బీహార్‌లోని వసతి గృహాల్లో బాలికలపై అత్యాచారం కేసు అంశంపై ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌పై విచారణకు ఆదేశించింది ప్రత్యేక కోర్టు. బీహార్ సీఎం నితీష్ కుమార్‌తో పాటు ముజఫర్‌పూర్ జిల్లా మేజిస్ట్రేట్ ధర్మేంద్ర సింగ్, సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అతుల్ ప్రసాద్‌పై కూడా విచారణ జరపాలని ఆదేశాలు జారీచేసింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను గడువులోగా ఇవ్వనందుకు ఆగ్రహించిన సుప్రీంకోర్టు... కేసును ఢిల్లీలోని సాకేత్ కోర్టుకు బదిలీ చేసింది. రెండు వారాల్లో ఈ కేసు విచారణను ఆరు నెలల్లో పూర్తి చేయాలని సాకేత్ కోర్టును ఆదేశించింది.
ఈ కేసు విచారణ చేపట్టిన అధికారిని సీబీఐ బదిలీ చేయడంపై కూడా సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇది కోర్టు ఆదేశాల ధిక్కరణ కిందకు వస్తుందని పేర్కొంది. దీనిపై అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. రాష్ట్రం ప్రభుత్వంపై నమ్మకం లేదని వ్యాఖ్యానించిన ప్రధాన న్యాయమూర్తి గొగొయ్... పిల్లలను ఈ రకంగా చూడకూడదని అన్నారు.
బీహార్‌లోని సంక్షేమ వసతి గృహాల్లో బాలికలపై జరుగుతున్న లైంగిక, మానసిక దాడులపై నమోదైన కేసులను గత ఏడాది నవంబర్‌లో సీబీఐకు అప్పగించింది సుప్రీంకోర్టు. దీనిపై జనవరి 31న రిపోర్టు ఇవ్వాలని ఆదేశించింది. ముజఫర్‌పూర్ వసతి గృహం కేసును ప్రస్తుతం సీబీఐ దర్యాప్తు చేస్తోంది. కేసు దర్యాప్తును 6 నెలల్లో పూర్తి చేయాలని... ఎలాంటి గడువు పొడిగింపు ఉండదని అన్నారు. ఒకవేళ దీనిపై రాష్ట్రం తరపున వాదిస్తున్న న్యాయవాది స్పందించపోతే... బీహార్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సమన్లు జారీ చేస్తామని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bihar, CBI, Nitish Kumar, Supreme Court