హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

CBI cases : ఎమ్మెల్యే,ఎంపీలపై సీబీఐ కేసుల్లో దేశంలోనే ఏపీ నెం.1

CBI cases : ఎమ్మెల్యే,ఎంపీలపై సీబీఐ కేసుల్లో దేశంలోనే ఏపీ నెం.1

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

CBI cases against MPs, MLAs : దేశవ్యాప్తంగా ప్రజాప్రతినిధులపై గత ఐదు సంవత్సరాల్లో(2017- 21) ఎన్ని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI)కేసులు నమోదయ్యాయో వెల్లడైంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

CBI cases against MPs, MLAs : దేశవ్యాప్తంగా ప్రజాప్రతినిధులపై గత ఐదు సంవత్సరాల్లో(2017- 21) ఎన్ని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI)కేసులు నమోదయ్యాయో వెల్లడైంది. గడిచిన ఐదేళ్లలో ఎంపీ, ఎమ్మెల్యేలపై సీబీఐ కేసులు నమోదైన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్(Andhrapradesh) టాప్‌లో నిలిచింది. 2017- 21 అక్టోబర్ మధ్య కాలంలో దేశవ్యాప్తంగా 56 సీబీఐ కేసులు నమోదవగా.. వీటిలో 10 కేసులు ఒక్క ఆంధ్రప్రదేశ్ లో నమోదయ్యాయి. ఆ తర్వాతి స్థానాల్లో ఉత్తరప్రదేశ్, కేరళ రాష్ట్రాలు ఉన్నాయి. యూపీ మినహా అత్యధికంగా ఎంపీ, ఎమ్మెల్యేలపై సీబీఐ కేసులు నమోదైన రాష్ట్రాల్లో అత్యధికం బీజేపీ పాలనలో లేని రాష్ట్రాలే ఉన్నాయి. లోక్ సభలో బుధవారం ఎంపీ మాలా రాయ్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ & ట్రైనింగ్ (DOPT)శాఖ మంత్రి జితేంద్రసింగ్‌ ఈ మేరకు లిఖిత పూర్వక సమాధానమిచ్చారు.

2017- 21 అక్టోబర్ మధ్య కాలంలో నమోదైన మొత్తం సీబీఐ కేసుల్లో..ఆంధ్రప్రదేశ్ నుంచి 10, కేరళ 6, యూపీ 6, వెస్ట్ బెంగాల్ 5, అరుణాచల్ ప్రదేశ్ -5, తమిళనాడు 4, ఢిల్లీ 3, బీహార్ 3, మణిపూర్ 3, కర్ణాటక 2, జమ్మూకశ్మీర్ 2, ఛత్తీస్‌గఢ్‌ 1, మేఘాలయ 1, ఉత్తరాఖండ్ 1 ,హర్యాణ 1, మధ్యప్రదేశ్1, మహారాష్ట్ర 1, లక్షద్వీప్ 1 కేసులు నమోదైనట్టు మంత్రి తెలిపారు. సీబీఐ నమోదుచేసిన 56 కేసుల్లో..22 కేసుల్లో చార్జిషీటు నమోదు చేయడం జరిగిందని కేంద్ర మంత్రి వివరించారు.

MCD Results: ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఆప్ ఘన విజయం.. బీజేపీ దూకుడుకు బ్రేకులు

ఇక పార్టీల పరంగా చూసుకుంటే వైసీపీ , టీడీపీ , ఆమ్ ఆద్మీ, తృణమూల్ కాంగ్రెస్ , బీజేపీ, ఆర్జేడీ, ఏఐఏడీఎంకే, కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ నేతలపై కేసులు నమోదైనట్టు కేంద్రం తెలిపింది. అయితే వీళ్ళలో ఏ పార్టీ చట్టసభ్యులు ఎంత మంది ఉన్నారనే దానిపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. మరోవైపు, దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని నేతలపై నమోదైన సీబీఐ కేసుల్లో 2017లో దోషులుగా తేల్చిన వారి శాతం 66.90 కాగా, 2021లో అది 67.56 శాతంగా నమోదైంది. 2020లో అత్యధికంగా 69.83 శాతం మంది దోషులుగా నిర్ధారణ అయినట్టు మంత్రి తెలిపారు.

First published:

Tags: Andhra Pradesh, CBI

ఉత్తమ కథలు