హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

బంక్ లో పెట్రోల్ పోయించుకుని యజమానిపై అమానుషం.. కారణం ఏంటంటే..

బంక్ లో పెట్రోల్ పోయించుకుని యజమానిపై అమానుషం.. కారణం ఏంటంటే..

కిడ్నాప్ కు యత్నిస్తున్న దుండగులు

కిడ్నాప్ కు యత్నిస్తున్న దుండగులు

Uttar pradesh: నలుగురు వ్యక్తులు ఎస్‌యూవీలో వచ్చి పెట్రోల్ బంక్ కు వచ్చి ట్యాంక్ ఫుల్ చేయించుకున్నారు. ఆ తర్వాత.. బంక్ యజమానితో వాగ్వాదానికి దిగారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Uttar Pradesh, India

ఉత్తర ప్రదేశ్ లో (Uttar Pradesh)  షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. వారణాసికి దగ్గరలో గల శివపురి లో జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. తర్నా ప్రాంతంలో ఉన్న పెట్రోల్ బంక్ లో (Petrol bunk) ఎస్‌యూవీలో నలుగురు వ్యక్తులు వచ్చారు. వారి వెహికిల్ లో ఫుల్ గా పెట్రోల్ కొట్టించుకున్నారు. ఆ తర్వాత.. సిబ్బంది డబ్బులు ఇవ్వమనగానే మెనెజర్ దగ్గరకు వెళ్లారు. అక్కడ కాసేపు వాగ్వాదానికి దిగారు.

అంతే కాకుండా.. మెనెజర్ ను గట్టిగా పట్టుకుని కారులో ఎక్కించుకుని కిడ్నాప్ (Kidnap) చేయడానికి ప్రయత్నించారు. అయితే.. అక్కడ ఉన్న సిబ్బంది జోక్యం చేసుకున్నారు. వారంతా కలసి ప్రతిఘటించడంతో పెట్రోల్ బంక్ యజమానిని అక్కడే వదిలేసి, నిందితులు పారిపోయారు. ఘటన అంతా అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. దీంతో అక్కడ ఉన్న సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

ఇదిలా ఉండగా దేశ రాజధాని ముంబైలో షాకింగ్ ఘటన సంభవించింది.

ఒక వ్యక్తి నో పార్కింగ్ జోన్ లో స్కూటీపెట్టాడు. దీంతో లేడీ పోలీసు, మరో సిబ్బందితో కలిసి వెహికిల్ ను పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇదిలా ఉండగా అతను స్టేషన్ లోనే పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. దీంతో అక్కడ ఘర్షణ వాతావరణం తలెత్తింది.

ముంబైలోని నలసోపరాలోని పాటన్ కర్ పార్క్ లో బ్రజేష్ కుమార్ అతని భార్య డాలీ కుమారి సింగ్ పోలీసు స్టేషన్ లో రచ్చ చేశారు. బ్రజేష్ పోలీసుల ఆధీనంలో ఉన్న తన స్కూటీని బైటకు తీసుకెళ్లడానికి ప్రయత్నించాడు. అడ్డుకున్న లేడీ కానిస్టేబుల్ పై దాడికి ప్రయత్నించాడు. కాగా, అతున.. మహిళ పోలీసు ప్రజ్ఞా శివరామ్ దల్వీని దుర్భాషలాడడం ప్రారంభించాడు. ఆమె కొన్నినెలలుగా కావాలనే నన్ను టార్గెట్ చేసిందని వాపోయాడు. దీంతో అతను ఆమెతో గొడవపడ్డాడు.

ఈ క్రమంలో అక్కడ ఘర్షన తలెత్తింది. దీంతో అక్కడున్న వారు ఇతడిని సముదాయించారు. లేడీపోలీసుపైన తానుకూడా పోలీసులకు ఫిర్యాదు చేశానని తెలిపాడు.లేడీ పోలీసుతో వాగ్వాదానికి దిగిన వ్యక్తి ఒక లాయర్. అతడిని గొడవకు దిగకుండా భార్య సర్ది చెప్పింది. కానీ ఇద్దరు వాదులాడుకున్నారు. పోలీసులు వచ్చి, భెలౌరియా అనే వ్యక్తిని స్టేషన్లోకి తీసుకెళ్లారు.ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Published by:Paresh Inamdar
First published:

Tags: Crime news, Uttar pradesh

ఉత్తమ కథలు