Union
Budget 2023

Highlights

హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

వామ్మో.. ఇదెక్కడి ఘోరంరా నాయనా..? స్కూల్లో మధ్యాహ్న భోజనానికి పశువుల మేత బస్తాలను పంపారు..!

వామ్మో.. ఇదెక్కడి ఘోరంరా నాయనా..? స్కూల్లో మధ్యాహ్న భోజనానికి పశువుల మేత బస్తాలను పంపారు..!

ఆ పాఠశాలకు ఓ వాహనంలో మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించినవంటూ బస్తాల కొద్దీ ఆహార పదార్థాలు వచ్చాయి. వాటిని చూసి విద్యార్థులు అవాక్కయ్యారు. వారి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతకీ అసలేం జరిగిందంటే..

    దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకానికి భారీ స్థాయిలోనే ఆదరణ లభిస్తోన్న సంగతి తెలిసిందే. పేద విద్యార్థులకు మధ్యాహ్నం పాఠశాలల్లోనే భోజనం అందించాలన్న సంకల్పంతో ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహాయ సహకారాలతో పథకాన్ని అమలు చేస్తున్నాయి. అయితే ఇటీవల మహారాష్ట్రలో జరిగిన ఓ ఘటన రాజకీయంగా కలకలం రేపుతోంది. విద్యార్థులకు పెట్టే ఆహారం ఇదా అన్న ప్రశ్నలను రేకెత్తిస్తున్నాయి. మహారాష్ట్రలోని పుణె నగరంలో ‘పూణె మున్సిపల్ కార్పొరేషన్‘ ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలవుతోంది. దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ఉన్న సమయంలో కూడా విద్యార్థులకు మధ్యాహ్న భోజనానికి సంబంధించిన ఆహార పదార్థాలను పిల్లలకే నేరుగా అందించారు.

    స్థానిక అధికారులు దీనికి సంబంధించిన రికార్డులను, పర్యవేక్షణ పనులను చూసుకున్నారు. అయితే ఇటీవల విద్యార్థులకు అందించండంటూ ఆహార పదార్థాలు పూణెలోని 58వ నెంబర్ స్కూలుకు చేరుకున్నాయి. అయితే అవి మనుషులు తినే ఆహార పదార్థాలు కావు. పశువులకు ఆహారంగా పెట్టే వాటిని కాస్తా, పిల్లలకు పెట్టండంటూ స్కూళ్లకు సరఫరా చేయడంపై విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి. ఈ విషయం తెలిసి విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

    ఇది కూడా చదవండి: హైదరాబాద్.. రోడ్డు పక్కనే ఓ అట్టపెట్టె చుట్టూ కుక్కలు చేరి అరుపులు.. ఏముందా అని ఓపెన్ చేసి చూసిన వాళ్లందరికీ..

    స్థానికులు దీన్ని కాస్తా నెట్టింట వైరల్ చేయగా ‘ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ)’ దీనిపై స్పందించింది. ఎఫ్ఎస్ఎస్ఏఐ అధికారులు రంగంలోకి దిగి ఆ ఆహార పదార్థాల బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయమై పూణె మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ను స్పందించమని విలేకరులు అడిగారు. ‘ఎక్కడో తప్పు జరిగి ఉంటుంది. సమాచార లోపం వల్లే ఇది జరిగి ఉంటుంది. దీనిపై ఇప్పటికే విచారణ ప్రారంభించాం. బాధ్యులైన వారిని తప్పకుండా శిక్షిస్తాం‘ అని మేయర్ స్పందించారు. ప్రస్తుతం ఈ ఘటన నిమిత్తం విచారణ జరగుతోంది. ఈ ఘటన కాస్తా రాజకీయంగా కూడా వాగ్వాదాలు జరుగుతుండటం గమనార్హం.

    ఇది కూడా చదవండి: చేయని నేరానికి 20 ఏళ్లు జైల్లోనే మగ్గిపోయిన విష్ణు.. 43 ఏళ్ల వయసులో నిర్దోషిగా విడుదలయ్యాక ప్రస్తుతం ఏం చేస్తున్నాడంటే..

    First published:

    Tags: Crime news, Crime story, CYBER CRIME, Hyderabad, Maharashtra, Pune news, Telangana

    ఉత్తమ కథలు