ఎద్దు, రూ.25వేలు చోరీ... ఎస్పీ ఎంపీ ఆజంఖాన్‌పై కేసు నమోదు...

తమ ఇంటిపై దాడి చేసిన ఆజంఖాన్... ఎద్దుతోపాటూ... రూ.25వేల క్యాష్ పట్టుకుపోయారని బాధితులు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు.

Krishna Kumar N | news18-telugu
Updated: August 30, 2019, 1:56 PM IST
ఎద్దు, రూ.25వేలు చోరీ... ఎస్పీ ఎంపీ ఆజంఖాన్‌పై కేసు నమోదు...
ఆజం ఖాన్(ఫైల్ ఫొటో)
  • Share this:
సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ఆజంఖాన్‌ ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూనే ఉంటారు. తాజాగా ఆయనపై చోరీ కేసు నమోదైంది. ఉత్తరప్రదేశ్... రాంపూర్‌లోని తమ ఇంటిపై ఆజంఖాన్... తన ఐదుగురు అనుచరులతో వచ్చి దాడి చేశారనీ, ఇల్లంతా చిందరవందర చేసి... రూ.25వేల నగదుతోపాటూ... బయట ఉన్న ఎద్దును కూడా పట్టుకుపోయారని బాధితులు పోలీసులకు తెలిపారు. ఐతే... ఇది ఇప్పుడు జరిగింది కాదు. 2016 అక్టోబర్ 15న జరిగింది. ఘోసియాన్ యతీంఖానాలోని ఆ ఇంటిపై దాడి చేయడానికి కారణమేంటంటే... ఆ ఇల్లు ఉన్న చోట... ఓ స్కూల్ నిర్మించాలని ప్రభుత్వం డిసైడైంది. అందువల్ల ఆ ఇంట్లోని వారిని ఖాళీ చేసి వెళ్లిపోవాలని ఆజంఖాన్ ఆదేశించారు. అసిఫ్, జకీర్ అలీ... ఆ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. వాళ్లు అద్దె చెల్లిస్తున్నట్లు ఆధారాలుగా చెల్లింపు రసీదులు కూడా ఉన్నాయి. పోలీసులు ఆజంఖాన్, అతని ఐదుగురు అనుచరులతోపాటూ... మరో 40 మంది పేర్లను కూడా చేర్చినట్లు తెలిసింది.

రాంపూర్‌లో భూకబ్జాలకు సంబంధించి ఆజంఖాన్‌పై ఉన్న 29 కేసుల్లో ముందస్తు బెయిల్‌ని బుధవారం తిరస్కరించింది కోర్టు. 29లో 28 కేసులు... అలియాగంజ్ రైతులు పెట్టినవే. ఇప్పటివరకూ ఈ రాంపూర్ ఎంపీపై... దాదాపు 50 భూకబ్జా కేసులు, వివాదాస్పద వ్యాఖ్యల కేసులు, పుస్తకాల చోరీ కేసులు, వక్ఫ్ భూముల అక్రమ ఆక్రమణ కేసులు నమోదయ్యాయి.

First published: August 30, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు