Corona Insurance: అంగన్​వాడీ కార్యకర్తలకు, ఆరోగ్య కార్యకర్తలకు కేంద్రం గుడ్​న్యూస్​.. రూ. 50 లక్షల కరోనా బీమా కవరేజీ పొడిగింపు..

ప్రతీకాత్మకచిత్రం

కరోనా (corona) విధుల్లో పాల్గొనే ఆరోగ్య కార్యకర్తలు (health workers), అంగన్‌వాడీ కార్యకర్తలు (Anganwadi workers), సహాయకులకు (helpers) కేంద్ర తీపి కబురు అందించింది. బీమా కవరేజీని అందించే ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజీ ప్రయోజనాన్ని కేంద్ర ప్రభుత్వం (central government) పొడిగించింది.

  • Share this:
    కరోనా (corona) విధుల్లో పాల్గొనే ఆరోగ్య కార్యకర్తలు (health workers), అంగన్‌వాడీ కార్యకర్తలు (Anganwadi workers), సహాయకులకు (helpers) రూ .50 లక్షల బీమా కవరేజీని అందించే ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజీ ప్రయోజనాన్ని కేంద్ర ప్రభుత్వం (central government) పొడిగించింది. దేశంలో దాదాపు 13.29 లక్షల మంది అంగన్‌వాడీ కార్యకర్తలు,  11.79 లక్షల మంది సహాయకులకు ఇది వర్తించనుంది. కేంద్ర మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ (Union women and child development ministry) అధికారులు (officials) మంగళవారం వివరాలు వెల్లడించారు.

    ఆయా ప్రాంతాల్లో కరోనాపై అవగాహన, నిఘా డ్రైవ్‌లు (awareness and surveillance drives), ఇంటింటికీ రేషన్ పంపిణీ (door-to-door distribution of ration), కరోనా సోకిన గర్భిణీలను చూసుకోవడం (caring for the infected pregnant women), టీకాలు వేయడం (vaccination drives) వంటి కార్యక్రమాలలో పాల్గొనే వారు ఈ పథకం కిందకి వస్తారని తెలిపారు.

    ఇది కూడా చదవండి : మగువలకు షాకింగ్​ న్యూస్​.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. తులం బంగారం ఎంత ఉందంటే?

    మార్చి 11, 2020 నుంచి ఈ పథకం అమల్లోకి వచ్చిందని, వీరందరికీ రూ. 50 లక్షల బీమా (Insurance) వర్తిస్తుందని WCD మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. కరోనా విధుల్లో మరణించిన వారికి (The package covers loss of life due to coronavirus and accidental death ) ఈ బీమా వర్తించనుంది. ఇప్పటివరకు బీమా ప్రయోజనం కోసం క్లెయిమ్ చేసిన బాధిత కుటుంబాలకు సహాయం చేయడమే కాకుండా, అటువంటి కార్మికులను గుర్తించి జాబితాను కేంద్రానికి విస్తరించాలని జిల్లా యంత్రాంగాలను సైతం కోరినట్లు అధికారి తెలిపారు.

    ఇది కూడా చదవండి: నీళ్లు ఎక్కువగా తాగితే నిత్య యవ్వనంగా కనిపిస్తారా? ముఖంపై ముడుతలు పోవాలంటే ఏం చేయాలి?

    ఈ పథకం నుంచి ఇంకా ఎంత మంది ఆరోగ్య కార్యకర్తలు ప్రయోజనం పొందారనే దానిపై ఇటీవలి డేటా అందుబాటులో లేదన్నారు అధికారులు. అయితే ఈ సంవత్సరం ఏప్రిల్ వరకు 287 క్లెయిమ్‌లు పరిష్కరించామని, ఇందులో రోగులకు చికిత్స చేస్తున్నప్పుడు కోవిడ్ బారిన పడి మరణించిన 168 మంది వైద్యుల కుటుంబాల క్లెయిమ్‌లు ఉన్నాయని తెలిపారు. గత ఏడాది ఈ పథకం ప్రకటించింది ప్రభుత్వం. అయితే మరో కొత్త కంపెనీతో టై అప్​ అయ్యి మరో ఏడాది పొడిగించారు.

    ఇవి కూడా చదవండి:  తిన్న ఆహారం అరగట్లేదా? అయితే రోజూ ఉదయాన్నే ఇలా చేయండి.. సమస్యను దూరం చేసుకోండి

    ముఖంలో కాంతి, తేజస్సు కావాలా ? మొటిమలు తగ్గిపోవాలా? అయితే ఇలా చేయండి
    Published by:Prabhakar Vaddi
    First published: