Good News: ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం దీపావళి కానుక..

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు మోదీ సర్కారు తీపి కబురు అందించింది. దీపావళి వేళ.. వారికి 5 శాతం డీఏ పెంచుతున్నట్లు ప్రకటించింది.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: October 9, 2019, 3:36 PM IST
Good News: ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం దీపావళి కానుక..
ప్రకాశ్ జావడేకర్
  • Share this:
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు మోదీ సర్కారు తీపి కబురు అందించింది. దీపావళి వేళ.. వారికి 5 శాతం డీఏ పెంచుతున్నట్లు ప్రకటించింది. దీన్ని ఈ ఏడాది జూలై నుంచే వర్తింపజేస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అంటే.. ప్రస్తుతం ఉన్న 12 శాతం డీఏ స్థానంలో ఉద్యోగులకు 17 శాతం డీఏ అందనుంది. కేబినెట్ సమావేశం తర్వాత కేంద్ర మంత్రి ప్రకాశ్ జావడేకర్ మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 5 శాతం డీఏను పెంచుతున్నట్లు తెలిపారు. దీనివల్ల 48 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, 62 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం చేకూరుతుందని ఆయన తెలిపారు. డీఏ పెంపుతో ప్రభుత్వ ఖాజానాపై రూ.16వేల కోట్ల భారం పడతుంది.


కాగా, ఆశా వర్కర్లకు ఇచ్చే భత్యాన్ని రూ.1000 నుంచి రూ.2000కు పెంచినట్టు కూడా జావడేకర్ ప్రకటించారు. అదే విధంగా ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ప్రయోజనాలు పొందేందుకు ఆధార్ అనుసంధానానికి ఉన్న ఆగస్టు 1వ తేదీ గడువును నవంబరు 30 వరకు పెంచినట్లు తెలిపారు.ఇది చూడండి:

ఏపీలో పిడుగుపాటుకు 150 గొర్రెలు మృతి
Published by: Shravan Kumar Bommakanti
First published: October 9, 2019, 3:36 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading