Alok Verma Resign : సీబీఐ మాజీ డైరెక్టర్ ఆలోక్ వర్మ సంచలన నిర్ణయం

Alok Verma Resign : సీబీఐ మాజీ డైరెక్టర్ ఆలోక్ వర్మ రాజీనామా చేశారు. అగ్నిమాపక శాఖ, హోంగార్డ్స్ విభాగం డీజీ బాధ్యతలు చేపట్టడానికి నిరాకరించిన ఆయన తన ఉద్యోగానికి రాజీనామా చేశారు.

news18-telugu
Updated: January 11, 2019, 4:25 PM IST
Alok Verma Resign : సీబీఐ మాజీ డైరెక్టర్ ఆలోక్ వర్మ సంచలన నిర్ణయం
ఆలోక్ వర్మ (ఫైల్ ఫొటో)
news18-telugu
Updated: January 11, 2019, 4:25 PM IST
సీబీఐ మాజీ డైరెక్టర్ ఆలోక్ వర్మ రాజీనామా చేశారు. ఆయన్ను సీబీఐ డైరెక్టర్ పదవి నుంచి తప్పించిన హై పవర్ కమిటీ.. ఆ స్థానంలో తాత్కాలిక చీఫ్‌గా ఎం.నాగేశ్వరరావును నియమించింది. ఆలోక్ వర్మను అగ్నిమాపక శాఖ, హోంగార్డుల విభాగం డైరెక్టర్ జనరల్‌గా బదిలీ చేసింది. అయితే, ఆ బాధ్యతలు చేపట్టేందుకు ఆలోక్ వర్మ తిరస్కరించారు. తన ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేశారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ సెక్రటరీ చంద్రమౌళికి తన రాజీనామా లేఖను సమర్పించారు ఆలోక్ వర్మ. నాలుగు దశాబ్దాలుగా సర్వీస్ చేస్తున్నానని, తన మీద ఎలాంటి మరక లేదని చెప్పారు. ఇన్నాళ్లపాటు  సేవచేసే అవకాశం కల్పించిన ఇండియన్ పోలీస్ సర్వీసెస్‌కి కృతజ్ఞతలు తెలిపారు. సీబీఐ డైరెక్టర్ కంటే తక్కువ స్థాయి పోస్టుకు బదిలీ చేశారని, ట్రాన్స్‌ఫర్ చేసేముందు కనీసం తన వాదనను వినిపించుకున అవకాశం కూడా ఇవ్వలేదన్నారు.

2017న జూలై 31న నుంచి 2019 జనవరి 31 వరకు సీబీఐ డైరెక్టర్‌గా నన్ను నియమించారు. అంటే, అగ్నిమాపక శాఖ - హోంగార్డ్స్ డీజీ‌ వయసు దాటింది. చీఫ్ విజిలెన్స్ కమిషన్ ఇచ్చిన నివేదికను ఆధారంగా చేసుకుని నన్ను బదిలీ చేశారు. అయితే, సీబీఐ విచారణ జరుపుతున్న వ్యక్తి (పరోక్షంగా రాకేష్ ఆస్థానా) ఇచ్చిన సమాచారం ఆధారంగానే సీవీసీ నివేదికను రూపొందించింది. నన్ను బదిలీ చేసే ముందు కనీసం నా వాదన వినలేదు. సహజ న్యాయసూత్రాన్ని విస్మరించారు.
రాజీనామా లేఖలో ఆలోక్ వర్మ


సీబీఐ వర్సెస్ సీబీఐ వివాదంలో ముఖ్య ఘట్టాలు



2018 అక్టోబర్ 23న సీబీఐ డైరెక్టర్ ఆలోక్ వర్మ, సీబీఐ స్పెషల్ డైరెక్టర్ రాకేష్ ఆస్థానా పరస్పరం అవినీతి ఆరోపణలు చేసుకున్నారు. దీంతో ఇద్దరినీ లీవ్ మీద పంపిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణకు చెందిన ఎం. నాగేశ్వరరావును తాత్కాలిక సీబీఐ చీఫ్‌గా నియమించింది.

