విమానాల్లో కొత్త సేవలు.. ప్రయాణికులు ఫుల్ ఖుషీ..

జర్మనీ విషయానికి వస్తే లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్‌తో ఒప్పందం దాదాపు ఖరారైందని.. వారి అభ్యర్థనను ప్రస్తుతం ప్రాసెసింగ్ చేస్తున్నట్టు పేర్కొన్నారు. అంతర్జాతీయ విమాన సర్వీసులకు సంబంధించి అనేక దేశాల నుంచి తమకు అభ్యర్థనలు వస్తున్నాయని.. అయితే తాము ఆచితూచి అడుగులు వేస్తున్నట్టు హర్దీప్ సింగ్ పురీ తెలిపారు.

విమానయాన శాఖ కొత్త సేవల్ని అందుబాటులోకి తెచ్చింది. విమానంలో వైఫై ద్వారా ఇంటర్నెట్‌ సేవల్ని వినియోగించుకునే అవకాశాన్ని కల్పించింది.

  • Share this:
    విమాన ప్రయాణికులు విమానంలో ఉన్నపుడు ఫోన్ వాడరాదు, ఉన్నా.. ఫ్లైట్ మోడ్‌లో పెట్టేయాలి, ల్యాప్‌టాప్ వినియోగించే వెసులుబాటు లేదు.. అయితే, విమానయాన శాఖ కొత్త సేవల్ని అందుబాటులోకి తెచ్చింది. విమానంలో వైఫై ద్వారా ఇంటర్నెట్‌ సేవల్ని వినియోగించుకునే అవకాశాన్ని కల్పించింది. ఈ మేరకు విమానయాన సంస్థలకు అనుమతినిస్తూ నోటిఫికేషన్‌ ఇచ్చింది. ‘విమానం ప్రయాణంలో ఉన్నపుడు ఇంటర్నెట్ వినియోగించుకోవచ్చు. వైఫై సదుపాయంతో ల్యాప్‌టాప్‌, ట్యాబ్‌, స్మార్ట్ వాచ్‌, ఈ-రీడర్‌ తదితర ఎలక్ట్రానిక్ పరికరాలను ఫ్లైట్‌ మోడ్‌ లేదా ఎయిర్‌ప్లేన్‌ మోడ్‌లో ఉంచి వాడుకోవచ్చు’ అని స్పష్టం చేసింది.

    అయితే.. ఇంటర్నెట్‌ సేవల్ని అందించే సదుపాయాలు ఉన్నాయని డైరెక్టర్‌ జనరల్‌ ధ్రువీకరించాల్సి ఉంటుంది. కాగా, భారత్‌లో ఇన్‌-ఫ్లైట్‌ వైఫై సేవల్ని తొలిసారి విస్తారా సంస్థకు చెందిన బోయింగ్ 787-9 విమానం అందించనుంది.
    Published by:Shravan Kumar Bommakanti
    First published: