Home /News /national /

CBSE BOARD EXAMS 2023 IN FEBRUARY WITH 100 PERCENT SYLLABUS UMG GH

CBSE Exams: స్టూడెంట్స్‌కి దిమ్మతిరిగే న్యూస్.. స్కూల్స్‌కి మతిపోయే వార్త.. సీబీఎస్‌ఈ సిలబస్‌పై పాఠశాలలకు బోర్డు షాక్..!

సీబీఎస్‌ఈ పరీక్షలకు వంద శాతం సిలబస్

సీబీఎస్‌ఈ పరీక్షలకు వంద శాతం సిలబస్

సీబీఎస్‌ఈ 2023 అకడమిక్ సెషన్ కోసం వార్షిక పరీక్షలను ఫిబ్రవరిలోనే నిర్వహిస్తామని ఇటీవల ప్రకటించింది. అకడమిక్ సైకిల్‌ను తిరిగి ట్రాక్ లోకి తీసుకురావడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సిలబస్‌లో కూడా మార్పులు చేయనుంది.

సీబీఎస్‌ఈ 2023 అకడమిక్ సెషన్ కోసం వార్షిక పరీక్షలను ఫిబ్రవరిలోనే నిర్వహిస్తామని ఇటీవల ప్రకటించింది. అకడమిక్ సైకిల్‌ను తిరిగి ట్రాక్ లోకి తీసుకురావడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సిలబస్‌లో కూడా మార్పులు చేయనుంది. గత రెండేళ్లుగా 30 శాతం సిలబస్ కోత విధించగా, ఇకపై పూర్తి సిలబస్‌తో పరీక్షలను నిర్వహించనుంది. మరోపక్క బోర్డు పరీక్షల కోసం విద్యార్థులు ప్రిపేర్ కావడానికి అందుబాటులో ఉన్న సమయం సరిపోతుందా అనే ప్రశ్న తలెత్తుతోంది. ఫిబ్రవరిలోనే వార్షిక బోర్డు పరీక్షలు నిర్వహిస్తామన్న సీబీఎస్‌ఈ ప్రకటనపై స్కూల్స్ యాజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుత బ్యాచ్‌లు కూడా రెండేళ్ల పాఠశాలల మూసివేత కారణంగా స్టడీలో అవాంతరాలను ఎదుర్కొంటున్నాయని స్కూల్ యాజమాన్యాలు వాపోతున్నాయి.

గురుగ్రామ్‌లోని అమిటీ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రిన్సిపాల్ డాక్టర్ అన్షు అరోరా మాట్లాడుతూ.. ‘ఈ సంవత్సరం బోర్డు పరీక్షల్లో జాప్యం కారణంగా 11వ తరగతి విద్యార్థులకు పూర్తి సిలబస్‌ను కవర్ చేయడానికి చాలా తక్కువ సమయం ఉంది. ఇది చాలా తీవ్రమైన అంశం. ఎక్స్‌ట్రా క్లాసుల అవసరం ఉంది. డిసెంబర్ 2022 నాటికి పాఠశాలలు సిలబస్‌ను పూర్తి చేయడానికి ప్లాన్ చేసుకోవాలి. ఒకవేళ బోర్డు పరీక్షలు ఫిబ్రవరి/మార్చిలో నిర్వహిస్తే, డిసెంబర్-జనవరిలో 12వ తరగతి ప్రాక్టికల్స్ పూర్తవుతాయి. తద్వారా విద్యార్థులు ఆ తర్వాత థియరీపై దృష్టి పెట్టడానికి అవకాశం ఉంటుంది. దీంతో సీబీఎస్‌ఈ పరీక్షా తేదీలపై స్పష్టమైన మార్గదర్శకాలను ఎంత త్వరగా ప్రకటిస్తే అంత మంచిది’ అని అభిప్రాయపడ్డారు.

ఇదీ చదవండి: 300 ఏళ్ల తర్వాత దొరికిన అతిపెద్ద పింక్ డైమండ్.. దీని విలువ తెలిస్తే మతిపోతుంది.. ఎక్కడ దొరికిందంటే !


షాలిమార్ బాగ్‌లోని మోడ్రన్ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ అల్కా కపూర్ మాట్లాడుతూ.. రెండు సంవత్సరాల తరువాత 100 శాతం సిలబస్‌ కారణంగా విద్యార్థుల ప్రిపరేషన్ వ్యూహాలపై కొంత ప్రభావం పడవచ్చన్నారు. ఈ ఆకస్మిక మార్పు విద్యార్థుల ప్రస్తుత మనస్తత్వాన్ని ప్రభావితం చేస్తుందని, మారిన షెడ్యూల్ కారణంగా వారిపై ఒత్తిడిని పెంచుతుందన్నారు. ‘ఇటువంటి మార్పులను ఎదుర్కోవటానికి, విద్యార్థులు నిర్ణీత వ్యవధిలో పరీక్షను ముగించడానికి రాత వేగాన్ని మెరుగుపరచుకోవాలి. అయితే ఇక్కడ ఓ పెద్ద సమస్య ఉంది. విద్యార్థులు 3 గంటల పరీక్షకు కూర్చోవడం అలవాటు చేసుకోలేదు. ఇది సవాల్‌తో కూడుకున్నది.’ అని కపూర్ అన్నారు.

వీజీ బులంద్‌షహర్ ప్రిన్సిపాల్ మీనాంబిక మాట్లాడుతూ.. “బోర్డు పరీక్షల కోసం టైమ్‌లైన్లు సవరించినప్పుడు విద్యార్థులు బాగా ప్రిపేర్ అవ్వడానికి, రెగ్యులర్ టీచింగ్ టైమ్ తర్వాత అనేక చర్యలు తీసుకున్నాం. ఇది వ్యక్తిగతంగా విద్యార్థుల విద్యా అవసరాలను తీర్చడంలో సహాయపడుతుంది. కరోనా కారణంగా తలెత్తిన స్టడీ అంతరాలను మా ఉపాధ్యాయులు రెక్టీఫై చేస్తున్నారు. తద్వారా 2023 పరీక్షల కోసం తమ సామర్థ్యాలను పెంచుకోవడంపై దృష్టి సారిస్తాం’’ అని చెప్పుకొచ్చారు.అమిటీ ప్రిన్సిపాల్ అరోరా మాట్లాడుతూ.. మొదటి టర్మ్‌లోనే వీక్ స్టూడెంట్స్‌ను గుర్తించి, ప్రతి వారం జీరో పీరియడ్‌లో రెమెడియల్, రివిజన్ తరగతులను ప్రారంభిస్తామన్నారు. ‘‘తమ పనితీరును ఆప్టిమైజ్ చేయడానికి, ఆగస్టు నుంచి రివిజన్ షెడ్యూల్‌ను పర్యవేక్షిస్తాం. మొదటి టర్మ్‌లో ఫర్పార్మెన్స్ సరిగాలేని విద్యార్థుల తల్లిదండ్రులతో రెగ్యులర్ PTM, కౌన్సెలింగ్ సెషన్స్ చేపడతాం.’’ అని ఆమె తెలిపారు.
Published by:Mahesh
First published:

Tags: CBSE, Cbse exams, JOBS, Students

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు