హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Minority Affairs Ministry: మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ రద్దు..? మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం..!

Minority Affairs Ministry: మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ రద్దు..? మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం..!

 ఫైల్ ఫొటో

ఫైల్ ఫొటో

Minority Affairs Ministry: నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోనుంది. మైనారిటీ వ్యవహారాల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మంత్రిత్వ శాఖను త్వరలో రద్దు చేయనున్నట్లు తెలుస్తోంది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

నరేంద్ర మోదీ (Narendra Modi) నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం (Central Government) మరో కీలక నిర్ణయం తీసుకోనుంది. మైనారిటీ వ్యవహారాల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మంత్రిత్వ శాఖను త్వరలో రద్దు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ శాఖను 2006లో అప్పటి యూపీఏ ప్రభుత్వం (UPA Government) ఏర్పాటు చేయగా, తాజాగా దీన్ని సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖలో విలీనం చేసే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తమకు చెప్పినట్లు డెక్కన్ హెరాల్డ్ వార్తాసంస్థ నివేదించింది. మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను రద్దు చేసినా, దీని ద్వారా అమలు చేస్తున్న అన్ని పథకాలు విలీనం తర్వాత కూడా కొనసాగుతాయని నివేదిక పేర్కొంది. అయితే ఈ విషయంపై సంబంధిత మంత్రిత్వ శాఖ అధికారులు స్పందించడానికి నిరాకరించారు.

‘మైనారిటీ వ్యవహారాలకు స్వతంత్ర మంత్రిత్వ శాఖ అవసరం లేదని భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం భావిస్తోంది. యూపీఏ ప్రభుత్వం బుజ్జగింపు విధానంలో భాగంగానే ఈ శాఖను ఏర్పాటు చేసినట్లు ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం విశ్వసిస్తోంది. అందుకే మోదీ ప్రభుత్వం దీన్ని సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖలో మైనారిటీ వ్యవహారాల విభాగంగా (Department of Minority Affairs) చేర్చాలని కోరుకుంటోంది’ అని ఒక అధికారి చెప్పినట్టు డెక్కన్ హెరాల్డ్ కథనం పేర్కొంది.

ఇంతకు ముందు ఈ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు ముక్తార్ అబ్బాస్ నఖ్వీ. మోదీ ప్రభుత్వంలో ఆయన ఏకైక ముస్లిం కేబినెట్ మినిస్టర్ కావడం విశేషం. అయితే ఈ జులైలో ఆయన రాజ్యసభ పదవీకాలం ముగియడంతో, మంత్రి పదవిని వదిలేయాల్సి వచ్చింది. ఆ తర్వాత నుంచి కేంద్ర మహిళా, శిశు సంక్షేమాభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ ప్రస్తుతం మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

* నిర్ణయాన్ని ఖండించిన కాంగ్రెస్

ప్రతిపాదిత చర్యను సమాజాన్ని విభజించేందుకు బీజేపీ చేసిన మరో ప్రయత్నంగా అభివర్ణించారు కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు సయ్యద్ నసీర్ హుస్సేన్. ‘మైనారిటీల అభివృద్ధి, అభ్యున్నతి కోసం ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేసి, వారిని ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడమే లక్ష్యంగా ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశారు. అయితే ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం మైనారిటీలకు వ్యతిరేకంగా పనిచేస్తోంది. ప్రతి అవకాశాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తోంది.’ అని నసీర్ హుస్సేన్ చెప్పారు.

ఇది కూడా చదవండి : బేసి సంఖ్యల్లో డీజిల్ , పెట్రోల్ కొట్టిస్తే పెట్రోల్ బంకుల్లో మోసం చేయలేరా..? నిజం తెలుసుకోండి..

మైనారిటీల ప్రత్యేక మంత్రిత్వ శాఖను రద్దు చేయడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని చెబుతున్నారు జమాతే ఇస్లామీ హింద్‌ కార్యదర్శి సయ్యద్‌ తన్వీర్‌ అహ్మద్‌. ఇది దేశ మానవాభివృద్ధి సూచికను దెబ్బతీస్తుందన్నారు. ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకొని మైనారిటీల సంక్షేమం కోసం ఏర్పాటైన మంత్రిత్వ శాఖను బలోపేతం చేయడంతో పాటు ఈ శాఖకు ఎక్కువ నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.

* మళ్లీ పాత విధానంలోకి..

ముస్లింలు, క్రైస్తవులు, బౌద్ధులు, సిక్కులు, పార్సీలు, జైనులకు సంబంధించిన సమస్యలపై మరింత దృష్టి కేంద్రీకరించేందుకు అప్పటి UPA ప్రభుత్వం మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ నుంచి దీన్ని వేరుచేసి ప్రత్యేక శాఖను రూపొందించగా, తర్వాత ఏర్పాటైన ప్రభుత్వాలు దీన్ని కొనసాగిస్తూ వచ్చాయి. తాజాగా దీన్ని రద్దు చేసి, గతంలో మాదిరిగా సామాజిక న్యాయ శాఖలో ఒక విభాగంగానే చూడనుంది.

Published by:Sridhar Reddy
First published:

Tags: Central Government, National News, PM Narendra Modi

ఉత్తమ కథలు