2018 అక్టోబర్ 24. తనను లాంగ్ లీవ్ మీద పంపించడాన్ని సవాల్ చేస్తూ ఆలోక్ వర్మ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

2018 అక్టోబర్ 26. ఆలోక్ వర్మ తొలగింపు మీద విచారణ జరపాలంటూ చీఫ్ విజిలెన్స్ కమిషన్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది.
Loading...
ఆలోక్ వర్మ రాజీనామా లేఖ


2018 నవంబర్ 12. సీబీఐ వివాదంపై దర్యాప్తు జరిపిన సీవీసీ తమ ప్రాధమిక నివేదకను సుప్రీంకోర్టుకు అందజేసింది.

2018 డిసెంబర్ 5. ఆలోక్ వర్మ, రాకేష్ ఆస్థానా పిల్లుల్లా కొట్లాడుకుంటూ సీబీఐ పరువు తీస్తున్నారంటూ అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ సుప్రీంకోర్టులో అన్నారు.

2018 డిసెంబర్ 6. ఆలోక్ వర్మతో పాటు ఆయనను లాంగ్ లీవ్‌లో పంపించడం మీద మరో ఎన్జీవో దాఖలు చేసిన పిటిషన్ల మీద తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్ చేసింది.

సీబీఐ, రాకేశ్ ఆస్తానా, అలోక్ వర్మ, కేంద్రం, సీవీసీ, సుప్రీంకోర్టు తీర్పు, సీబీఐ వర్సెస్ సీబీఐ, cbi feud, new delhi, news from india, latest news today, online news, breaking news today, india news, national news, latest world news, arun jaitley, bribery case, devender kumar, sukirti dwivedi, quint videos, ndtv, ndtv 24x7, urdu, urdu news, urdu news hyderabad, saudi news, news latest, news tv, news18 urdu, kashmir news, news18 kashmir, news in india, political news, supreme court hearing over alok verma petition, aajtak channel news, rakesh asthana, rakesh asthana cbi, cbi special director rakesh asthana, cbi rakesh asthana, special director rakesh asthana, rakesh asthana news, rakesh asthana case, rakesh asthana cbi case, cbi alok verma, rakesh asthana cbi director, cbi case against rakesh asthana, asthana, cbi vs cbi, rakesh asthana fir, ips rakesh asthana, rakesh asthana ips, rakesh asthaana, cbi director, rakesh asthana video, who is rakesh asthana,
న్యూస్18 క్రియేటివ్


2019 జనవరి 8. ఆలోక్ వర్మకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పుచెప్పింది. అయితే, దీనిపై నిర్ణయం తీసుకోవడానికి ప్రధానమంత్రి, ప్రతిపక్ష నేత, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌తో కూడిన హైపవర్ కమిటీని నియమించింది. ఆ కమిటీ వారంలో నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది.

2019 జనవరి 9. చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ తన స్థానంలో సీనియర్ జడ్జి జస్టిస్ ఏకే సిక్రీని నియమించారు.

2019 జనవరి 10. ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని హైపవర్ కమిటీలో 2-1 మెజారిటీతో ఆలోక్ వర్మను సీబీఐ చీఫ్‌గా మరోసారి తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఫైర్ సర్వీసెస్, సివిల్ డిఫెఎన్స్, హోమ్ గార్డ్స్‌కు డైరెక్టర్ జనరల్‌గా బదిలీ చేసింది. ఆయన స్థానంలో ఎం.నాగేశ్వరరావును మళ్లీ సీబీఐ చీఫ్‌గా నియమించింది. ఆలోక్ వర్మను తొలగించాలన్న ప్రతిపాదనను మల్లికార్జున ఖర్గే వ్యతిరేకించారు.

M Nageswara Rao, the interim CBI Director, has been promoted to the rank of Additional Director by the Appointments Committee of the Cabinet
మన్నెం నాగేశ్వరరావు


2019 జనవరి 11. కొత్త బాధ్యతలు స్వీకరించేందుకు ఆలోక్ వర్మ నిరాకరించారు. తన ఉద్యోగానికి రాజీనాామా చేశారు.

2019 జనవరి 31. ఆలోక్ వర్మ పదవీ విరమణ చేయాల్సిన రోజు. అయితే, ఆయన 20 రోజుల ముందే తన ఉద్యోగానికి రాజీనామా చేశారు.

ఇవి కూడా చదవండి
First published: January 11, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...