Home /News /national /

CBI RAIDS RESIDENCE OF DELHI DEPUTY CM MANISH SISODIA PVN

Breaking : ఆప్ కు బిగ్ ఝలక్..ఢిల్లీ డిప్యూటీ సీఎం ఇంట్లో సీబీఐ సోదాలు

మనీష్ సిసోడియా(ఫైల్ ఫొటో)

మనీష్ సిసోడియా(ఫైల్ ఫొటో)

CBI raids : ఆమ్ ఆద్మీ పార్టీ(AAP) నేత,  ఢిల్లీ డిప్యూటీ సీఎం ఇంట్లో శుక్రవారం ఉదయం సీబీఐ(CBI) దాడులు చేసింది. గత కొద్ది రోజులుగా ఉచిత పథకాల విషయంలో ఆప్ అధినేత అర్వింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal)-కేంద్ర ప్రభుత్వం మధ్య మాటల యుద్ధం నడుస్తున్న విషయం తెలిసిందే

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
CBI raids : ఆమ్ ఆద్మీ పార్టీ(AAP) నేత,  ఢిల్లీ డిప్యూటీ సీఎం ఇంట్లో శుక్రవారం ఉదయం సీబీఐ(CBI) దాడులు చేసింది. గత కొద్ది రోజులుగా ఉచిత పథకాల విషయంలో ఆప్ అధినేత అర్వింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal)-కేంద్ర ప్రభుత్వం మధ్య మాటల యుద్ధం నడుస్తున్న విషయం తెలిసిందే. కేజ్రీవాల్ నేరుగా ప్రధానిని టార్గెట్ చేస్తూ విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా (Manish Sisodia)ఇంట్లో సీబీఐ దాడులు జరిగాయి.

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై...ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా నివాసం, ఢిల్లీ మాజీ ఎక్సైజ్ కమిషనర్ అరవ గోపీ కృష్ణ నివాసాలతో సహా ఢిల్లీ-ఎన్‌సీఆర్‌(Delhi-NCR)లోని 21 ప్రాంతాల్లో ఈ ఉదయం కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI)సోదాలు నిర్వహించింది.

సీబీఐ దాడులపై మనీష్‌ సిసోడియా ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.." నా ఇంట్లో సోదాలు కొనసాగుతున్నాయి. నేను సీబీఐ అధికారులకు సహాకరిస్తాను. అధికారులు నాకు వ్యతిరేకంగా ఎలాంటి పత్రాలను స్వాధీనం చేసుకోలేరు. దేశంలో మంచి చేసే వారిని ఇలా వేధింపులకు గురిచేయడం దురదుష్టకరం. విద్యా రంగంలో నేను చేస్తున్న పనిని ఎవరూ ఆపలేరు. నిజం బయటకు వస్తుంది"అని తెలిపారు.



US Trip: అమెరికా ట్రిప్‌కు ప్లాన్ చేస్తున్నారా? ఇప్పట్లో సాధ్యం కాదు.. 500 రోజులు ఆగాల్సిందే

మనీష్ సిసోడియా నివాసంపై సీబీఐ దాడి నేపథ్యంలో ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్ ఓ ట్వీట్ లో..."సీబీఐకి స్వాగతం. మేము పూర్తి సహకారం అందిస్తాము. గతంలో కూడా సోదాలు/దాడులు జరిగాయి, కానీ ఏమీ కనుగొనబడలేదు. ఇప్పుడు కూడా ఏమీ కనుగొనబడలేదు"అని పేర్కొన్నారు.

కేజ్రీవాల్​ ప్రభుత్వం గతేడాది నవంబర్​లో తీసుకొచ్చిన ఎక్సైజ్​ పాలసీ-2022(నూతన మద్యం విధానం) నిబంధనలకు విరుద్ధంగా ఉందనే ఆరోపణల నేపథ్యంలో దీనిపై దర్యాప్తు చేపట్టాలని ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా కొద్దిరోజుల కింద సీబీఐకి సిఫార్సు చేశారు. నూతన మద్యం విధానంలో జరిగిన నియమాల ఉల్లంఘనతో పాటు విధానపరమైన లోపాలపై దర్యాప్తు చేపట్టాలని సూచించారు. మద్యం విధానంపై చీఫ్‌ సెక్రటరీ దాఖలు చేసిన నివేదికను చూస్తే జీఎన్‌సీటీడీ యాక్ట్‌ 1991, ట్రాన్సాక్షన్‌ ఆఫ్‌ బిజినెస్‌ రూల్స్‌, దిల్లీ ఎక్సైజ్‌ యాక్ట్‌-2009తోపాటు దిల్లీ ఎక్సైజ్‌ రూల్స్‌-2010ల నియమాలు ఉల్లంఘించినట్లు ప్రాథమికంగా తెలుస్తోందని గవర్నర్ తెలిపారు. వీటితోపాటు టెండర్ల తర్వాత లైసెన్సుదారులకు ప్రయోజనం చేకూర్చేలా ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వం విధానపరమైన లోపాలకు పాల్పడినట్లు కనిపిస్తోందన్నారు. ఈ వ్యవహారంలో ఎక్సైజ్‌ శాఖకు ఇన్‌ఛార్జ్‌గా ఉన్న మనీశ్‌ సిసోడియా పాత్రనూ అందులో ప్రస్తావించారు.ఎల్​జీ సీబీఐ విచారణకు ఆదేశించిన నేపథ్యంలో గత నెలలో నూతన మద్యం విధానాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు కేజ్రీవాల్ ప్రభుత్వం ప్రకటించింది. మరో ఆరు నెలల పాటు పాత మధ్యం విధానాన్నే కొనసాగించనున్నట్లు పేర్కొంది.
Published by:Venkaiah Naidu
First published:

Tags: AAP, CBI, Delhi

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు