news18-telugu
Updated: July 30, 2020, 12:28 PM IST
ప్రతీకాత్మక చిత్రం
వారు బాధ్యత గత పదవిలో ఉన్న నేవీ అధికారులు. దేశ ప్రజల గౌరవం అందుకునే రక్షణ వ్యవస్థలో పనిచేస్తున్నారు. నలుగురికీ ఆదర్శంగా ఉండాల్సిన అధికారులే తప్పుడు మార్గంలో వెళ్లారు. కాసుల కక్కుర్తి కోసం సొంత డిపార్ట్‌మెంట్‌నే మోసం చేశారు. తప్పుడు బిల్లులు సృష్టించి రూ.6.76 కోట్ల కాజేసిన నలుగురు నేవీ అధికారులపై సీబీఐ ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. కెప్టెన్ అతుల్ కులకర్ణి, కమాండర్ మండర్ గాడ్బోలే, కమాండ్ ఆర్పీ శర్మ, పెట్టి ఆఫీసర్ కుల్దీప్ సింగ్ బఘేల్ తప్పుడు బిల్లులతో మోసం చేశారని కేసులు నమోదు చేశారు.
ముంబై కేంద్రంగా పనిచేసే పశ్చిమ నావికా దళంలో వీరు పనిచేస్తున్నారు. వెస్ట్రర్ నేవల్ కమాండ్ కార్యాలయానికి కంప్యూటర్లతో పాటు ఇతర పరికరాలను చేరవేసినట్లుగా రూ.6.76 కోట్ల మేర తప్పుడు బిల్లులు సృష్టించారు. కానీ వారు చెబుతున్నట్లుగా ఎలాంటి కంప్యూటర్ పరికరాలు ప్రధాన కార్యాలయానికి చేరలేదు. ప్రైవేట్ సంస్థలు స్టార్ నెట్కవర్క్, ఏసీఎంఈ నెట్వర్క్స్, సైబర్ స్పేస్ ఇన్ఫోవిజన్, మోక్షన్ ఇన్ఫోసిస్ సంస్థలతో కలిసి తప్పుడు బిల్లులు, ఇన్వాయిస్లు, పర్చేస్ ఆర్డర్స్, రిసీప్ట్ వోచర్స్ సృష్టించారు. 2016 జనవరి-మార్చి మధ్యలో ఆ వస్తువులను కొనుగోలు చేసినట్లు చూపించారు. పక్కా ఆధారాలతో నలుగురు అధికారులతో పాటు ప్రైవేట్ సంస్థలపై సీబీఐ కేసులు పెట్టింది. ఈ స్కామ్‌కు సంబంధించి పలు చోట్ల సోదాలు కూడా నిర్వహించారు.
Published by:
Shiva Kumar Addula
First published:
July 30, 2020, 12:24 PM IST