CBSE Controversial Passage: సీబీఎస్ఈ పదోతరగతి బోర్డు ఇంగ్లీష్ పరీక్షలో ఓ పేరా వివాదస్పదం అయ్యింది. ఈ పేరాలో మహిళపై వివాదస్పద వ్యాఖ్యలు ఉన్నాయని ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ విషయంపై పార్లమెంట్ (Parliament) లో ప్రస్తావించారు. దీనిపై స్పందించిన బోర్డు ప్రశ్నను తొలగించి.. విద్యార్థులందరికీ మార్కులు ఇస్తున్నట్టు ప్రకటించింది.
డిసెంబర్ 11, 2021న జరిగిన సీబీఎస్ఈ (CBSE) పదోతరగతి ఇంగ్లీష్ పరీక్ష ప్రశ్నా పత్రంలో ‘మహిళలను తక్కు వ చేసి చూడడం , భర్త మార్గాన్ని అనుసరిం చడం ద్వా రానే తల్లి తన పిల్లల విధేయతను పొందగలదు’ అనే అర్థం వచ్చే వాక్యా లు ఓ పేరా రూపొందించారని ఇది పూర్తిగా అభ్యంతరకరమని ప్రతి పక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో సీబీఎస్ఈ బోర్డు ఆ కాంప్రెహెన్షన్ పేరాను తొలగిస్తున్నట్టు ప్రకటిచింది. మహిళలకు వ్యతిరేకంగా ఉన్న ఈ పేరాను తొలగించి.. అందరు విద్యార్థులకు పూర్తిగా మార్కులు ఇస్తున్నట్టు బోర్డు ప్రకటించింది. ఈ విషయాన్ని కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ (Sonia Gandhi) లోక్ సభలో ప్రస్తావించారు. ఆమె దీనిపై మాట్లాడుతూ ఇది 'షాకింగ్ రిగ్రెసివ్ పాసేజ్' అని ప్రస్తావించింది. ఈ ప్యాసెజ్ను తొలగించడంతోపాటు బోర్డు క్షమాపణలు చెప్పాలని కోరింది.
#WATCH | Congress interim chief Sonia Gandhi raises in Lok Sabha the issue of inclusion of a 'shockingly regressive passage' in CBSE's question paper for Grade 10 exam, demands withdrawal of the passage & apology
‘ఇప్పటి వరకు సీబీఎస్ఈ పేపర్లన్నీ కఠినంగానే ఉన్నా యి. ఇక ఇంగ్లీష్ పేపర్లో ఇచ్చిన కాంప్రెహెన్షన్ పాసేజ్ చాలా అసహ్యంగా ఉంది. యువత మనోధైర్యా న్ని , భవిష్య త్తును దెబ్బ తీసే ఇటువం టి చర్య..
ప్రియాంక గాంధీ కూడా ఈ అంశంపై మాట్లాడారు. మనం నిజంగా పిల్లలకు ఏం నేర్పుతున్నాము.. బీజేపీ ప్రభుత్వం మహిళలపై ఈ తిరోగమన దృక్పథాలను ప్రోత్సహిస్తోందని ఆమె వ్యాఖానించారు. ఇలాంటివి సీబీఎస్సీ పాఠ్యాంశాల్లో ఎందుకు కనిపిస్తున్నాయని అన్నారు.
ఈ అంశపై పలువురు ట్వీట్ కూడా చేశారు. ఇంగ్లీష్ పేపర్ చాలా అసహ్యం గా ఉం దని కాం గ్రెస్ నేత రాహుల్ గాం ధీ ఆగ్రహం వ్య క్తం చేశారు. ఇది ఆర్ఎస్ఎస్-భాజపా పన్నా గం లోనే భాగమేనని ఆరోపిం చిన ఆయన.. యువత మనోధైర్యా న్ని, భవిష్య త్తును నాశనం చేసే ప్రయత్న మేనని దుయ్య బట్టారు. దీంతో బోర్డు పేరాను ఉపసహరించుకొని విద్యార్థులందరికీ మార్కులు ఇస్తున్నట్టు ప్రకటించింది.
గతంలోనూ..
గతంలోనూ సీబీఎస్ఈ ప్రశ్నాపత్రాల్లో తప్పులు వచ్చాయి. "2002లో గుజరాత్లో ముస్లిం వ్యతిరేక హింస ఏ ప్రభుత్వ హయాంలో జరిగింది?" అంటూ CBSE 12వ తరగతి పరీక్షలో అడిగింది. అప్పుడు దీనిపై విమర్శలు రావడంతో బోర్డు క్షమాపణలు చెబప్పింది.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.