CENTRAL CABINET TOOK RS 23123 CRORES COVID RELIEF PACKAGE TO TACKLE SITUATION IN FUTURE ALONG WITH SOME OTHER DECISIONS AK
Cabinet Decisions: కరోనా రిలీఫ్ ప్యాకేజీ రూ. 23,123 కోట్లు.. కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్
ప్రధాని మోదీ(ఫైల్ ఫొటో)
Cabinet Decisions: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఈ నిధులను వినియోగిస్తాయని.. రాష్ట్రాలతో చర్చించిన తరువాత వీటిని కేటాయిస్తామని కేంద్ర వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవియ తెలిపారు.
మంత్రివర్గ విస్తరణ అనంతరం నేడు వర్చువల్గా సమావేశమైన కేంద్ర కేబినెట్ పలు నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఎదురైన ఇబ్బందులను తొలగించేందుకు రూ. 23,000 కోట్ల రిలీఫ్ ప్యాకేజీని ప్రకటించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఈ నిధులను వినియోగిస్తాయని.. రాష్ట్రాలతో చర్చించిన తరువాత వీటిని కేటాయిస్తామని కేంద్ర వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవియ తెలిపారు. ఈ ప్యాకేజీ ద్వారా కేంద్రం కరోనాపై పోరాటానికి మరింత మెరుగ్గా సిద్ధమవుతోందనే ధీమా కలిగిస్తోందని అన్నారు. రాబోయే తొమ్మిది నెలల్లో ఈ ప్యాకేజీని అమలు చేస్తామని తెలిపారు. దేశంలోని 736 జిల్లాల్లో చిన్నపిల్లల సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని అన్నారు. దీంతో పాటు దేశవ్యాప్తంగా 20 వేల ఐసీయూ బెడ్స్ ఏర్పాటు చేస్తామని మంత్రి మన్సుఖ్ తెలిపారు.
దేశంలో కొబ్బరి సాగు పెంచేందుకు కొబ్బరి బోర్డు చట్టంలో మార్పులు చేసినట్టు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. ఓ నాన్ అఫీషియల్ వ్యక్తి కోకోనట్ బోర్డు ప్రెసిడెంట్గా ఉంటారని అన్నారు. ఆయన రైతు వర్గం నుంచి ఉంటారని చెప్పారు. ఆయనకు కొబ్బరి సాగు గురించి మంచి అవగాహన ఉంటుందని తెలిపారు.
వ్యవసాయ మార్కెట్లు తొలగిస్తారనే విషయంలో వాస్తవం లేదని మంత్రి తోమర్ అన్నారు. కొత్త వ్యవసాయ చట్టాలు అమలులోకి వచ్చిన తరువాత మార్కెట్లకు కోట్ల రూపాయలు వస్తాయని.అన్నారు. అవి రైతులకు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.