మోదీ(Modi) సర్కారు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఉగాది పండుగ తర్వాత తీపి కబురు చెప్పింది. ఉద్యోగులకు డీఏ నాలుగు శాతం పెంచుతున్నట్లుగా కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్(Anurag Thakur) ప్రకటించారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల(Central Ggovernment Eemployees )కు 38శాతం డీఏ (DA)పొందుతున్నారు. పెంచిన 4శాతం కలుపుకొని 42శాతానికి చేరుకుంది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం పట్ల ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగుల డీఏ 4శాతం పెంచడం వల్ల కేంద్ర ప్రభుత్వంపై అదనంగా మరో 12వేల 815కోట్ల రూపాయల భారం పడనుంది.
ఉద్యోగులకు తీపి కబురు..
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెంచిన డీఏ 4శాతం 2023 జనవరి నెల ఒకటవ తేదీ నుంచి వర్తిస్తుందని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. సర్కారు తీసుకున్న నిర్ణయంతో మొత్తం 47.58లక్షల మంది ఉద్యోగులకు, 69.76లక్షల మంది పెన్షన్‌దారులకు ప్రయోజనం కలుగుతుంది.
????LIVE Now???? Cabinet Briefing by Union Minister @ianuragthakur at National Media Centre, New Delhi https://t.co/4oBBqg1uaj
— Office of Mr. Anurag Thakur (@Anurag_Office) March 24, 2023
కోటి మందికి ప్రయోజనం..
ద్రవ్యోల్బణం, పెరుగుతున్న ధరల భారాన్ని దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల పట్ల ఈ నిర్ణయం తీసుకుంది. ఏడవ వేతన సంఘం సిఫార్సుల మేరకు ఈ డీఏ పెంపు నిర్ణయం తీసుకోవడం జరిగిందని మంత్రి అనురాగ్‌ఠాకూర్ తెలిపారు. డీఏ పెంపుతో పాటు ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద అందించే సబ్సిడీని మరో ఏడాది పొడిగించినట్లుగా ప్రకటించారు కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Central govt employees, Delhi news