హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

హైదరాబాద్ లో అతిపెద్ద క్యాథలిక్ వేడుక.. హజరుకానున్న ముంబాయికి చెందిన ఫెమస్ క్రిస్టియన్ మత గురువులు...

హైదరాబాద్ లో అతిపెద్ద క్యాథలిక్ వేడుక.. హజరుకానున్న ముంబాయికి చెందిన ఫెమస్ క్రిస్టియన్ మత గురువులు...

మహాఘన పూల అంథోని (ఫైల్)

మహాఘన పూల అంథోని (ఫైల్)

Catholic programme: సెప్టెంబర్ 15న అతిపెద్ద క్రైస్తవ వేడుకకు వేదికకు హైదరాబాద్ వేదిక కానుంది. ఈ కార్యక్రమానికి అగ్రపీఠం నుంచి ఇద్దరు కార్డినళ్ళు, 15 మంది పీఠాధిపతులు, 500 మంది గురువులు హజరుకానున్నారు. మహాఘన పూల ఆంథోనీ గారు కార్డినల్ అయిన సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతా ప్రార్ధన జరపనున్నారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Goa, India

సెప్టెంబర్ 15న హైదరాబాద్ మహనగరం అతి గొప్ప క్యాథలిక్ వేడుకకు వేదిక కానున్నది. ఈ వేడుకలో కొత్తగా నియమితులైన కార్డినల్ పూలఆంథోనీతో పాటు ముంబాయి కార్డినల్ ఒస్వాల్డ్ గ్రేసియస్, 15 మంది పీఠాదిపతులతో సహా 500 మంది గురువులు పాల్గొననున్నారు. సెంట్మరీస్ హైస్కూల్ ప్రాంగణంలో సాయంత్రం 5 గంటలకు ప్రారంభం కాబోయే మహోత్సవ ప్రధాన పూజలో వేలాదిమంది క్రైస్తవ, కథోలిక విశ్వాసులు పాల్గొననున్నారు. ఇటీవల ఆగస్టు 27న వాటికన్ నగరంలో జరిగిన వేడుకలలో పోప్ ఫ్రాన్సిస్ గారు హైదరాబాద్ అగ్రపీఠాధిపతి మహాఘన పూల అంథోని గారిని కార్డినల్గా నియమించిన సంగతి విదితమే.

ఈ సందర్భంగా కార్యక్రమ మీడియా కమిటీ కన్వీనర్ ఫాదర్ అల్లం ఆరోగ్యరెడ్డి మాట్లాడుతూ 2000 సం॥రాల తెలుగు క్రైస్తవ చరిత్రలో మొట్టమొదటి తెలుగు కార్డినల్గా పూల అంథోనిగారు నిలిచారని, ఆర్చిబిషప్ పూలఅంథోనిగారు కార్డినల్గా పదోన్నతి పొందిన సందర్భంగా కృతజ్ఞతా పూర్వకంగా పూజను నిర్విహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమములో ఆగ్రా, అగ్ర పీఠాధిపతి రఫేమాంజలి, భారతదేశం మరియు నేపాల్ యొక్క అపోస్తలిక్ మున్షియో మరియు వారి కార్యదర్శులు వికార్ జనరల్ గాబ్రియెల్ పెన్సే. బెర్హంపూర్ పీఠాదిపతి శరత్చంద్రనాయక్, బెంగుళూరు వికార్డజనరల్ సి. ఫ్రాన్సిస్, బల్లారి పీరాధిపతి హెన్రీ డినేజా హాజరుకానున్నారని తెలిపారు.

ఆంద్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాకు చెందిన పీఠాధిపతి పూల ఆంథోనీ గారు జనవరి 2021, హైదరాబాద్ అగ్ర పీఠాదిపతిగా అభిషేకింపబడి ఇప్పుడు కార్డినల్గా ఎదిగారు. ఇటీవల పోపుగారు. ప్రపంచవ్యాప్తంగా 21 మందిని కొత్తగా కార్డినల్గా ప్రకటించగా వారిలో ఇద్దరు భారతదేశం చెందినవారు. వారిలో మొదటివారు పూలఅంథోని కాగా రెండవవారు గోవా అగ్రపీఠాధిపతి ఫిలిప్నారి అంటోనియోగారు. కార్డినల్గా నియమితులై రోమ్ నుండి తిరిగివచ్చిన తరువాత పూల ఆంథోనీగారు మాట్లాడుతూ ఇది కథోలిక్ సంఘానికి గర్వకారణమని, పోప్ ఫ్రాన్సిస్ గారి ఆదేశాల మేరకు పేదలకు మరియు అనగారిన ప్రజలకు సేవచేస్తానని తెలిపారు. కార్డినల్ పూల ఆంథోనీ ఫిబ్రవరి 1992 గురువుగా నియమితులై ఫిబ్రవరి 2008లో కర్నూలు పీఠాదిపతులుగా నియమితులైనారు.

వారి స్వస్థలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని కర్నూలుజిల్లా, చెందుకూరు గ్రామము. పూల ఆంథోనీగారు కర్నూలు మైనర్ సెమినరీ, సెంట్ పీటర్స్ మేజర్ సెమినరి బెంగుళూరులో విద్యనభ్యసించినారు. ఆయన యూత్ కమిషన్ చైర్మన్ గా, ఆంద్రప్రదేశ్ సోషల్ సర్వీస్ సొసైటికార్యదర్శిగా తెలుగుకథోలిక పీఠాదిపతుల సమాఖ్యకోశాధికారిగా వివిధ హోదాలలో సేవలందించారు. పూల ఆంథోనీగారు హైదరాబాద్ అగ్రపీఠానికి కార్డినల్ హోదాలో కొనసాగనున్నారు. దీనితో పాటుగా ఆయన ఆదిలాబాద్ , కడప , ఖమ్మం , కర్నూలు, నల్గొండ మరియు వరంగల్ పీఠాలను పర్యవేక్షిస్తారు. ఈ కార్యక్రమ బాధ్యతలను హైదరాబాద్ అగ్రపీఠం యొక్క వికార్జనరల్ యెరువ బాలశౌరి మరియు ఛాన్సలర్, ప్రొక్యూరేటర్ విక్టర్ ఇమాన్యుయెల్ గారు పర్యవేక్షిస్తారు.

Published by:Paresh Inamdar
First published:

Tags: Hyderabad, Meeting

ఉత్తమ కథలు