ప్రభుత్వ ఉద్యోగులకు ఊహించని షాక్ ఇచ్చిన కేంద్రం

(ప్రతీకాత్మక చిత్రం)

ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ సర్కార్ ఊహించని షాక్ ఇచ్చింది. ఇంక్రిమెంట్ల కోసం ఎదురుచూస్తున్న సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్‌కు ఇంకొంతకాలం వేచిచూడక తప్పని పరిస్థితి ఏర్పడింది.

 • Share this:
  కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ సర్కార్ షాక్ ఇచ్చింది. కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయంతో ప్రభుత్వ ఉద్యోగులు ఇంక్రిమెంట్ల కోసం వచ్చే ఏడాది వరకు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్-DoPT 2019-20 సంవత్సరానికి సంబంధించిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల యాన్యువల్ పర్ఫామెన్స్ అసెస్‌మెంట్ రిపోర్ట్-APAR ను 2021 మార్చి 31 వరకు పొడిగించింది. గతంలో ఈ గడువు 2020 డిసెంబర్ 31 వరకే ఉండేది. కానీ మరో మూడు నెలలు పొడిగించింది డీఓపీటీ. వాస్తవానికి ఈ గడువు 2020 మే 31 వరకే ఉండేది. కానీ లాక్‌డౌన్ కారణంగా గడువును 2020 డిసెంబర్ 31 వరకు పొడిగించింది. ఇంక్రిమెంట్ల కోసం అప్పటిదాకా ఆగక తప్పదని అనుకున్నారు ఉద్యోగులు. కానీ తాజాగా మరోసారి మోదీ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. యాన్యువల్ అప్రైజల్ గడువును మరో మూడు నెలలు అంటే 2021 మార్చి వరకు పొడిగిస్తూ డీఓపీటీ జూన్ 11న ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ తమ వేతనాల పెంపు కోసం వచ్చే ఏడాది మార్చి వరకు ఆగాల్సిందే. ఈ నిర్ణయం లక్షలాది మంది గ్రూప్ ఏ, బీ, సీ ఉద్యోగులపై ప్రభావం చూపించనుంది.

  కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల యాన్యువల్ అప్రైజల్‌కు సంబంధించిన ముఖ్యమైన తేదీలు ఇవే...


  ఆన్‌లైన్ ఫామ్ తీసుకోవడానికి చివరి తేదీ- 2020 జూలై 31
  సెల్ఫ్ అప్రైజల్ సబ్మిట్ చేయడానికి చివరి తేదీ- 2020 ఆగస్ట్ 31
  రివ్యూయింగ్ ఆఫీసర్‌కు రిపోర్టింగ్ ఆఫీసర్ నివేదిక పంపడానికి చివరి తేదీ- 2020 సెప్టెంబర్ 30
  APAR సెల్‌కు రివ్యూయింగ్ ఆఫీసర్‌ నివేదిక పంపడానికి చివరి తేదీ- 2020 నవంబర్ 15
  యాక్సెప్టింగ్ అథారిటీ అప్రైజల్ ఇవ్వడానికి చివరి తేదీ- 2020 డిసెంబర్ 31
  యాన్యువల్ అప్రైజల్‌ ప్రాసెస్ పూర్తి చేయడానికి చివరి తేదీ- 2021 మార్చి 31

  ఇవి కూడా చదవండి:

  Electric Scooter: 15 రూపాయలకే 100 కిలోమీటర్ల ప్రయాణం... ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అద్భుతం

  Petrol Prices: వాహనదారులకు షాక్... వరుసగా 10వ రోజు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

  EPF claim: ఈపీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్... ఇక క్లెయిమ్ సెటిల్మెంట్‌కు కొత్త విధానం
  Published by:Santhosh Kumar S
  First published: