హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Tamilnadu helicopter crash: హెలికాప్టర్‌ ప్రమాదంలో ఐదుగురు మృతి.. అందులో ఉన్న వారి వివరాలు ఇవే

Tamilnadu helicopter crash: హెలికాప్టర్‌ ప్రమాదంలో ఐదుగురు మృతి.. అందులో ఉన్న వారి వివరాలు ఇవే

Tamilnadu helicopter crash: కుప్పకూలిన హెలికాప్టర్‌లో మొత్తం 14 మంది ఉన్నారు. ఇప్పటి వరకు ఐదుగురి మృతదేహాలు లభ్యమ్యాయి. రెస్క్యూ సిబ్బంది ఇద్దరిని కాపాడి ఆస్పత్రికి తరలించారు.

తమిళనాడులో జరిగిన ఘోర హెలికాప్టర్ ప్రమాదం (Tamilnadu Helicopter crash) లో పలువురు ఆర్మీ ఉన్నతాధికారులు మరణించినట్లు తెలుస్తోంది. విమానంలో సీడీఎస్ బిపిన్ రావత్‌ (Bipin Rawat)తో పాటు మొత్తం 14 మంది ప్రయాణికులు ఉండగా.. ఇప్పటి వరకు ఐదుగురి మృతదేహాలు లభ్యమయినట్లు తెలుస్తోంది. ఐతే ఆ మృతదేహాలు ఎవరివి అనే వివరాలు తెలియాల్సి ఉంది. మృతదేహాలు పూర్తిగా కాలిపోయిన స్థితిలో ఉండడంతో వారు ఎవరన్నది గుర్తు పట్టడం కష్టంగా మారింది. మృతదేహాలను వెల్లింగ్టన్‌లోని మిలటరీ ఆస్పత్రికి తరలించినట్లు ఆర్మీ వర్గాలు తెలిపాయి. ఘటనా స్థలం నుంచి మరో ఇద్దరిని కాపాడారని తెలుస్తోంది. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఐతే వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

Tamilnadu: తమిళనాడులో ఘోర హెలికాప్టర్ ప్రమాదం.. చాపర్‌లో CDS బిపిన్ రావత్ ఫ్యామిలీ

ఐతే హెలికాప్టర్‌లో ఉన్న బిపిన్ రావత్ పరిస్థితి ఏంటన్నది ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదంపై ప్రధాని మోదీ ఆర్మీ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. అనంతరం వెంటనే కేబినెట్ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

హెలికాప్టర్‌‌లో ఉన్న వారి వివరాలు.

1. బిపిన్ రావత్, సీడీఎస్

2. మధులికా రావత్, DWWA అధ్యక్షురాలు, బిపిన్ రావత్ సతీమణి

3. ఎల్.ఎస్. సిద్దర్, బ్రిగేడియర్

4. హర్జిందర్ సింగ్, లెఫ్టినెంట్ కల్నల్

5. గురుసేవక్ సింగ్, నాయక్

6. జితేంద్ర కుమార్, నాయక్

7. వివేక్ కుమార్, లాన్స్ నాయక్

8. బి. సాయి తేజ, లాన్స్ నాయక్

9. సత్‌పాల్, హవిల్దార్.

ఈ 9 మంది ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరారు. కోయంబత్తూరులోని సూలూరు ఎయిర్‌ బేస్ వరకు విమానంలో వెళ్లారు. అక్కడ వీరితో పాటు మరో ఐదుగురు కలిసి.. మొత్తం 14 మంది ప్రత్యేక హెలికాప్టర్‌లో కూనూర్‌కు బయలుదేరారు. ఐతే సూలూర్ ఎయిర్ బేస్ నుంచి టేకాఫ్ అయిన కాసేపటికే కూనూరు సమీపంలో కూలిపోయింది. ఐతే ప్రమాదం ఎలా జరిగిందన్న వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించినట్లు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తెలిపింది.

First published:

Tags: Bipin Rawat, Helicopter Crash, Indian Army, Tamilnadu

ఉత్తమ కథలు