రోడ్డు ప్రమాదాలపై కేంద్రం దృష్టి... బాధితుల కోసం కొత్త పథకం?

దేశవ్యాప్తంగా రోడ్లను ఎంత చక్కగా చేసినా... ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. లాక్‌డౌన్ నిబంధనలు ఎత్తేశాక... ప్రమాదాలు మరింత ఎక్కువైపోయాయి.

news18-telugu
Updated: August 31, 2020, 12:10 PM IST
రోడ్డు ప్రమాదాలపై కేంద్రం దృష్టి... బాధితుల కోసం కొత్త పథకం?
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
జస్ట్ క్షణ కాలంలో జరిగిపోతాయి రోడ్డు ప్రమాదాలు. అప్పటివరకూ ఓ లెక్క... ప్రమాదం తర్వాత మరో లెక్క. కాలం వెనక్కి వెళ్తే బాగుండని ప్రతీ క్షణం అనిపించే ఆలోచన. చాలా రోడ్డు ప్రమాదాలకు అతి వేగమే కారణమైనప్పటికీ... ప్రమాద బాధితుల్లో ఎక్కువ మంది పేదలు, మధ్యతరగతి వారే ఉంటున్నారు. దీనికి తోడు... కరోనా లాక్‌డౌన్ నిబంధనలు ఎత్తివేస్తున్న కొద్దీ... రోడ్డు ప్రమాదాలు పెరుగుతూ ఉన్నాయి. ఈ పరిస్థితుల్ని లెక్కలోకి తీసుకొని కేంద్రంలోని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం... ఓ కొత్త పథకాన్ని తేబోతోంది. ప్రమాదంలో గాయపడిన బాధితులకు తక్షణ సాయం కింద రూ.2.5 లక్షల వరకు నగదు రహిత చికిత్స అందించేలా పథకం త్వరలోనే ప్రారంభించబోతున్నట్లు తెలిసింది.

జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ సహకారంతో కేంద్ర రోడ్లు, రహదారుల శాఖ సొంత నిధులతో మోటర్ వాహన ప్రమాద నిధిని ఏర్పాటు చేయబోతోందని తెలిసింది. దేశంలోని 21,000 కంటే ఎక్కువ ఆస్పత్రులకు ఈ స్కీం బాధ్యతలు అప్పగించి... రోడ్డు ప్రమాద బాధితులకు రూ.2.5 లక్షలలోపు క్యాష్ లెస్ ట్రీట్‌మెంట్ ఇవ్వనుందని తెలిసింది. ఇందులో ప్రమాద బాధితులకు ఇన్సూరెన్స్ ఉంటే... ట్రీట్‌మెంట్ ఖర్చును పాలసీలకు తగ్గట్టుగా ఇన్సూరెన్స్ కంపెనీ భరిస్తుంది. 2019 సెప్టెంబర్‌లో మోటర్ వెహికల్ సవరణ చట్టంలో రోడ్డు యాక్సిడెంట్ ఫండ్ ఏర్పాటుకి పార్లమెంట్ ఆమోదం తెలిపింది. దీని వల్ల 13 కోట్ల కుటుంబాలకు మేలు జరుగుతుందని అంచనా. ఐతే... ఈ స్కీమ్ ఎప్పటి నుంచి అమల్లోకి తేబోతున్నదీ కేంద్రం ఇంకా చెప్పలేదు. త్వరలోనే అమలవుతుందనే అంచనా ఉంది.
Published by: Krishna Kumar N
First published: August 31, 2020, 12:10 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading