ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం అరెస్ట్‌కు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. చిదంబరానికి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించిన నేపథ్యంలో ఆయన నివాసానికి సీబీఐ, ఈడీ అధికారులు వెళ్లారు. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో వారు తిరిగి వెళ్లిపోయారు. కాగా, మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ కాకుండా ఉండేందుకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని చిదంబరం ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు జడ్జి జస్టిస్ సునీల్ గోర్ కొట్టివేశారు. ఐతే హైకోర్టు నిర్ణయాన్ని చిదంబరం తరపు లాయర్ కపిల్ సిబల్ సుప్రీంకోర్టులో సవాల్ చేసినట్టు సమాచారం.
The team of Central Bureau of Investigation (CBI) officers has left from the residence of P Chiadambaram. https://t.co/SnKbDKhElP
— ANI (@ANI) August 20, 2019
2007లో కేంద్రమంత్రిగా ఉన్న సమయంలో విదేశీ పెట్టుబడల విషయంలో అక్రమాలకు పాల్పడ్డారని చిదంబరంపై ఆరోపణలు ఉన్నాయి. ఐఎన్ఎక్స్ మీడియాలో రూ.305 కోట్ల విదేశీ పెట్టుబడుల అవకతవకల్లో చిదంబరం పాత్ర ఉందంటూ సీబీఐ, ఈడీ కేసు పెట్టాయి. ఈ కేసులో చిదంబరంతో పాటు ఆయన కుమారుడు కార్తీ చిదంబరం, ఇంద్రాణీ ముఖర్జీలు కూడా నిందితులుగా ఉన్నారు. గతేడాది కార్తిని అరెస్ట్ చేసిన దర్యాప్తు సంస్థలు 23 రోజుల పాటు కస్టడీలో ఉంచి విచారించాయి. ఇటీవలే ఇంద్రాణి అప్రూవర్‌గా మారారు.
ఐఎన్ఎక్స్ కేసులో చిదంబరానికి ఢిల్లీ హైకోర్టులో పలుసార్లు తాత్కాలిక ఊరట లభించింది. గత జనవరి 15 వరకు ఆయనను అరెస్టు చేయకుండా కోర్టు ఆదేశాలు జారీచేసింది. ఆ తర్వాత మరోసారి ఆయన అరెస్ట్‌పై వాదనలు జరిగాయి. విచారణ నుంచి తప్పించుకునేందుకు చిదంబరం ప్రయత్నిస్తున్నారని ఈడీ, సీబీఐ వాదించాయి. ఆయన్ను అరెస్ట్ చేసేందుకు అనుమతివ్వాలని కోర్టుకు విజ్ఞప్తి చేశాయి. వారి వాదనలు విన్న ఢిల్లీ హైకోర్టు తీర్పును రిజర్వుచేసి ముందస్తు బెయిల్ నిరాకరించింది
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Chidambaram, Delhi High Court, INX media case, Supreme Court