విద్యార్థులు ఎదురు చూస్తున్న సీబీఎస్‌ఈ 12వ (CBSE) తరగతి పరీక్ష ఫలితాలు ఈ రోజు విడుదల అయ్యాయి. ఎవరైతే విద్యార్థులు ఆఫ్‌లైన్ (Offline) పరీక్షలు రాశారో వారితోపాటు.. సీబీఎస్సీ కంపార్ట్‌మెంట్, ఇంప్రూవ్‌మెంట్ పరీక్ష రాసిన విద్యార్థులకు సంబంధించిన ఫలితాలు వెలువడ్డాయి. అంతే కాకుండా ప్రైవేటుగా పరీక్ష రాసే విద్యార్థుల ఫలితాలు సెప్టెంబర్ 30, ,2021 మధ్యాహ్నం 12 గంటలకు విడుదల అవుతాయని సీబీఎస్సీ బోర్డు చెప్పింది. సీబీఎస్సీ ఫలితాలు జూలైలో విడుల అయ్యాయి. ఆ సమయంలో కరోనా ఉద్ధృతి నేపథ్యంలో 12వ తరగతి పరీక్షలు రద్దయ్యాయి. ఈ విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో పదో తరగతి పరీక్షల్లో విద్యార్థులు సాధించిన మార్కులకు 30 శాతం, 11 వ తరగతిలో మార్కుల ఆధారంగా 30 శాతం, 12వ తరగతిలో మిడ్ టర్మ్, ప్రీ-బోర్డ్ పరీక్షల్లో విద్యార్థులు సాధించిన మార్కులకు 40 శాతం వెయిటేజీ ఇచ్చారు.
TCS iON : గ్రాడ్యుయేట్లకు గుడ్ న్యూస్.. టీసీఎస్ ఐఓన్ 15 రోజుల ఉచిత కోర్సు
ఇలా మొత్తం 100 శాతానికి మార్కులను లెక్కించి ఫలితాలను విడుదల చేసింది సీబీఎస్ఈ బోర్డు. ఎవరైనా విద్యార్థులు క్వాలిఫయింగ్ మార్కులు సాధించకుంటే వారిని కంపార్ట్మెంట్ కేటగిరీలో ఉంచుతారు. ఈ ఫలితాలపై సంతృప్తి చెందని విద్యార్థులకు కరోనా పరిస్థితులు చక్కబడ్డాక పరీక్షలు రాసుకునే అవకాశం కల్పిస్తామని ఇప్పటికే సీబీఎస్‌ఈ బోర్డు తెలిపింది. ఎవరైనా విద్యార్థులు క్వాలిఫయింగ్ (Qualifying) మార్కులు సాధించకుంటే వారిని కంపార్ట్మెంట్ (Compartment) కేటగిరీలో ఉంచుతారు. ఈ ఫలితాలపై సంతృప్తి చెందని విద్యార్థులకు కరోనా (Corona) పరిస్థితులు చక్కబడ్డాక పరీక్షలు రాసుకునే అవకాశం కల్పిస్తామని ఇప్పటికే సీబీఎస్‌ఈ బోర్డు తెలిపింది. అలా పరీక్షలు రాసిన వారి ఫలితాలే ఈ రోజు విడుదల అయ్యాయి.
ఫలితాలు ఎలా చూసుకోవాలి..
Step 1 : ముందుగా అధికారి వెబ్‌సైట్ cbseresults.nic.in లోకి వెళ్లాలి.
Step2 : అనంతరం Compartment Examination ఫలితాల్లోకి వెళ్లాలి.
Step 3 : అవసరమైన సమాచారం అందించాలి.
Step 4 : తరువాత ఫలితాలను డౌన్‌లోడ్ చేసుకోవాలి.
Step 5 : ఫలితాలను ప్రింట్ తీసుకోని దాచుకోవాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CBSE, CBSE Board Exams 2021, EDUCATION, Exam results