జన్‌ధన్ ఖాతాదారులారా అలర్ట్.. ఈ తేదీల్లోనే విత్‌డ్రాకు అవకాశం..
ప్రతీకాత్మక చిత్రం
జన్‌ధన్ ఖాతాదారులు తమ అకౌంట్లోని నగదును విత్ డ్రా చేసుకునేందుకు కేంద్రం కొత్త విధానాన్ని అమలులోకి తీసుకొచ్చింది. బ్యాంకు ఖాతా చివరి సంఖ్య ఆధారంగా ఆయా తేదీల్లో మాత్రమే నగదు డ్రా చేసుకునేలా అవకాశం కల్పించారు.
కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా జన్‌ధన్ ఖాతాదారుల కోసం కేంద్రం సరికొత్త నిర్ణయం తీసుకుంది. బ్యాంకుల్లో డబ్బును డ్రా చేసుకునేందుకు వచ్చే ఖాతాదారులు సామాజిక దూరాన్ని పాటించాలనే ఉద్దేశంతో కొత్త విధానాన్ని అమలులోకి తీసుకొచ్చారు. జన్‌ధన్ ఖాతాలు ఉన్న ప్రజలు.. వారి ఖాతాల నంబర్ ఆధారంగా ఆయా తేదీల్లో నగదు విత్‌డ్రా చేసుకునేలా ఏర్పాట్లు చేశారు. ఇదిలావుంటే.. లాక్డౌన్ నేపథ్యంలో ‘పీఎం గరీబ్ కల్యాణ్ ప్యాకేజీ కింద జన్‌ధన్ యోజన మహిళా ఖాతాదారులకు ఏప్రిల్ నెలకు సంబంధించిన రూ.500ను ట్రాన్స్ఫర్ చేయాలని బ్యాంకర్లను కేంద్రం ఆదేశించింది. అందుకు సంబంధించిన నగదును ఏప్రిల్ 3 నుంచి 9 తేదీల మధ్య ఖాతాలో నగదు జమచేయనున్నారు.
నగదు డ్రా చేసుకునే తేదీలివే..
జన్‌ధన్ ఖాతాదారులు తమ ఖాతా నంబరు 0 నుంచి 1తో ముగిస్తే.. వారంతా ఏప్రిల్ 3న ఖాతా నుంచి డబ్బును డ్రా చేసుకునేలా ఏర్పాట్లు చేశారు. 2 నుంచి 3 నంబర్‌తో ముగిసే వారు 4వ తేదీన, 4 నుంచి 5 నంబరు ఉన్న ఖాతాదారులు 7న, ఆరు నుంచి ఏడు నంబర్ ఉన్న వారు 8న, 8 నుంచి 9 నంబరు ఉన్న ఖాతాదారులు 9వ తేదీన తమ ఖాతాల నుంచి నగదు తీసుకునే అవకాశం కల్పించినట్టు ఇండియన్ బ్యాంకు అసోసియేషన్ ఒక ప్రకటనలో తెలిపింది. కేవైసీ పత్రాలు లేవన్న కారణంతో జన్‌ధన్ వంటి చిన్న ఖాతాలను స్తంభింపజేయవద్దని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశించింది. జన్‌ధన్ ఖాతా తెరిచిన ప్రతి మహిళ ఖాతాలో రూ.500 చొప్పున మొత్తం మూడు విడతలుగా ఖాతాలో జమచేయనున్నారు.
Published by:Narsimha Badhini
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.