హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీబీఐ దూకుడు..తొలి ఛార్జ్ షీట్ దాఖలు..అందులో ఏముంది?

ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీబీఐ దూకుడు..తొలి ఛార్జ్ షీట్ దాఖలు..అందులో ఏముంది?

సీబీఐ

సీబీఐ

ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీబీఐ దూకుడు కనబరుస్తుంది. ఈ కేసులో ఇప్పటికే ఇద్దరినీ అరెస్ట్ చేసిన అధికారులు నేడు కోర్టులో తొలి ఛార్జ్ షీట్ ను దాఖలు చేశారు. ఈ ఛార్జ్ షీట్ లో అభిషేక్ బోయినపల్లి, విజయ్ నాయర్ తో సహా పలువురు ప్రముఖ రాజకీయ, పారిశ్రామిక వేత్తల పేర్లు ఉన్నట్లు తెలుస్తుంది. కాగా ఈ కేసులో అధికారులు ఇద్దరినీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. 

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

ఢిల్లీ లిక్కర్ స్కాం (Delhi Liquor Scam)లో సీబీఐ దూకుడు కనబరుస్తుంది. ఈ కేసులో ఇప్పటికే ఇద్దరినీ అరెస్ట్ చేసిన అధికారులు నేడు కోర్టులో తొలి ఛార్జ్ షీట్ ను దాఖలు చేశారు. ఈ ఛార్జ్ షీట్ లో అభిషేక్ బోయినపల్లి, విజయ్ నాయర్ తో సహా పలువురు ప్రముఖ రాజకీయ, పారిశ్రామిక వేత్తల పేర్లు ఉన్నట్లు తెలుస్తుంది. ఈ కేసులో అధికారులు ఇద్దరినీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కాగా సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ లో ఏముందో తెలియరాలేదు. అయితే మధ్యాహ్నం దీనిపై కోర్టులో విచారణ జరగనుంది.

రాజస్థాన్ లో తీవ్రస్థాయికి పొలిటికల్ హీట్..పైలట్ ఎప్పటికీ సీఎం కాలేడన్న గెహ్లాట్

10 వేల పేజీలతో తొలి ఛార్జ్ షీట్..

ఈ కేసులో సీబీఐ ఏడుగురిపై అభియోగాలు మోపినట్లు తెలుస్తుంది. ఆప్ నేత విజయ్ నాయర్, అభిషేక్ బోయినపల్లితో సహా మరికొందరి పేర్లు ఇందులో చేర్చినట్లు తెలుస్తుంది. అయితే ఇందులో మిగతా వారు ఎవరు అనేది ఇప్పుడు సస్పెన్స్ నెలకొంది. ఇక మనీష్ సిసోడియా పేరును కూడా సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ లో పేర్కొనలేదు. అయితే ప్రస్తుతం మనీష్ సిసోడియాను విచారిస్తున్న నేపథ్యంలో సిబిఐ మనీష్ సిసోడియా పేరును చేర్చలేదని తెలుస్తుంది. దీనికి సంబంధించి 10 వేల పేజీలతో కూడిన తొలి ఛార్జ్ షీట్ సిబిఐ కోర్టుకు సమర్పించింది. ఈ ఛార్జ్ షీట్ ను ఈనెల 30న కోర్టు పరిశిలించనున్నట్టు తెలుస్తుంది.

Rahul Gandhi: మహిళా ఎమ్మెల్యేకు ముద్దుపెట్టిన రాహుల్ గాంధీ.. బీజేపీ సెటైర్లు..కాంగ్రెస్ స్ట్రాంగ్ రియాక్షన్

డిప్యూటీ సీఎంతో సహా పలువురు ప్రభుత్వ ఉద్యోగులు కూడా..

ఈ కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాతో సహా పలువురు రాజకీయ వేత్తలు, ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నట్టు తెలుస్తుంది. A1గా నరేంద్ర సింగ్, A2గా కులదీప్ సింగ్, A3గా విజయ్ నాయర్, A4గా అభిషేక్ బోయినపల్లిని చేర్చింది సీబీఐ.

రెండు తెలుగు రాష్ట్రాల్లో సోదాలు..

ఈ కేసుకు సంబంధించి ఈడీ (Enforcement Directorate), సీబీఐ రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తృత తనిఖీలు చేశారు. ఈ కేసులో హైదరాబాద్ కు చెందిన రామచంద్ర పిళ్లై, చార్టెడ్ అకౌంటెంట్ బుచ్చిరెడ్డిని అధికారులు విచారించారు. కాగా శరత్ చంద్ర రెడ్డి, బినోయ్ బాబులను ఈ కేసులో ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మరి రానున్న రోజుల్లో ఈ కేసులో ఇంకెవరి పేర్లు బయటకు వస్తాయో చూడాలి.

First published:

Tags: Delhi liquor Scam