సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 10వ తరగతి ఫలితాలు ఇవాళ రిలీజ్ కాబోతున్నాయంటూ వస్తున్న వార్తల్ని ఖంచిండింది బోర్డు. తాము ఇలాంటి అధికారిక ప్రకటన ఏదీ చెయ్యలేదనీ, అందువల్ల ఇవాళ ఫలితాలు వస్తాయంటూ... సోషల్ మీడియాలో వస్తున్న కథనాల్ని నమ్మొద్దని విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్ని కోరింది బోర్డు. ఫలితాలు ఎప్పుడు వెల్లడించేదీ త్వరలో చెబుతామని తెలిపింది. ఫిబ్రవరి 2 నుంచీ మార్చి 29 వరకు CBSE 10వ తరగతి పరీక్షలు జరిగాయి. దేశం మొత్తమ్మీద 27,00,000 మంది విద్యార్థులు 10వ తరగతి ఎగ్జామ్స్ రాశారు. వాళ్లకు సంబంధించిన ఫలితాలు ఇవాళ విడుదల అవుతాయని దేశవ్యాప్తంగా ప్రచారం జరిగింది. ఐతే... ఇప్పుడు డైరెక్టుగా సీబీఎస్ఈ బోర్డే అధికారికంగా ఫలితాలు ఇవాళ రిలీజ్ కావట్లేదని చెప్పడంతో... ఈ పుకార్లకు చెక్ పెట్టినట్లైంది.
Rama Sharma, PRO CBSE: There is unconfirmed fake news being circulated on some social media platforms about CBSE class X results being announced today. It is to inform all Principals, students, parents and public that CBSE class X results will not be declared today. pic.twitter.com/Ta6Gdn7PYf
సీబీఎస్ఈ పన్నెండో తరగతి ఫలితాలు గురువారం రిలీజయ్యాయి. ఆ పరీక్షల్లో 83.4% శాతం పాసైనట్లు అధికారులు ప్రకటించారు. మొత్తం 13 లక్షల మంది సీబీబీఎస్ఈ పన్నెండో తరగతి పరీక్షలు రాశారు. 10, 12 తరగతులకు మొత్తం 31,14,821 మంది నమోదు చేసుకున్నారు. ఐతే మే నెల మూడో వారంలో ఫలితాలు విడుదల చేస్తామని ముందుగా ప్రకటించినా... కొన్ని కారణాల వల్ల ముందే విడుదల చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన హన్సికా శుక్లా, అదే రాష్ట్రంలోని ముజఫర్‌నగర్‌కు చెందిన కరీష్మా అరోరా 499/500 మార్కులతో ఆ ఫలితాల్లో మొదటి స్థానంలో నిలిచారు.
CBSE 10th రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి :
Step 1 : అధికారిక వెబ్ సైట్లు cbseresults.nic.in లేదా cbse.nic.in లోకి వెళ్లండి.
Step 2: హోం పేజీలో Class 10 Result 2019 పై క్లిక్ చెయ్యండి.
Step 3: మీ రిజిస్ట్రేషన్ నంబర్ లేదా రోల్ నంబర్ ఇవ్వండి. అడ్మిట్ కార్డ్ వివరాలు సంబంధింత ఫీల్డులలో నింపండి. సబ్మిట్ క్లిక్ చెయ్యండి.
Step 4: మీ రిజల్ట్స్ స్క్రీన్‌పై కనిపించాక, వాటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా ప్రింటవుట్ తీసుకోవచ్చు.
గతేడాది CBSE టెన్త్ రిజల్ట్స్‌లో 86.70 శాతం మంది పాస్ అయ్యారు. ఈ ఏడాది ఆ పర్సెంటేజీ పెరిగితే ఆనందమే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.