తమిళనాడులోని జరిగిన ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాప్ బిపిన్ రావత్, ఆయన భార్య సహా 13 మంది చనిపోయారు. ఈ విషయాన్ని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ధృవీకరించింది. ఉదయం తమిళనాడులో హెలికాప్టర్ ప్రమాదం జరగడంతో ఆర్మీ అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. కూనూరులో ఆర్మీకి చెందిన హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ఘటనలో సీడీఎస్ బిపిన్ రావత్ (CDS Bipin rawat) తో పాటు పలువురు ఆర్మీ ఉన్నతాధికారులు ఉండటంలో అంతా అప్రమత్తమయ్యారు. ఆర్మీకి చెందిన MI-17 V5 విమానం... నీలగిరి జిల్లా కూనూర్ సమీపంలోని అటవీ ప్రాంతంలో కుప్పకూలింది. ఢిల్లీ నుంచి ఊటీలోని ఓ డిఫెన్స్ కాలేజీకి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రాథమిక సమాచారం ప్రకారం హెలికాప్టర్‌లో 9 మంది ఉన్నట్లు తెలిసింది. అయితే అనంతరం అందులో 14 మంది ఉన్నట్టు ధృవీకరించారు. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు బిపిన్ రావత్ తమిళనాడుకు వచ్చారు. కోయంబత్తూరులోని సూలూరు ఎయిర్ బేస్ వరకు విమానంలో వెళ్లారు. అక్కడ వీరితో పాటు మరో ఐదుగురు కలిసి.. మొత్తం 14 మంది ప్రత్యేక హెలికాప్టర్‌లో కూనూర్‌కు బయలుదేరారు. ఐతే సూలూర్ ఎయిర్ బేస్ నుంచి టేకాఫ్ అయిన కాసేపటికే కూనూరు సమీపంలో కూలిపోయింది.
With deep regret, it has now been ascertained that Gen Bipin Rawat, Mrs Madhulika Rawat and 11 other persons on board have died in the unfortunate accident.
— Indian Air Force (@IAF_MCC) December 8, 2021
హెలికాప్టర్ కూలిన వెంటనే పెద్ద ఎత్తునమంటలు చెలరేగాయి. ఆ మంటలను చూసి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు వెంటనే చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. విమానంలో సీడీఎస్ బిపిన్ రావత్‌తో పాటు మొత్తం 9 మంది ప్రయాణికులు ఉండగా.. ఇప్పటి వరకు ఏడుగురి మృతదేహాలు లభ్యమయినట్లు తెలుస్తోంది. ఐతే ఆ మృతదేహాలు ఎవరివి అనే వివరాలు తెలియాల్సి ఉంది. మృతదేహాలు పూర్తిగా కాలిపోయిన స్థితిలో ఉండడంతో వారు ఎవరన్నది గుర్తు పట్టడం కష్టంగా మారింది. మృతదేహాలను వెల్లింగ్టన్‌లోని మిలటరీ ఆస్పత్రికి తరలించినట్లు ఆర్మీ వర్గాలు తెలిపాయి.
ఐతే హెలికాప్టర్‌లో ఉన్న బిపిన్ రావత్ పరిస్థితి ఏమిటనే దానిపై ఆందోళన నెలకొంది. ఈ ప్రమాదంపై ప్రధాని మోదీ ఆర్మీ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఘటనకు సంబంధించిన వివరాలను ప్రధాని నరేంద్రమోదీకి వివరించారు. అనంతరం రాజ్‌నాథ్ సింగ్ పార్లమెంట్‌లో దీనిపై ప్రకటన చేస్తారనే వార్తలు వచ్చాయి. అయితే ఆయన నేరుగా ఢిల్లీలోని బిపిన్ రావత్ ఇంటికి వెళ్లి ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు.
ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ బిపిన్ రావత్‌ను ఆస్పత్రికి తరలించి వైద్యం అందించారనే వార్తలు కూడా వచ్చాయి. మృతుల సంఖ్య ఎప్పటికప్పుడు పెరుగుతున్నట్టు వార్తలు వచ్చినా.. రావత్ పరిస్థితి ఏమిటన్న దానిపై అధికార వర్గాలు స్పందించలేదు. అయితే కొద్దిసేపటి క్రితం ఆయన మరణించినట్టు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారికంగా ప్రకటించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bipin Rawat, Helicopter Crash