సీబీఐ అప్ డేట్ : ఆలోక్ వర్మ ఆదేశాలు రద్దు చేసిన నాగేశ్వరరావు

సీబీఐ డైరెక్టర్‌గా ఆలోక్ వర్మ జారీ చేసిన ట్రాన్స్‌ఫర్లను కొత్తగా బాధ్యతలు చేపట్టిన తాత్కాలిక చీఫ్ ఎం. నాగేశ్వరరావు రద్దు చేశారు.

news18-telugu
Updated: January 11, 2019, 3:15 PM IST
సీబీఐ అప్ డేట్ : ఆలోక్ వర్మ ఆదేశాలు రద్దు చేసిన నాగేశ్వరరావు
మన్నెం నాగేశ్వరరావు
news18-telugu
Updated: January 11, 2019, 3:15 PM IST
సీబీఐలో వివాదం మరింత రసవత్తరంగా మారింది. సీబీఐ డైరెక్టర్‌గా ఆలోక్ వర్మ జారీ చేసిన ఆదేశాలను రద్దు చేస్తూ తాత్కాలిక సీబీఐ డైరెక్టర్ ఎం. నాగేశ్వరరావు కొత్త ఆదేశాలు ఇచ్చారు. ఆలోక్ వర్మ స్థానంలో తాత్కాలిక చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన ఆయన ఈ మేరకు ఆర్డర్స్ ఇచ్చారు. సీబీఐలో ఆలోక్ వర్మ, రాకేష్ ఆస్థానా మధ్య వివాదం చెలరేగినప్పుడు ఆలోక్ వర్మ, రాకేష్ ఆస్థానాను కేంద్ర ప్రభుత్వం లాంగ్ లీవ్ మీద పంపింది. అప్పుడు తాత్కాలిక చీఫ్‌గా ఎం.నాగేశ్వరరావును నియమించింది. ఈ సందర్భంగా నాగేశ్వరరావు కొంతమంది ఉద్యోగులను ట్రాన్స్‌ఫర్ చేశారు. అయితే, సుప్రీంకోర్టు తీర్పు తర్వాత మళ్లీ సీబీఐ డైరెక్టర్‌గా ఆలోక్ వర్మ పగ్గాలు చేపట్టినప్పుడు, అంతకు ముందు నాగేశ్వరరావు జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేసి.. ఆయన ట్రాన్స్‌ఫర్  చేసిన వారికి మళ్లీ పాత పోస్టింగ్‌లు ఇచ్చారు. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని హైపవర్ కమిటీ 2-1 తేడాతో ఆలోక్ వర్మ మీద వేటు వేసింది. ఆయన స్థానంలో మళ్లీ సీబీఐ బాస్‌గా నాగేశ్వరరావును నియమించింది. కొత్తగా పగ్గాలు చేసిన నాగేశ్వరరావు.. మళ్లీ ఆలోక్ వర్మ ఆదేశాలను రద్దు చేశారు.

సీబీఐ, రాకేశ్ ఆస్తానా, అలోక్ వర్మ, కేంద్రం, సీవీసీ, సుప్రీంకోర్టు తీర్పు, సీబీఐ వర్సెస్ సీబీఐ, cbi feud, new delhi, news from india, latest news today, online news, breaking news today, india news, national news, latest world news, arun jaitley, bribery case, devender kumar, sukirti dwivedi, quint videos, ndtv, ndtv 24x7, urdu, urdu news, urdu news hyderabad, saudi news, news latest, news tv, news18 urdu, kashmir news, news18 kashmir, news in india, political news, supreme court hearing over alok verma petition, aajtak channel news, rakesh asthana, rakesh asthana cbi, cbi special director rakesh asthana, cbi rakesh asthana, special director rakesh asthana, rakesh asthana news, rakesh asthana case, rakesh asthana cbi case, cbi alok verma, rakesh asthana cbi director, cbi case against rakesh asthana, asthana, cbi vs cbi, rakesh asthana fir, ips rakesh asthana, rakesh asthana ips, rakesh asthaana, cbi director, rakesh asthana video, who is rakesh asthana,
ఆలోక్ వర్మ (ఫైల్ ఫొటో)


సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఈనెల 9న సీబీఐ డైరెక్టర్‌గా పగ్గాలు చేపట్టిన వెంటనే ఆలోక్ వర్మ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. స్పెషల్ సీబీఐ డైరెక్టర్ రాకేష్ ఆస్థానా మీద జరుగుతున్న సీబీఐ విచారణను మళ్లీ ప్రారంభించారు. సీబీఐ డీఐజీ తరుణ్ గబ్బాకి ఆ బాధ్యతలు అప్పగించారు. మురుగేశన్ అనే మరో ఉన్నతాధికారి ఈ కేసును సూపర్ వైజ్ చేయాలని సూచించారు. అజయ్ భట్నాగర్, ఏకే శర్మ, ఎంకే సిన్హా అనే ముగ్గురు అధికారులు ఆలోక్ వర్మ సీబీఐ చీఫ్‌గా ఉన్నప్పుడు రాకేష్ ఆస్థానా కేసును విచారించేవారు. వర్మ లీవ్‌లో ఉన్నప్పుడు వారిని ట్రాన్స్‌ఫర్ చేశారు.

రాకేశ్ ఆస్తానా, అలోక్ వర్మ
ఆలోక్ వర్మను సీబీఐ డైరెక్టర్ పదవి నుంచి తప్పించిన హై పవర్ కమిటీ ఆయన్ను ఫైర్ సర్వీసెస్, హోంగార్డ్స్ డీజీగా నియమించింది. అయితే, ఆయన బాధ్యతలు తీసుకోవడానికి నిరాకరించారు.

CBI Joint Director Who Was Probing Corruption Cases Against Rakesh Asthana Shifted
సీబీఐ వివాదంపై న్యూస్ 18 క్రియేటివ్

First published: January 11, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...