ప.బంగలో రాజ్యాంగ సంక్షోభం...దీదీ వైఖరిపై రాజ్‌నాథ్ నిప్పులు

కేంద్రానికి వ్యతిరేకంగా తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు పదే పదే ఆందోళనలు చేయడంతో..స్పీకర్ సభను నిర్వహించలేకపోయారు. ఈ నేపథ్యంలో ఉభయ సభలను మంగళవారానికి వాయిదా వేశారు. అటు పశ్చిమ బంగ పోలీసుల వైఖరిపై సుప్రీంకోర్టులో సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌పైనా మంగళవారమే విచారణ జరగనుంది.

news18-telugu
Updated: February 4, 2019, 2:58 PM IST
ప.బంగలో రాజ్యాంగ సంక్షోభం...దీదీ వైఖరిపై రాజ్‌నాథ్ నిప్పులు
రాజ్‌నాథ్ సింగ్
  • Share this:
పశ్చిమ బంగలో సీబీఐ వర్సెస్ మమతా వ్యవహారం దేశరాజకీయాలను కుదిపేస్తోంది. ఆదివారం కోల్‌కతాలో జరిగిన పరిణామాలపై పార్లమెంట్ సభలు దద్ధరిల్లాయి. కేంద్రానికి వ్యతిరేకంగా టీఎంసీ ఎంపీలు ఆందోళనలు చేశారు. మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. గందరగోళం మధ్యే సభలో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రసంగించారు. పశ్చిమ బంగలో జరుగుతున్న పరిణామాలపై ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. సీబీఐ తన పని తాను చేయకుండా అడ్డుకుంటున్నారని.. దీదీ హయంలో రాజ్యాంగ సంక్షోభం నెలకొనే పరిస్థితులు తలెత్తాయని విరుచుకుపడ్డారు.

పశ్చిమ బంగలో రాజ్యాంగ సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదు. సీబీఐ తన విధులు తాను నిర్వర్తించకుండా అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఇలాంటి పరిణామాల వల్ల సమాఖ్య స్ఫూర్తికి ముప్పు వాటిల్లుతుంది. ఏ రాష్ట్రంలోనైనా సాధారణ పరిస్థితులను తీసుకొచ్చేందుకు కేంద్రానికి అన్ని అధికారాలను రాజ్యాంగ కల్పించింది.
రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర హోంమంత్రి


శార‌దా చిట్‌ఫండ్ స్కామ్ విచారణను సీబీఐ అధికారులు వేగవంతం చేశారు. ఈ క్రమంలో ఆదివారం కోల్‌క‌తా పోలీసు క‌మిష‌న‌ర్ రాజీవ్ కుమార్‌ను విచారించేందుకు వెళ్లారు. ఐతే పశ్చిమ బెంగ పోలీసులు వారిని అడ్డుకొని అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా కోల్‌కత కమిషనరేట్ ఆఫీసు ముందు హైడ్రామా చోటు చేసుకుంది. పోలీసులు, సీబీఐ అధికారుల మధ్య వాగ్వాదం జరిగింది. ఇప్పటికే, కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐని రాష్ట్రంలోకి రానివ్వకుండా తృణముల్ కాంగ్రెస్ ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ నేపథ్యంలో కోల్‌కతా కమిషనరేట్ ఆఫీసుకు వచ్చిన సీబీఐ అధికారులను.. పోలీసులు నిర్బంధించారు. నగరంలోని సీబీఐ కార్యాలయాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. కొద్దిసేపటి తర్వాత విడిచిపెట్టారు.

మొత్తంగా సీబీఐ వర్సెస్ దీదీ అన్నట్లుగా పరిస్థితులు నెలకొన్నాయి. సోమవారం ఇదే అంశంపై పార్లమెంట్ ఉభయ సభలు దద్ధరిల్లాయి. కేంద్రానికి వ్యతిరేకంగా తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు పదే పదే ఆందోళనలు చేయడంతో..స్పీకర్ సభను నిర్వహించలేకపోయారు. ఈ నేపథ్యంలో ఉభయ సభలను మంగళవారానికి వాయిదా వేశారు. అటు పశ్చిమ బంగ పోలీసుల వైఖరిపై సుప్రీంకోర్టులో సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌పైనా మంగళవారమే విచారణ జరగనుంది.
First published: February 4, 2019, 2:53 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading