Home /News /national /

CENTER ANNOUNCES PADMA SHRI AWARD FOR SHIVANAND BABA A 125YEAR OLD YOGA TEACHER FROM VARANASI SNR

126ఏళ్లు ఇంకా చేస్తూనే ఉన్నాడు..అందుకే ఆ పెద్దాయనకి పద్మశ్రీ ఇచ్చారు

Photo Credit:Twitter

Photo Credit:Twitter

WOW: వారణాసికి చెందిన 125సంవత్సరాల వృద్ధుడు శివానంద్‌బాబాకు అరుదైన గౌరవం దక్కింది. అత్యంత వృద్ధ యోగా గురువుగా ప్రపంచ జనాభాకు ఆదర్శంగా నిలిచినందుకు కేంద్రం ఆయన్ని పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.

వ్యాయమం, ఆసనాలు, యోగా ఆరోగ్యాన్ని వందేళ్ల పాటు పదిలంగా కాపాడుతాయని ప్రగాడంగా విశ్వసించే వారిలో ముఖ్యులు శివానంద్‌బాబా(Shivanand Baba). ఉత్తరప్రదేశ్‌ (Uttar pradesh)వారణాసిలో నివాసముంటున్న శివానంద్‌బాబా అత్యంత వృద్ధ వయసు కలిగిన యోగా గురువుగా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. 125సంవత్సరాల వయసు (125year old) కలిగిన శివానంద్‌బాబా 1979నుంచి వారణాసి(Varanasi)లో నివాసముంటున్నారు. 125 ఏళ్ల శివానంద్ బాబా విశిష్టత గురించి తెలుసుకున్న కేంద్ర ప్రభుత్వం (Central government)ఆయనకు రిపబ్లిక్‌ డే సందర్భంగా పద్మశ్రీ అవార్డు(Padma shri award)ఇవ్వాలని నిర్ణయించింది. నూట పాతికేళ్ల వయసులో కూడా ఆయన పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారు. అంతే కాదు శివానంద్‌బాబా ప్రతి రోజు ఉదయం మూడు గంటలకు నిద్రలేచి క్రమం తప్పకుండా కఠినమైన యోగా(Yoga)ఆసనాలు చేస్తూ తన ఆరోగ్యాన్ని మరింత జాగ్రత్తగా చూసుకుంటున్నారు. 125సంవత్సరాల వయసులో కళ్లజోడు లేకుండా పుస్తకాలు, పేపర్లు చదువుతున్నారు శివానంద్‌బాబా. తెల్లవారు జామున గంటన్నరకుపైగా వ్యాయవం చేస్తారు. అటుపై మరో గంట కేసు వాకింగ్‌, అటుపై భగవంతున్ని ప్రార్ధించడం తన దినచర్యగా పేర్కొన్నారు శివానంద్‌బాబా. అంతే కాదు ఉడకబెట్టిన ఆహారాన్ని మాత్రమే భోజనంగా స్వీకరిస్తున్నారు. శివానంద్‌బాబా ఆరోగ్యసూత్రం ఏమిటని అడిగితే రోజు వ్యాయమం, యోగా చేస్తే సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారని చెబుతారు. ఆయన శిష్యులైతే శివానంద్‌బాబా నిత్యం పాలు, పెరుగు వంటి వాటిని కూడా తీసుకోకుండా కొవ్వు, నూనె పదార్ధాలు తగిలే వస్తువులు, భోజన పదార్ధాలకు దూరంగా ఉంటారని చెబుతున్నారు. అందుకే ఆయన 126సంవత్సరాల వయసు వచ్చినప్పటికి పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని పేర్కొన్నారు.

పెద్దాయనకు పుద్మశ్రీ పురస్కారం..
వారణాసిలో ఉంటున్న శివానంద్‌బాబాకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రకటించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. నాకు ఇచ్చిన ఈ పురస్కారం ప్రపంచంలోని అందరికి ఉపకారమైనదిగా భావిస్తున్నానని చెప్పారు. ప్రతి వ్యక్తి యోగా చేయడం వల్ల లాభం పొందుతే తప్ప నష్టపోరని తెలిపారు శివానంద్‌బాబా.

వృద్దుడు కాదు, మహా గట్టోడు..
వృద్ధ యోగా గురువు శివానంద్‌బాబా దగ్గర శిష్యరికం చేస్తున్న వాళ్లు సైతం కేంద్రం పద్మశ్రీ అవార్డును ప్రకటించడంపై సంతోషం వ్యక్తం చేశారు. రెండ్రోజుల క్రితం కేంద్ర హోంశాఖ జాయింట్‌ సెక్రట్రీ నుంచి ఫోన్‌ వచ్చిందని..శివానంద్‌బాబాకు పద్మశ్రీ అవార్డు అందజేస్తున్నట్లుగా చెప్పడం ఎంతో ఆనందంగాన్ని కలిగించిందన్నారు శిష్యుడు సంజయ్‌ సర్వంజన.
Published by:Siva Nanduri
First published:

Tags: Padma Awards, Uttar pradesh

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు