15 మంది ఐటీ అధికారుల బలవంతపు పదవీ విరమణ

వారిపై అవినీతి, ఇతర ఆరోపణలు, సీబీఐ నెట్‌లో ఉన్న కారణంగా వారిని పదవీకాలం కంటే ముందే వారితో బలవంతంగా విరమణ చేయించింది.

news18-telugu
Updated: September 27, 2019, 9:19 PM IST
15 మంది ఐటీ అధికారుల బలవంతపు పదవీ విరమణ
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సిబిడిటి) పదవిలో ఉన్న మరో 15 మంది సీనియర్ అధికారులను తప్పనిసరిగా పదవీ విరమణ చేయించింది. వారిలో ప్రిన్సిపల్ సీఐటీ, సీఐటీ, జేసీఐటీ, అడిషనల్ సీఐటీ, ఏసీఐటీ స్థాయి అధికారులు ఉన్నారు. ప్రజా ప్రయోజనాల కోసం ప్రాథమిక నిబంధన 56 (జె) కింద సీబీడీటీ ఈ నిర్ణయం తీసుకుంది. వారిపై అవినీతి, ఇతర ఆరోపణలు, సీబీఐ నెట్‌లో ఉన్న కారణంగా వారిని పదవీకాలం కంటే ముందే వారితో బలవంతంగా విరమణ చేయించింది. పన్నుల శాఖలో ఉండే కొందరి వల్ల వ్యవస్థకు చెడ్డపేరు వస్తుందని ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎర్రకోట సాక్షిగా చేసిన ప్రసంగంలో పేర్కొన్నారు. తమ అధికారాలను దుర్వినియోగం చేసి పన్ను చెల్లింపుదారులను వేధిస్తున్నారని మోదీ అన్నారు. అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 49 మందిని (అందులో 12 మంది ఉన్నత స్థాయి అధికారులు) ఈ నిబంధన కింద తప్పనిసరి పదవీ విరమణ చేయించారు.

బలవంతపు పదవి విరమణ చేసిన వారు
ఓపీ మీనా

శైలేంద్ర మామిడి
పీకే బజాజ్


సంజీవ్ ఘాయ్
జయప్రకాష్అప్పలరాజు
రాకేష్ హెచ్.శర్మ
నితిన్ గార్గ్
ఫజులుల్లా
కృపా సాగర్ దాస్
పి.జోస్ కుంజిప్పాలు
సీజే విన్సెంట్
టీకే భట్టాచార్య

కమలేష్ కుమార్ త్రిపాఠీ

ఎస్ఆర్ సేనాపతి
First published: September 27, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>