హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

CBI Raids: కన్నడ కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్‌కి షాక్... అవినీతి కేసులో సీబీఐ దాడులు

CBI Raids: కన్నడ కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్‌కి షాక్... అవినీతి కేసులో సీబీఐ దాడులు

CBI Raids: కన్నడ కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్‌కి షాక్... అవినీతి కేసులో సీబీఐ దాడులు

CBI Raids: కన్నడ కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్‌కి షాక్... అవినీతి కేసులో సీబీఐ దాడులు

CBI Raids Congress's DK Shivakumar's Premises: సీబీఐ దాడులు చేస్తుందని శివకుమార్‌తోపాటూ... కన్నడ కాంగ్రెస్ నేతలెవరూ ఊహించలేదు. అసలేంటి ఆరోపణల కేసు?

CBI Raids DK Shivakumar's Premises: కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్‌కి ఉదయాన్నే షాక్ ఇచచారు సీబీఐ అధికారులు. ఆయనపై ఉన్న అవినీతి ఆరోపణల కేసులో... ఒకేసారి కర్ణాటక, ముంబై, ఢిల్లో దాడులు చేసారు. మొత్తం 14 లొకేషన్లలో ఈ సోదాలు జరుగుతున్నాయి. తాము ఉప ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ... రాజకీయంగా దెబ్బ కొట్టడానికి జరుగుతున్న కుట్ర ఇది అని కాంగ్రెస్ ఆరోపించింది. విదేశాలకు అక్రమంగా డబ్బు తరలింపు కేసులో... కొన్ని కీలక ఆధారాల్ని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED)... సీబీఐకి అప్పగించింది. దాంతో... సీబీఐ... అవినీతి కేసు రాసింది. "ఆదాయానికి మించిన ఆస్తులకు సంబంధించి... అప్పటి కర్ణాటక ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న డీకే శివకుమార్ పై సీబీఐ కేసు నమోదు చేసింది. కర్ణాటకలో 9 చోట్లతోపాటూ... మొత్తం 14 చోట్ల సోదాలు జరుగుతున్నాయి. ఢిల్లీలో నాలుగు చోట్ల, ముంబైలో ఒక చోట ఇవి జరుగుతున్నాయి" అని సీబీఐ అధికారులు ఓ స్టేట్‌మెంట్ రిలీజ్ చేశారు.


గతేడాది మనీ లాండరింగ్ కేసులో... నాలుగు రోజులు ప్రశ్నించాక... 58 ఏళ్ల శివకుమార్‌ను ఈడీ అరెస్టు చేసింది. 8.6 కోట్ల డబ్బుకి సంబంధించి ఆధారాల్ని చూపించలేకపోయారు శివకుమార్. ఆ డబ్బు అక్రమంగా పొందినట్లు ఈడీ గుర్తించింది. మరింత దర్యాప్తు తర్వాత... మొత్తం రూ.11 కోట్ల లెక్క తేలింది. ఆ డబ్బును విదేశాలకు అక్రమంగా తరలించినట్లు తేలడంతో... ఈడీ కేసు రాసింది. ఈ దర్యాప్తుకి సంబంధించిన వివరాల్ని సీబీఐకి అందించింది. శివకుమార్‌పై సీబీఐ కేసు రాయడం ఇదే తొలిసారి.

ఢిల్లీ, మహారాష్ట్రలో సీబీఐ బృందాలు ఉదయం 6.30 నుంచే సోదాలు ప్రారంభించాయి. శివకుమార్ ఇంటితోపాటూ... ఆయన కుటుంబ సభ్యులు, సంబంధీకుల ఇళ్లలోనూ సోదాలు చేస్తున్నారు. దీనిపై కర్ణాటక మాజీ చీఫ్ సిద్ధరామయ్య ట్వీట్ చేశారు. ప్రజలను తప్పు దారి పట్టించేందుకు బీజేపీ ఇలాంటి స్వార్థపూరిత రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శించారు.

నవంబర్ 3న కర్ణాటకలో బైపోల్స్ జరగనున్నాయి. ఈ సమయంలో సీబీఐ దాడులు చెయ్యడంతో... కాంగ్రెస్ నేత రణదీప్ సుర్జేవాలా ఫైర్ అయ్యారు. సీబీఐని కీలుబొమ్మగా మార్చారని ట్వీట్ చేశారు.

సీబీఐ దాడుల్లో ఏం తేలుతుందో అన్నది కాంగ్రెస్ శ్రేణులకు టెన్షన్ తెప్పిస్తోంది. సీబీఐ గనక... మరిన్ని అక్రమాస్తుల్ని గుర్తిస్తే... ఉప ఎన్నికలపై కచ్చితంగా ప్రభావం పడగలదు. అసలే అధికారాన్ని కోల్పోయిన కాంగ్రెస్‌కి అది మరింత ఇబ్బందిగా మారగలదని విశ్లేషకులు చెబుతున్నారు.

First published:

Tags: Dk shivakumar, Karnataka

ఉత్తమ కథలు