• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • CASE FILED IN BIHAR COURT AGAINST CHINESE PRESIDENT JINPING OVER CORONAVIRUS OUTBREAK BN

చైనా అధ్యక్షుడిపై బీహార్‌లో కేసు.. సాక్షులుగా మోదీ, ట్రంప్..

చైనా అధ్యక్షుడిపై బీహార్‌లో కేసు.. సాక్షులుగా మోదీ, ట్రంప్..

గతంలో మాదిరిగా ఈ సారి ప్రభుత్వం బహిరంగంగా ఈ విషయాన్ని ప్రకటించలేదు. Xiaomi's Mi Browser Pro, Baidu's సెర్చ్ యాప్స్ మీద బ్యాన్ విధించినట్టు రాయిటర్స్ తెలిపింది. అయితే, మొత్తం ఎన్ని యాప్స్ మీద బ్యాన్ ఉందనే విషయం చెప్పలేదు.(Image : AP)

చైనాలో పుట్టిన ఈ వైరస్‌పై మొదటి నుంచి పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రపంచంలోని దేశాలన్నీ కరోనా వైరస్‌ను కృతిమంగా తయారు చేశారనే వాదనలు విన్పిస్తున్నాయి.

  • Share this:
    రోజురోజూకీ ప్రపంచ దేశాలను కరోనా వైరస్ గడగడలాడిస్తోంది. అయితే చైనాలో పుట్టిన ఈ వైరస్‌పై మొదటి నుంచి పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రపంచంలోని దేశాలన్నీ కరోనా వైరస్‌ను కృతిమంగా తయారు చేశారనే వాదనలు విన్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ వ్యాప్తికి చైనా దేశమే కారణమంటూ ఆ దేశాధ్యక్షుడు జిన్‌పింగ్‌పై బిహార్‌లోని పశ్చిమ చంపారన్ జిల్లా కోర్టులో కేసు నమోదయ్యింది. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు చైనానే సూత్రధారి అని, వైరస్ పట్ల ఆ దేశాధ్యక్షుడు జి జిన్‌పింగ్ ప్రపంచ దేశాలకు సమాచారం ఇవ్వడం అందించడంలో విఫలమయ్యారని, ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేనస్‌పై బీహార్‌కు చెందిన న్యాయవాది మురాద్ అలీ స్థానిక న్యాయస్థానంలో ఫిర్యాదు చేశారు. ఈ కేసు జూన్ 16న విచారణకు రానుంది.

    పిటిషన్‌లో చైనా వైరస్ వ్యాప్తి చేసిందనేందుకు ప్రధాన సాక్షులుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీలను చేర్చారు. ఐపీసీ 269, 270, 302, 307, 500, 504, 120 బి సెక్షన్ల కింద కేసు నమోదయ్యింది. అయితే.. 2019 డిసెంబర్‌లో కరోనా వైరస్ వ్యాప్తి మొదలయ్యినప్పటి నుంచి ప్రపంచంలోని అనేక దేశాలు ఈ వైరస్‌కు బాధ్యులను చేశాయి.
    Published by:Narsimha Badhini
    First published:

    అగ్ర కథనాలు