news18-telugu
Updated: November 16, 2018, 4:51 PM IST
జీవిఎల్ నరసింహారావు (ఫైల్ ఫొటో)
ప్రభుత్వ అనుమతి లేనిదే ఏపీలోకి సీబీఐ అడుగుపెట్టకూడదన్న జీవోపై దుమారం రేగుతోంది. చంద్రబాబు నిర్ణయాన్ని పశ్చిమ బెంగాల్ సీఎం సమర్థించం సంచలన రేపుతోంది. ఈ క్రమంలో మిగతా రాష్ట్రాలు కూడా ఇదే దారిలో వెళ్తాయా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అటు చంద్రబాబు వైఖరిపై బీజేపీ నిప్పులు చెరిగింది. అవినీతి నుంచి బయటపడేందుకే సీబీఐపై చంద్రబాబు ఆంక్షలు విధించారని రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు మండిపడ్డారు. బీజేపీ వ్యతిరేక కూటమి ఉద్దేశం కూడా ఇదేనని..సీబీఐని బలహీనపరచి అవీనీతి నుంచి కాపాడుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ధ్వజమెత్తారు.

ఎన్నికల సమీస్తుండడంతో చంద్రబాబులో ఆందోళన ఎక్కువైంది. అనివినీతి నుంచి కాపాడేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా చంద్రబాబును వెనకేసుకొస్తున్నారు. విపక్ష కూటమిలోని చాలా పార్టీలు అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. నిజానికి వాళ్ల లక్ష్యమే అది. అవినీతిని సహించే ప్రసక్తే లేదు.
— జీవీఎల్ నరసింహారావు, బీజేపీ రాజ్యసభ సభ్యుడు
ఇవి కూడా చదవండి
Published by:
Shiva Kumar Addula
First published:
November 16, 2018, 4:49 PM IST