హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Delhi Excise Policy scam: మనీశ్ సిసోడియాకు మరో బిగ్ షాక్.. లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం..

Delhi Excise Policy scam: మనీశ్ సిసోడియాకు మరో బిగ్ షాక్.. లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం..

మనీష్ సిసోడియా(ఫైల్ ఫొటో)

మనీష్ సిసోడియా(ఫైల్ ఫొటో)

Delhi Excise Policy scam: సిబిఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌‌లో  మొత్తం 15 మంది నిందితులు ఉండగా.. అందులో  సిసోడియా A-1గా ఉన్నారు.  11 పేజీల ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న నేరాలలో అవినీతి, నేరపూరిత కుట్ర, బ్యాంకు ఖాతాల ఫోర్జరీ ఆరోపణలు ఉన్నాయి

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  ఢిల్లీ (News Delhi)ని కుదిపేస్తున్న ఎక్సైజ్ పాలిసీ స్కామ్ (Delhi Excise Policy scam) కేసులో  కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా (Manish Sisodia)కు మరో బిగ్ షాక్ తగిలింది. మనీశ్ సిసోడియా సహా  మొత్తం 15 మంది నిందితులకు లుక్ ఔట్ నోటీసులు (Look Out Circular) జారీ చేసింది. దేశం విడిచి వెళ్లకూడదని స్పష్టం చేసింది.

  లుక్ ఔట్ నోటీసులపై మనీశ్ సిసోడియా స్పందించారు. ''సీబీఐ సోదాల్లో ఏమీ దొరకలేదు. ఒక్కపైసా కూడా స్వాధీనం చేసుకోలేదు. ఇప్పుడేమో లుక్ ఔట్ నోటీసులు జారీ చేశారు. ఏంటి మోదీజీ  ఈ జిమ్మిక్కు? నేను ఢిల్లీలో స్వచ్ఛగా తిరుగుతున్నాను. ఒక్కడికి రావాలో చెప్పండి. నేను వస్తాను.'' అని ట్వీట్ చేశారు.

  మద్యం పాలసీలో అవినీతి ఆరోపణలపై శుక్రవారం మనీష్ సిసోడియా నివాసంతో పాటు మరో 31 చోట్ల సీబీఐ దాడులు చేసిన విషయం తెలిసిందే. ఢిల్లీ డిప్యూటీ సీఎంగా ఉన్న ఆయన విద్యాశాఖతో పాటు ఎక్సైజ్ శాఖను కూడా నిర్వహిస్తున్నారు. ఐతే మద్యం పాలసీ రూపకల్పన సమయంలో భారీగా అవకతవకలు జరిగాయని ఫిర్యాదులు అందడంతో సీబీఐ సోదాలు చేసి.. పలు కీలక ఆధారాలను సేకరించింది.  ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసి.. మనీశ్ సిసోడియాను నిందితుడిగా పేర్కొంది.

  OMG: పొటేత్తిన భారీ వరద.. 22 మంది దుర్మరణం.. మరో 5 గురు చూస్తుండగా

  ఈ కేసులో సిబిఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌‌లో  మొత్తం 15 మంది నిందితులు ఉండగా.. అందులో  సిసోడియా A-1గా ఉన్నారు.  11 పేజీల ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న నేరాలలో అవినీతి, నేరపూరిత కుట్ర, బ్యాంకు ఖాతాల ఫోర్జరీ ఆరోపణలు ఉన్నాయి. ఐతే సీబీఐ ఆరోపణలను మనీశ్ సిసోడియాతో పాటు ఢిల్లీ ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తోంది. మనీశ్ సిసోడియా మంచి పనులు చేసి ప్రజలకు దగ్గరవడాన్ని బీజేపీ జీర్ణించుకోలేకపోతోందని.. ఈ క్రమంలోనే సీబీఐని వాడి.. తప్పుడు కేసులు పెడుతోందని ఆమాద్మీ పార్టీ మండిపడుతోంది.

  కాగా, గతేడాది నవంబరులో అర్వింద్ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) ప్రభుత్వం కొత్త మద్యం పాలసీని ప్రకటించింది.ఐతే అందులో అనేక అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే మద్యం పాలిసీపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని స్పందించిన ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా ఆదేశించారు. ఎక్సైజ్ నిబంధనల ఉల్లంఘనతో పాటు విధానపరమైన లోపాలున్నాయని సీఎస్ తన నివేదికలో పేర్కొన్నారు. టెండర్ల విధానంలో కొందరికి ప్రయోజనం కలిగేలా నిర్ణయాలు తీసుకున్నారని చెప్పారు. ఎక్సైజ్‌శాఖకు మంత్రి మనీశ్‌ సిసోడియా పాత్రను కూడా ప్రస్తావించారు. సీఎస్ నివేదిక ఆధారంగా.. కొత్త మద్యం పాలసీలో జరిగిన ఉల్లంఘనలపై విచారణ జరపాలని ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా సీబీఐకి సిఫారు చేశారు. ఈక్రమంలోనే సీబీఐ రంగంలోకి దిగి కేసును దర్యాప్తు చేస్తోంది.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: CBI, Liquor policy, New Delhi

  ఉత్తమ కథలు